అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు ఉన్న విషయం మన అందరికి తెలుసు. ఇందులో ధ్రువాలు మరియు సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో ఆసియా వంటి ఖండాలలో మానవ మనుగడ ఎక్కువగా ఉంటుంది. అయితే ధ్రువ ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి, కావున ఇక్కడ ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. భూమిపై ఉన్న ఖండాలన్నిటిలోకి అంటార్కిటికా అత్యంత శీతలమైనది. ఇక్కడ ప్రజల మనుగడే కష్టంగా ఉంటుంది, అలాంటి భూభాగంలో కొంతమంది సహస యాత్రలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.

ఇలాంటి సాహస యాత్రలు చేసేవారిలో ఒకరు మన బెంగరూరుకి చెందిన 'సంతోష్ విజయ్ కుమార్'. సంతోష్ విజయ్ కుమార్ ఇప్పుడు అంటార్కిటికా ద్రువాల్లో బైక్ విభాగంలో రారాజు అయిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్' యొక్క హిమాలయన్ బైక్ పై రైడింగ్ చేయనున్నారు.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికా వంటి క్లిష్టమైన వాతావరణంలో రైడింగ్ చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు అంటార్కిటికాలో రైడింగ్ చేయనుంది. సాధారణంగా చాలామందికి అంటార్కిటికా వాతావరణ పరిస్థితుల గురించ్చి పెద్దగా అవగాహన లేకుండా పోవచ్చు, కానీ ఇది మంచు దుప్పట్లో కప్పబడిన ప్రాంతం.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

అంటార్కిటికా అనేక శాస్త్రీయ ప్రయోగాలు మరియు పరిశోధన ప్రాజెక్టులకు అనుకూలమైన ప్రదేశం. ఇది అనేక పరిశోధనలకు ఒక ముఖ్యమైన వేదిక.

కానీ ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఈ ఖండం సాహస ప్రియులకు మరియు అన్వేషకులకు భూతల స్వర్గం అనే చెప్పాలి. ఇక్కడ ప్రయాణం ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో, అంతే భయానకంగా కూడా ఉంటుంది. రోడ్లు లేని అంటార్కిటికాలో వెళ్లడం అంటే అది నిజంగా గొప్ప సాహసం అనే చెప్పాలి.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

అంటార్కిటికా ఖండంలోని కఠినమైన వాతావరణాన్ని బట్టి, ఏదైనా వాహనానికి ఇది అద్భుతమైన మైదానం. దక్షిణ ధృవానికి చేరుకోవడం చాలా పెద్ద విషయమే, అయితే ఇప్పుడు రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌లు దక్షిణ ధృవం యొక్క తీరాలకు చేరుకున్నాయి.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ఇంగ్లాండ్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సీనియర్ ఇంజనీర్ 'డీన్ కాక్సన్' మరియు రైడ్స్ అండ్ కమ్యూనిటీ హెడ్ 'సంతోష్ విజయ్ కుమార్' దీని కోసం అంటార్కిటికాకు వెళ్తున్నారు. వీరి బృందం అంటార్కిటికాకు చేరుకోవడానికి కొన్ని రోజుల ముందు, మేము సంతోష్ విజయ్ కుమార్‌తో వివరంగా మాట్లాడాము. సంతోష్ విజయ్ కుమార్ తో జరిగిన సంభాషన మొత్తం ఇక్క మీకోసం..

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ప్ర: మీ గురించి కొంచెం చెప్పండి?

జ: నేను బెంగళూరుకు చెందినవాడిని, చాలా కాలం క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కూడా. అయితే 2009 లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో చేరాను. నేను రాయల్ ఎన్‌ఫీల్డ్ కోసం రైడ్‌లు మరియు ఈవెంట్‌లను నిర్వహిస్తున్నాను. అంతే కాకుండా మేము 2009 నుండి స్థలాలను అన్వేషిస్తున్నాము. మేము హిమాలయాల నుండి భూటాన్, టిబెట్, ముస్తాంగ్ వంటి కఠినమైన ప్రదేశాలకు కూడా ప్రయాణించాము

ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఏదైనా మరింత కఠినమైన సాహసకృత్యం చేయాలనీ నిర్ణయించుకున్నాము. ఈ కారణంగానే మేము అంటార్కిటికా వంటి ధ్రువ ప్రాంతంలో ఉన్నాము.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ప్ర: ఈ మొత్తం సౌత్ పోల్ ఎక్స్‌పెడిషన్ ప్రాజెక్ట్ ఎలా ఉద్భవించింది?

జ: 2014 శీతాకాలం సమయంలో మేము హిమాలయాల్లో బైక్‌లు నడుపుతున్నాము. అప్పుడు మంచు కురుస్తోంది. ఆ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన బైక్‌లపై ఆ మంచులోనే ప్రయాణించాము. ఆ సమయంలో రైడర్‌లలో ఒకరు వేరే మార్గంలో దక్షిణ ధృవానికి చేరుకున్న జపాన్ వ్యక్తి గురించి చెప్పాడు. ఆ తర్వాత దానిపై పరిశోధన చేయడం మొదలుపెట్టాను. కానీ దాని గురించి పెద్దగా సమాచారం లేదు. దానిపై మరికొంత పరిశోధన చేసిన తర్వాత ఒక అమెరికన్ సౌత్ పోల్ స్టేషన్ ఉందని కనుగొన్నాను. ఇది ప్రాథమిక కాంపాక్ట్ ఐస్ ట్రాక్.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

అప్పుడు నేను ఆర్కిటిక్ ట్రక్కులను చూశాను, ఈ ఖండం గురించి పూర్తిగా తెలిసిన ప్రపంచంలోని ఏకైక సంస్థ. వారు ఖండాన్ని 140 సార్లు దాటారు, కాబట్టి వారు ఈ భూభాగంలో ఎలా ప్రయాణించాలో బాగా అనుభవం పొందారు. మేము వారితో మాట్లాడిన తర్వాత అక్కడ బైక్ ఎలా నడపాలి అని ఆలోచించడం ప్రారంభించాము.

ఈ కారణంగా ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి గత ఏడాదిన్నర కాలంగా బైక్‌లను పరీక్షించాం. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు దక్షిణ ధృవం వైపు వెళ్తున్నాం.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ప్ర: ఈ ప్రాజెక్టు ఎన్ని నెలలుగా ప్రణాళికలో ఉంది?

జ: మేము ఈ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 2020లో ప్రారంభించాము, అప్పటి నుంచి కూడా మేము ఆ దిశవైపే పనిచేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్‌పై ఉన్న కొన్ని పరిమితుల కారణంగా మేము ప్రయాణించలేకపోయాము. అయితే ప్రస్తుతం ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడం వల్ల మేము ఇప్పుడు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

ప్ర: ఇందులో ఉపయోగించే బైకుల గురించి చెప్పండి?

జ: మేము అంటార్కిటికా ఖండంలో రైడ్ చేయడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ వినియోగిస్తున్నాము. అయితే మేము ఈ బైక్‌లో కొన్ని చిన్న మార్పులు చేసాము. ధ్రువ ప్రాంతాల్లో ప్రయాణించడానికి టార్క్ ఎక్కువ కావాలి కాబట్టి మేము ముందు స్ప్రాకెట్‌పై కొన్ని మార్పులు చేసాము. సరైన సెటప్‌ను కనుగొనడానికి మేము సుమారు ఎనిమిది వేర్వేరు టైర్లు మరియు స్టడ్‌ల కలయికను పరీక్షించవలసి ఉంటుంది.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది, కావున మొత్తం ఖండం తెల్లగా కనిపిస్తుంది, దాని ఆకృతి మారవచ్చు, కాఠిన్యం కూడా మారవచ్చు. ఇవన్నీ మేము తప్పకుండా స్వీకరించాల్సి ఉంటుంది. ఈ బైక్ లో మేము సెంటర్ స్టాండ్‌ను తీసివేసి, ఆయిల్-కూలర్‌ను డిస్‌కనెక్ట్ చేసాము, ఎందుకంటే ఇంజిన్ ఖచ్చితంగా ఆ మంచు ప్రాంతంలో వేడెక్కే అవకాశం ఉండదు.

ప్ర: మీరు ఈ రైడ్‌లో ఎంత దూరం వెళ్తున్నారు?

ప్ర: మీకు ఇందులో ఎలాంటి బ్యాకప్ బృందం ఉంది?

ప్ర: ఈ రైడ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ఎప్పుడు ముగుస్తుంది?

ప్ర: ఈ రైడ్‌లో ఏ భాగం మిమ్మల్ని ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది?

ఈ ప్రశ్నలన్నిటికి సంతోష్ విజయ్ కుమార్ అందించే సమాధానం మరియు అతనితో పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడవచ్చు.

అంటార్కిటికా ఖండంలో రాయల్ ఎన్‌ఫీల్డ్: రైడర్ సంతోష్ విజయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ [వీడియో].. డోంట్ మిస్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

అంటార్కిటిక్ వంటి ధ్రువ ప్రాంతాల్లో ఇలాంటి సాహసయాత్ర ప్రారంభించడానికి చాలా సమయం, కృషి మరియు పట్టుదలతో కూడా మరిన్ని పరిశోధనలు చాలా అవసరం. ఇప్పటికే ధ్రువ ప్రాంతంలోని మంచుపైన రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిళ్లు రైడింగ్ కి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. ఇంత గొప్ప సాహసానికి పూనుకున్న బృందానికి నిజంగా మా డ్రైవ్‌స్పార్క్ తరపున అభినందనలు.

Most Read Articles

English summary
Royal enfield south pole expedition conversation with rider santhosh vijay kumar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X