SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI), దీపావళి సందర్భంగా తన కస్టమర్ల కోసం ప్రీ-అప్రూవ్డ్ టూ-వీలర్ లోన్ (SBI ఈజీ రైడ్ లోన్) అనే కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద వినియోగదారులు ద్విచక్ర వాహనాల కోసం ఏకంగా రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ పొందటానికి, కస్టమర్లు SBI బ్యాంక్ యొక్క YONO యాప్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సంబంధిత బ్యాంక్‌కు చెందిన అర్హులైన ఖాతాదారులందరూ ఏ బ్రాంచ్‌ను సందర్శించకుండానే తమ ఇంటి నుండే YONO యాప్ ద్వారా ద్విచక్ర వాహన కొనుగోలు కోసం లోన్ కోసం అప్లై చేసుకోవచ్చని SBI తన ప్రకటనలో అధికారికంగా తెలిపింది.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

బ్యాంక్ అందిస్తున్న ఈజీ రైడ్ లోన్ కింద, కస్టమర్‌లు గరిష్టంగా రూ. 3 లక్షలు మరియు కనిష్టంగా రూ. 20,000 వరకు లోన్ అనేది పొందవచ్చు. ఈ లోన్ యొక్క గరిష్ట వ్యవధి 10.5% వడ్డీ రేటుతో నాలుగు సంవత్సరాలు వరకు ఉంటుంది. ఈ స్కీమ్ కింద, తాజా కస్టమర్‌లు మోటార్‌సైకిల్ ఆన్-రోడ్ ధరలో 85% వరకు పొందవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్లుగా, రుణ కాలం 48 నెలలు. ఈ లోన్ సగటు EMI రూ. 2,560 వరకు ఉంటుంది.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

టూ వీలర్ లోన్ కి అప్లై చేసుకునే వారి మొతం లోన్ అమౌంట్ నేరుగా ఆటో డీలర్ ఖాతాకు పంపబడుతుంది. ఆ తరువాత మీరు టూ వీలర్కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా SBI చైర్మన్ 'దినేష్ ఖరా' మాట్లాడుతూ, మా కస్టమర్లకు అత్యుత్తమ సేవ మరియు అత్యుత్తమ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఇది మా నిరంతర ప్రయత్నం అని అన్నారు.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

SBI యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్ గురించి మాట్లాడుతూ, ఈ యాప్ వినియోగదారులకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తుందని చెప్పారు. ఈ యాప్ నవంబర్ 2017లో ప్రారంభించబడింది. ఈ యాప్ ఇప్పటికి 9.80 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. ఈ యాప్‌లో దాదాపు 4.20 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ఈ యాప్ ద్వారా SBI 110 ఈ-కామర్స్ కంపెనీలకు 20 కి పైగా కేటగిరీల్లో సేవలను అందిస్తోందని కూడా ఆయన తెలిపారు.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

కొత్త బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం, ప్రస్తుతం దీపావళి సందర్భంగా దేశంలోని దాదాపు అన్ని ఆటో కంపెనీలు తమ వాహనాలపై అనేక ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకొని దీపావళి సందర్భంగా కొత్త బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

ప్రస్తుతం పండుగ సీజన్ సందర్భంగా ఆఫర్స్ అందిస్తున్న కంపెనీలలో Hero MotoCorp, Honda, Bajaj, TVS Motor మరియు Suzuki వంటి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు ఉన్నారు. కావున కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న ప్రజలు ఇప్పుడే సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి కొత్త బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

Hero MotoCorp కంపెనీ ప్రస్తుతం తన Hero Splendor Plus, Hero Maestro Edge వంటి బైకులపైన చాలా వరకు తగ్గింపులను అందిస్తుంది. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ లో భాగంగానే ఇప్పుడు కేవలం రూ. 6,999 డౌన్ పేమెంట్ చెల్లింది, బైక్ లేదా స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు, ఎంపిక చేసిన బైక్‌లు మరియు స్కూటర్‌ల ధరలో దాదాపు రూ. 12,500 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

Honda Motorcycles కూడా ఇప్పుడు తన వాహనాలపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. హోండా బైక్స్ నవంబర్ 30 వరకు పండుగ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు EMI ద్వారా హోండా బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేస్తుంటే, SBI క్రెడిట్ కార్డ్‌తో చెల్లించినట్లైతే మీరు గరిష్టంగా రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

ఈ ఆఫర్ హోండా షైన్ 125, హోండా SP 125, Activa మరియు Activa 125 స్కూటర్లపై అందించబడింది. వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు హోండా మోటార్‌సైకిల్స్ డౌన్‌పేమెంట్ మరియు హైపోథెకేషన్‌ను మరింత సులభతరం చేసింది. కస్టమర్‌లు ఇప్పుడు ఎలాంటి రికార్డు యొక్క హార్డ్ కాపీని సమర్పించాల్సిన అవసరం లేకుండా స్కూటర్‌ను కొనుగోలు చేసే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు. హోండా ద్విచక్ర వాహన డీలర్లు ఎలాంటి భౌతిక రికార్డు (హార్డ్ కాపీ) లేకుండా ఆన్‌లైన్ మరియు డిజిటల్ ప్రాసెసింగ్‌లన్నింటినీ చేస్తారు. కంపెనీ తన వాహనాలను 0% డౌన్ పేమెంట్‌తో అందిస్తోంది.

SBI లో ఖాతా ఉందా.. అయితే టూవీలర్ ఈజీగా కొనేయొచ్చు.. ఎలా అంటే?

కంపెనీ వాహనాలకు 100% ఫైనాన్సింగ్ అందిస్తోంది. అంతేకాకుండా, కంపెనీ వాహనాల ఆన్‌లైన్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. హోండా యాక్టివా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. ఈ స్కూటర్ అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉంది. హోండా యాక్టివా 125 స్కూటర్ స్టాండర్డ్, అల్లాయ్ మరియు డీలక్స్ అనే మూడు మోడళ్లలో విక్రయించబడింది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

Most Read Articles

English summary
Sbi offers pre approved two wheeler loan upto rs 3 lakhs through yono app details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X