Just In
- 54 min ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 14 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 17 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొత్త 2021 Royal Enfield Classic 350 వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడ చూడండి
వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 2021 Royal Enfield Classic 350 (2021 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350) బైక్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Royal Enfield Classic 350 ధర రూ. 1.84 లక్షలు.
ఈ బైక్ యొక్క బుకింగ్స్ ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. కావున కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ లో లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కంపెనీ ఈ కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ ను డీలర్‌షిప్‌లకు పంపించడం ప్రారంభించింది. కావున త్వరలో డెలివరీలు ప్రారంభమవుతాయి. 2021 Royal Enfield Classic 350 బైక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో 5 వేరియంట్లలో తీసుకురాబడింది.
2021 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 యొక్క ధరలు వేరియంట్ వారీగా ఈ కింది విధంగా ఉంటాయి.
- REDDITCH - ధర రూ. 1.84 లక్షలు
- HALCYON - ధర రూ. 1.93 లక్షలు
- SIGNALS - ధర రూ. 2.04 లక్షలు
- DARK - ధర రూ. 2.11 లక్షలు
- CHOROME - ధర రూ. 2.15 లక్షలు
Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్ఇడి స్క్రీన్ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.
2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
కొత్త Classic 350 బైక్ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిఙ్గి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.
కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.
కొత్త బైక్ మునుపటికంటే కూడా అద్భుతమైన మరిన్ని కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త బైక్ లో ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ దాని పాత సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ స్థానంలో ఉపయోగించబడింది. కావున దీని బరువు 195 కిలోల వరకు ఉంటుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు ఎక్కువ వైబ్రేషన్ అనిపించదు, తద్వారా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
కొత్త Royal Enfield Classic 350 బైక్ Honda Highness CB350, Jawa వంటి వాటికి మాత్రమే కాకుండా Royal Enfield Meteor 350 కి కూడా ప్రత్యర్దిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ దాని ప్రత్యర్థులకంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఎలాంటి అమ్మకాలను నమోదు చేస్తుందో త్వరలో తెలుస్తుంది. 2021 Royal Enfield Classic 350 బైక్ యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము. Classic 350 రివ్యూ త్వరలో మీకు అందుబాటులో ఉంటుంది.