సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్ హిమాలయన్‌లో కంపెనీ కొత్తగా ఓ ఆన్-రోడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ కొత్త మోడల్‌ను కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తోంది.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

తాజాగా, కొత్త వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ టెస్టింగ్ మోడల్ చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ స్పై చిత్రాలను గమనిస్తే, ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త వెర్షన్‌లో కంపెనీ పలు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

ఇందులో చిన్న ఫ్రంట్ వీల్, కోల్పోయిన ఫ్రంట్ జెర్రీ-కెన్ హోల్డర్ ఫ్రేమ్, ఫోర్క్ గాటర్స్, పొడవైన విండ్‌స్క్రీన్ మరియు పెరిగిన ఫ్రంట్ మడ్‌గార్డ్ వంటి మార్పులు ఉన్నాయి. ఈ టెస్టింగ్ వాహనం ముందు ఫ్రేమ్ స్థానంలో ట్యాంక్ ష్రుడ్‌ను కూడా కలిగి ఉంది.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

ఈ మార్పులు మినహా, ప్రస్తుత హిమాలయన్ అడ్వెంచర్ బైక్‌లో ఉపయోగించిన మెకానికల్స్ మరియు ఇతర విడి భాగాలను కంపెనీ యధావిధిగా ఈ కొత్త వెర్షన్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఈ టెస్టింగ్ వాహనంలో స్పోక్డ్ రిమ్స్, ఎత్తులో ఉన్న సైలెన్సర్, పెరిగిన హ్యాండిల్‌బార్ మరియు నిటారుగా కూర్చునే రైడింగ్ పొజిషన్ వంటి అంశాల్లో ఎలాంటి మార్పులు లేవు.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

అంతేకాకుండా, ఈ టెస్టింగ్ వాహనంలో ఇదివరకటి పన్నీర్లనే ఉపయోగించారు. ప్రస్తుతం వీటిని మేక్-ఇట్-యువర్-ఓన్ ప్రోగ్రామ్ కింద అనుబంధ యాక్ససరీగా అందిస్తున్నారు. హిమాలయన్ యొక్క కొత్త వేరియంట్‌ను జంట ఆన్-రోడ్ బయాస్డ్ యాక్సెసరీస్‌తో కంపెనీ అందిస్తుందని భావిస్తున్నారు.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

ఇక ఇంజన్ విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండోదని తెలుస్తోంది. ప్రస్తుత హిమాలయన్ బైక్‌లో సింగిల్ సిలిండర్ ఎస్ఓహెచ్‌సి ఎయిర్ / ఆయిల్-కూల్డ్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ 411 సిసి ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. కొత్త ఆన్-రోడ్ వెర్షన్‌లో కూడా ఇదే ఇంజన్‌ను కొనసాగించనున్నారు.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

ఇందులోని 411సిసి ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 24 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ నుండి 4500 ఆర్‌పిఎమ్ మధ్యలో 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

కొత్తగా రాబోయే 2021 హిమాలయన్ బైక్ కూడా ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో అందించబడుతుంది, ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పక్కన అమర్చిన ప్రత్యేక యూనిట్‌గా కొనసాగుతుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో జత చేసిన తర్వాత టర్న్-బై-టర్న్ నావిగేషన్ అందించడానికి ఇందులో ఒక చిన్న టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్ల కూడా ఉంటుంది.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను జత చేసుకొని, ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

సరికొత్త ఆన్-రోడ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ వస్తోంది..

ఈ ఏడాది ప్రారంభంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది మరియు ఇందులో బ్రాండ్ యొక్క ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా జోడించింది. అయితే, ఇప్పుడు ఈ బ్రాండ్ తమ అడ్వెంచర్-టూరింగ్ మోటారుసైకిల్ యొక్క ఆన్-రోడ్ బయాస్డ్ వెర్షన్ కోసం మార్కెట్ డిమాండ్‌ను అందుకున్నట్లుగా తెలుస్తోంది.

Image Source: Motoroids

Most Read Articles

English summary
Royal Enfield To Launch On-road Version Himalayan Bike Soon, Spy Pics. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X