Royal Enfield సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్, వచ్చేసింది.. చూసారా..!!
భారతదేశపు ద్విచక్ర వాహన తయారీ సంస్థ Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) 2021 సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, గత నెల సెప్టెంబర్ లో కంపెనీ మొత్తం 33,529 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలిసింది.

Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) కంపెనీ ఇదే నెల గత సంవత్సరం మొత్తం 60,331 యూనిట్ల అమ్మాకాలను చేప్పట్టగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు గత సంవత్సరం కంటే కూడా 44 శాతం తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. దేశీయ అమ్మకాలు చాలా వరకు తగ్గినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) యొక్క దేశీయ అమ్మకాల విషయానికి వస్తే, సెప్టెంబర్ నెలలో దేశీయ అమ్మకాల మొత్తం 27,233 యూనిట్లు. కంపెనీ గత సంవత్సరం ఇదే నెలలో అంటే 2020 లో కంపెనీ 56,200 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించగలిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మకాలు ఏకంగా 52 శాతం తక్కువ.

Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, కంపెని 2020 సెప్టెంబర్‌లో 4,131 యూనిట్లను విక్రయించింది, కానీ ఈ సెప్టెంబర్ 2021 లో 6,296 యూనిట్లను విక్రయించి 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆగస్టు 2021 లో 45,860 యూనిట్లను విక్రయించింది. ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో బైకుల అమ్మకాలు 12,331 యూనిట్లు తగ్గినట్లు కంపెనీ నివేదికలు చెబుతున్నాయి.

కంపెని యొక్క అమ్మకాలను మరింత అభివృద్ధి చేయడానికి, Royal Enfield ఇటీవల అత్యధికంగా అమ్ముడైన తన క్లాసిక్ 350 మోడల్‌ని అప్‌డేట్ చేసింది. ఈ బైక్ కొత్త ప్లాట్‌ఫారమ్ మరియు ఇంజిన్‌తో కొత్త తరం బైక్‌గా మార్చబడింది. చెన్నైకి చెందిన బైక్ మేకర్ ఇటీవల 'వన్ రైడ్' ఈవెంట్‌ను కూడా సెప్టెంబర్ 26 న నిర్వహించింది.

ప్రస్తుతం ప్రపంచ ఆటో పరిశ్రమ మొత్తం సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అంటే కాకుండా దీనికి తోడు కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని కంపెనీల యొక్క అమ్మకాలు దాదాపు తగ్గుదల దిశగా పయనించాయి. అయితే గత నెల చివరలో కరోనా కొంత తగ్గుముఖం పట్టడం వల్ల కొంత వరకు అమ్మకాలు ముందుకు సాగాయి. అయినప్పటికీ ఆశించిన అమ్మకాలను కంపెనీలు నమోదు చేయలేకపోయాయి.

Royal Enfield రేసింగ్ టోర్నమెంట్:
Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) భారతదేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాల కోసం రెట్రో ట్రాక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 ఆధారంగా, రేసింగ్ ఈవెంట్ యొక్క మొదటి ఎడిషన్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. ట్రాక్-రేస్ టోర్నమెంట్ కోసం నమోదు 22 సెప్టెంబర్ 2021 నుండి ప్రారంభించబడింది.

రెట్రో ట్రాక్ రేసింగ్ ఈవెంట్ 2021 కాంటినెంటల్ జిటి కప్‌ను జెకె మోటార్‌స్పోర్ట్స్ స్పాన్సర్ చేస్తుంది. అంతే కాకుండా జెకె నేషనల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కూడా దీనిని పర్యవేక్షిస్తుంది. ఇది ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) రేస్ ట్రాక్‌లో మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది.

ఈ రెట్రో ట్రాక్ రేసింగ్ ఈవెంట్ వచ్చే ఏడాది 2022 జనవరిలో ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అక్టోబర్ 18 నుండి 19 వరకు కోయంబత్తూరులోని కారి మోటార్ స్పీడ్‌వేలో రైడర్ సెలక్షన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అర్హులైన 100 మంది రైడర్స్ ఎంపిక చేయబడతారు. వీరిలో, కాంటినెంటల్ జిటి కప్‌లో పోటీపడే 18 మంది వేగవంతమైన రైడర్లు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. టోర్నమెంట్ యొక్క మొదటి మూడు రౌండ్లు కారి మోటార్ స్పీడ్‌వేలో జరుగుతాయి, ఫైనల్ బౌద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్, నోయిడాలో జరుగుతుంది. ఈ రెట్రో ట్రాక్ రేసింగ్ ఈవెంట్ రైడర్లకు చాలా ఉత్సవాన్ని అందిస్తుంది.

బైక్ తయారీదారు Royal Enfield ఇప్పుడు TCX సహకారంతో కొత్త శ్రేణి బూట్లను విడుదల చేసింది. ఈ బూట్లు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా కఠినమైన భద్రతా పరీక్షలను కూడా ఆమోదించాయని కంపెనీ పేర్కొంది. Royal Enfield యొక్క టిసిఎక్స్ కలెక్షన్ ఇప్పుడు పురుషులు మరియు స్త్రీలకు ఇద్దరికీ వివిధ రకాల రైడింగ్ షూలను అందిస్తుంది. ఈ షూస్ ధర రూ .8,500 నుండి రూ .21,000 వరకు ఉంటుంది.

కేవలం రైడర్స్ పురుషులు మాత్రమే కాకుండా మహిళా రైడర్స్ కూడా ఉన్నారు. కావున మహిళా రైడర్స్ కోసం కంపెనీ క్లౌసేన్ లేడీ రైడింగ్ WP బూట్లను పరిచయం చేసింది. ఇవి కూడా ఫుల్ గ్రైన్ లెదర్ తో తయారు చేయబడి ఉంటాయి. అంతే కాకుండా ఇవి T- డ్రై వాటర్‌ప్రూఫ్. ఈ బూట్లు మహిళా రైడర్స్ కి మంచి పట్టుని అందించడమే కాకుండా పాదాలకు మంచి రక్షణను కూడా కల్పిస్తాయి. CE సర్టిఫైడ్ రైడింగ్ బూట్లు హై హీల్ నిర్మాణంతో రూపొందించబడ్డాయి. కంపెనీ ఈ బూట్లను లాంగ్ రైడ్స్‌లో సౌకర్యం కోసం స్త్రీ పాదాలను ఖచ్చితంగా ఉంచేలా రూపొందించబడ్డాయి.


Click it and Unblock the Notifications








