Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

ప్రస్తుతం మనం 21 ఆ శతాబ్దంలో ఉన్నాము. ఈ శతాబ్దంలో ప్రపంచమే అభివృద్దివైపు పరుగులు తీస్తోంది. ఇందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఆధునిక ఫీచర్స్ కలిగిన అధునాతన వాహనాలు ఎన్నో అడుగుపెడుతున్నాయి. ఇందులో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా ఉన్నాయి. వాహన వినియోదారులు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుత 2021 EV ఇండియా ఎక్స్‌పోలో అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేయనున్నాయి.

ఇప్పుడు షీమా ఎలక్ట్రిక్ (Shema Electric) 2021 EV ఇండియా ఎక్స్‌పోలో రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

2021 EV ఇండియా ఎక్స్‌పోలో షీమా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి SES TUFF కాగా, మరొకటి SES HOBBY ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటాయి.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

ఇందులో మొదట SES TUFF ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది కంపెనీ యొక్క హై స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం 60 కిమీ/గం. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపుగా 150 కేజీల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనికి 60V, 30 Ah లిథియం బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని సులభంగా రిమూవ్ చేయవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

ఇక కంపెనీ విడుదల చేసిన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన SES HOBBY విషయానికి వస్తే, ఇది మొదటి స్కూటర్ కంటే తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఒక్క సారి ఫుల్ ఛార్జింగ్ తో ఏకంగా 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ వరకు ఉంటుంది. ఇది కూడా దాదాపు 150 కేజీల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

SES HOBBY ఎలక్ట్రిక్ స్కూటర్ 60V, 30 Ah లిథియం బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 4 గంటలు మాత్రమే. ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారుచేయబడి ఉంటుంది. మొత్తానికి ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

ఇఇ మాత్రమే కాకుండా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో SES ZOOM, SES BOLD మరియు SES EAGLE వంటి ఇతర స్కూటర్‌లను కూడా ప్రదర్శించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రెండు ద్విచక్ర వాహనాలతో కలిపి కంపెనీ మొత్తం 6 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది. ఈ 6 స్కూటర్లలో 5 తక్కువ వేగం కలిగిన కేటగిరీలో ఉన్నాయి. మిగిలిన ఒకటి మాత్రం హై స్పీడ్ కేటగిరీలో అందుబాటులోకి వచ్చాయి.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

అయితే భారత మార్కెట్లో కంపెనీ యొక్క ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువుగా ఉన్నట్లతే ఉత్పత్తులను మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. షేమా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో మొత్తం 75 డీలర్ల నెట్‌వర్క్‌లను కలిగి ఉంది. అంతే కాకుండా రానున్న మరో 6 నెలల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కేరళ, కర్ణాటక మరియు గుజరాత్ వంటి అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో తమ ఉనికిని మరింత విస్తరించడానికి కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

కంపెనీ నివేదికల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు లేదా మూడు కొత్త ఎలక్ట్రిక్‌లను విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 100 మందికి పైగా డీలర్లను సృష్టించాలనుకుంటున్నట్లు కూడా కంపెనీ వ్యవస్థాపకుడు తెలియజేసారు.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

ఈ సందర్భంగా షీమా ఎలక్ట్రిక్ యొక్క సీఓఓ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో తమ ఉత్పత్తులకు తప్పకుండా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మా లక్ష్యాన్ని అవలీలగా సాధించవచ్చని ఆయన తెలిపారు.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

అంతే కాకూండా కస్టమర్ డిమాండ్‌కు ప్రతిస్పందించడానికి మేము ఎల్లవేళలా కట్టుబడి ఉన్నాము, దీనితో పాటు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, మేము ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వేగంగా తయారు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాము. మా ఉత్పత్తిని నిరంతరం మెరుగుపరుస్తాము, అలాగే మా పరిధిని విస్తరించడంలో కూడా కృషి చేస్తామని ఆయన అన్నారు.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

షీమా ఎలక్ట్రిక్ తమ ఉత్పత్తిని మొదటిసారిగా 2016 లో ప్రారంభించింది. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఒడిశాలోని సంబల్‌పూర్‌లో తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే SES తన ఫ్లై మోడల్‌ను తక్కువ వేగంతో 2016 లో పరిచయం చేసింది, ఇది 2017లో అమ్మకానికి వచ్చింది.

Shema Electric నుంచి మరో రెండు స్కూటర్లు: ఫీచర్స్ & రేంజ్ ఇక్కడ చూడండి

షీమా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రస్తుతం SES ఈగిల్, SES టఫ్, SES జూమ్ మరియు SES బోల్డ్‌లను విక్రయిస్తోంది. ఈ స్కూటర్లన్నీ వివిధ వేరియంట్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లన్నింటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కావున ఇప్పుడు ఈ 2021 EV ఇండియా ఎక్స్‌పోలో మరో రెండు స్కూటర్లను పరిచయం చేయడం జరిగింది. భవిష్యత్ లో వీటికి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Shema electric two new scooters unveiled range details
Story first published: Monday, December 27, 2021, 18:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X