Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) అనేది కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ. ఈ కంపెనీ యొక్క బైక్స్ ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో ఇప్పటికి ముందంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తన వినియోగదారుల సౌలభ్యం కోసం 'మేక్ ఇట్ యువర్' ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కింద కంపెనీ తన వినియోగదారులకు జాకెట్స్, హెల్మెట్స్ మరియు టీ-షర్టులు వంటి వాటిని అందిస్తోంది.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield కంపెనీ తీసుకువచ్చిన ఈ కార్యక్రమం అతి తక్కువ కాలంలోనే చాలా ఆదరణ పొందగలిగింది. కంపెనీ ఇప్పుడు ఇందులో ఇప్పుడు రైడర్ జాకెట్స్ కూడా అందించనున్నట్లు తెలిపింది. కావున కొనువులు చేయాలనుకునే కస్టమర్లు తమకు నచ్చిన జాకెట్ (కస్టమైజేషన్) పొందవచ్చు.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

ఎక్కువగా బైక్ రైడింగ్ చేయడంలో ఆసక్తి చూపించే ఔత్సాహికులు ఇప్పుడు తమకు నచ్చిన కస్టమైజేషన్ రైడింగ్ జాకెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు కస్టమర్లు తమకు నచ్చిన జాకెట్ యొక్క కలర్స్, లైనర్ మరియు ఆర్మోర్స్ వంటి వాటిని కొనువులు చేయవచ్చు. ఈ జాకెట్స్ యొక్క కలర్ మాత్రమే కాకుండా, వింటర్స్ మరియు రెయిన్ లైనర్‌లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తుంది.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield ప్రవేశపెట్టిన ఈ 'మేక్ ఇట్ యువర్' ప్లాట్‌ఫామ్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంపెనీ మరిన్ని ఉత్పత్తులను విక్రయించనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న వస్తువులను కస్టమర్లు ఎంపిక చేసి తరువాత కస్టమైజ్ చేసుకోవచ్చు.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

'మేక్ ఇట్ యువర్' రైడింగ్ జాకెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా, భద్రతను పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ జాకెట్స్ కొలువులు చేసే కస్టమర్ల యొక్క చెస్ట్, షోల్డర్ మరియు రైడర్ బ్యాక్ వంటి ప్రాంతాల రక్షణ కోసం, అక్కడ కవచాన్ని జోడించుకోవచ్చు. అంతే కాకుండా కొనువులుదారులకు నాక్స్ మరియు డి 30 కవచాలను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield అందిస్తున్న ఈ ఉత్పత్తులను కొనువులు చేయాలనుకునే కస్టమర్లు Google Playstore నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మేక్ ఇట్ యువర్ (MIY) విభాగంలో అందించిన ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా వాటిని పొందవచ్చు. ఇందులో హెల్మెట్‌లు, టీ-షర్టులు మరియు జాకెట్లు అందుబాటులో ఉంటాయి.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

అక్కడ మీకు కనిపించే టీ-షర్టు మరియు హెల్మెట్ యొక్క కలర్ మార్చడంతో పాటు, అందులో కనిపించే గ్రాఫిక్స్ కూడా మార్చవచ్చు. టీ-షర్టులో ఇచ్చిన ప్రింట్‌ని మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ అప్లికేషన్‌లో హెల్మెట్ ప్రారంభ ధర రూ. 3,200 మరియు టీ-షర్టు ధర రూ. 1,250 వరకు ఉంటుంది.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 'మేక్ ఇట్ యువర్స్' ప్రోగ్రామ్ కింద, హెల్మెట్‌పై 7,000 విభిన్న కస్టమైజేషన్ ఎంపికలు అందించబడుతున్నాయి. హెల్మెట్ యొక్క రంగును మార్చడమే కాకుండా, హెల్మెట్ యొక్క స్టిక్కర్ మరియు దానిపై వ్రాసిన సంఖ్యలను కూడా మార్చవచ్చు.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

ఇందులోని టీ-షర్టులపై కూడా దాదాపు 15,000 కంటే ఎక్కువ కస్టమైజేషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈని ద్వారా టి- షర్టుపై ప్రింట్, టెక్స్ట్, గ్రాఫిక్స్ మరియు కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇన్ని ఎంపికలు అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్ తనకు నచ్చిన ఆప్సన్ ఎంచుకోవచ్చు. 'మేక్ ఇట్ యువర్స్' యాప్ లో కస్టమర్ బుక్ చేసుకున్న కేవలం 15 రోజుల నుంచి 20 రోజుల్లో డెలివరీ పొందవచ్చు.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield కంపెనీ 'మేక్ ఇట్ యువర్స్' ప్రోగ్రామ్ గత సంవత్సరం Royal Enfield Meteor 350 మరియు Royal Enfield 650 Twins ప్రారంభించిన సమయంలో ప్రారంభించింది. ప్రారంభించిన మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కంపెనీ తెలిపింది.

Royal Enfield కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో 2021 Classic 350 బైక్ విడుదల చేసింది. దీని ధర రూ. రూ .1.84 లక్షల నుండి 2.15 లక్షల వరకు ఉంది. ఇది Redditch, Halcyon, Signals, Dark మరియు Chrome అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త Royal Enfield Classic 350 బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Royal enfield includes riding jackets in make it yours customisation platform
Story first published: Tuesday, September 21, 2021, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X