ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. దేశంలో పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, దేశంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

తాజాగా బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ, తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 15, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్క్-2 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. కంపెనీ తమ ప్రొడక్షన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దేశీయ మార్కెట్లో సింపుల్ ఎనర్జీ మార్క్-2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.10 - రూ.1.20 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జిపై గరిష్టంగా 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ మైలేజ్ విషయాన్ని స్వయంగా ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధృవీకరించిందని కంపెనీ పేర్కొంది.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ఈ స్కూటర్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించి ఒక బ్యాటరీ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకూ ప్రయాణించినట్లు ధృవీకరించింది. ఈ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎకో మోడ్‌లో పరీక్షించిన్నట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ గత సంవత్సరం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రోటోటైప్ వెర్షన్ మార్క్-1 ను ఉత్పత్తి చేసింది మరియు ఇప్పుడు ఈ ప్రోటోటైప్ యొక్క ప్రొడక్షన్ వేరియంట్ మార్క్-2 ను సిద్ధం చేసింది. సింపుల్ ఎనర్జీ మార్క్-2 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 కిలోవాట్ల అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ బ్యాటరీ ప్యాక్‌ని సింపుల్ ఎనర్జీ సంస్థ స్వయంగా అభివృద్ధి చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఇది కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 - 50 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ప్రస్తుతం లభించే అత్యంత వేగవంతమైన ఈ-స్కూటర్లలో ప్రధానమైనదిగా మారుతుంది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

స్వాతంత్ర్య దినోత్సవం రోజున బెంగుళూరు నగరంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. బెంగుళూరులోనే కంపెనీ యొక్క ఆర్ అండ్ డి మరియు ఫ్యాక్టరీలను కంపెనీ ఏర్పాటు చేసింది.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

మొదటి దశలో భాగంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బెంగళూరులో విడుదల చేసిన తరువాత, చెన్నై మరియు హైదరాబాద్ నగరాల్లో కూడా దీనిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి కాలంలో మరిన్ని కొత్త నగరాల్లో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ స్కూటర్ విడుదలకు ముందే కంపెనీ బెంగళూరులో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ సంస్థకు బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఒక పెద్ద తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం 50,000 స్కూటర్లు తయారు చేయబడతాయి. ఈ స్కూటర్ల తయారీలో పూర్తిగా భారతదేశంలో తయారైన విడిభాగాలనే ఉపయోగిస్తామని మరియు దీనిని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేస్తామని కంపెనీ తెలిపింది.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్కూటర్ తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంస్థ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో కనెక్టింగ్ టెక్నాలజీతో పాటుగా IP67-రేటెడ్ వాటర్‌ప్రూఫ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. మార్కెట్లోని ఇతర స్కూటర్ల మాదిరిగా ఇది హబ్ మౌంటెడ్ మోటార్‌ను కూడా స్కూటర్ మధ్య భాగంలో మోటారుని కలిగి ఉంటుంది మరియు ఇది చైన్ డ్రైవ్ ద్వారా నడుస్తుంది.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ మార్క్ -2లో తొలగించగల బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్, జిపిఎస్ ఆధారిత నావిగేషన్, డిజిటల్ టచ్‌స్క్రీన్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. కంపెనీ రేట్ చేసిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఛార్జింగ్ సమయం వరుసగా హోమ్ ఛార్జర్ ద్వారా 40 నిమిషాలు మరియు ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 17 నిమిషాలుగా ఉంటుంది.

ఆగస్ట్ 15న రానున్న 'సింపుల్ ఎనర్జీ' ఎలక్ట్రిక్ స్కూటర్

ఇప్పటికే మార్క్ -2 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం 1,000 మందికి పైగా వినియోగదారులు ఆసక్తి చూపినట్లు కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. నిధుల కొరత ఉండకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశోధించి తయారు చేయడానికి కంపెనీ పెట్టుబడిదారుల కోసం వెతుకుతోంది. తాజా నివేదిక ప్రకారం, ఈ కంపెనీ దేశంలోని 4 చిన్న మరియు పెద్ద నగరాల్లో డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్లను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
Simple Energy To Launch Its First E-Scooter In India On 15th August. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X