కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

ప్రముఖ హెల్మెట్ మరియు రైడింగ్ యాక్సెసరీస్ తయారీదారు స్టీల్‌బర్డ్ రెండు కొత్త రైడింగ్ గ్లోవ్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది రైడర్ మొబైల్‌ను తీయకుండా టచ్‌స్క్రీన్ ఆపరేషన్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్త రైడింగ్ గ్లోవ్‌లు ఫుల్ ఫింగర్ మరియు హాఫ్ ఫింగర్ వేరియంట్‌లలో వస్తాయి. ఇవి బైక్ రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

కంపెనీ విడుదల చేసిన ఫుల్ ఫింగర్ గ్లోవ్ ధర రూ. 599 కాగా, హాఫ్ ఫింగర్ గ్లోవ్ ధర రూ. 529. ఈ గ్లోవ్‌లకు సంబంధించి, తయారీదారు ఈ రైడింగ్ గ్లోవ్‌లు టచ్‌స్క్రీన్‌లకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనితో పాటు, మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు రైడర్‌కు మంచి మొత్తంలో రక్షణ కల్పిస్తామని కంపెనీ పేర్కొంది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

ఫుల్ ఫింగర్ రైడింగ్ గ్లోవ్ మెరుగైన గ్రిప్ కోసం కుషన్డ్ పామ్ రెస్ట్ మరియు యాంటీ-స్కిడ్ ఫ్యాబ్రిక్‌తో వస్తుంది. స్ట్రీల్‌బర్డ్ విడుదల చేసిన సెకండ్ హాఫ్ ఫింగర్ గ్లోవ్ స్వెడ్ పాలిస్టర్ ఫాబ్రిక్, మెరుగైన కదలిక కోసం వెనుకవైపు రిబ్బెడ్ ఫాబ్రిక్, మెరుగైన పట్టు కోసం సింథటిక్ చిల్లులతో వస్తుంది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

కంపెనీ విడుదల చేసిన ఈ రైడింగ్ గ్లోవ్‌ల తయారీపైన కంపెనీ ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది. ఈ లైట్ వెయిట్ రైడింగ్ గ్లోవ్స్ లోపల బ్రీతబుల్ మెష్ ఫాబ్రిక్‌ని ఉపయోగిస్తాయని, ఇది గాలి ప్రసరణ మరియు వెంటిలేషన్‌ను మెరుగుపరుస్తుందని కూడా కంపెనీ తెలిపింది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త అధునాతన గ్లోవ్స్ ఎలాంటి వాతావరణంలో అయినా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ గ్లోవ్స్ కేవలం బైక్ డ్రైవ్ చేయడానికి మాత్రమే కాదు జిమ్ మరియు క్లైంబింగ్ వంటి వాటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకూండా.. ఈ గ్లోవ్‌లు హైకింగ్, సైక్లింగ్ మరియు క్యాంపింగ్ వంటి కార్యకలాపాలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా కంపెనీ తయారు చేసింది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

ఈ రైడింగ్ గ్లోవ్‌ల లాంచ్ గురించి స్టీల్‌బర్డ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ మాట్లాడుతూ.. ఈ బైక్ రైడింగ్ గ్లోవ్‌లు అత్యుత్తమ ఫాబ్రిక్ మరియు అనుబంధ పదార్థాలను ఉపయోగించి రూపొందించబడ్డాయి. ఇది చాలా సౌకర్యవంతమైన మరియు ఉపయోగించడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. కంపెనీ తయారు చేసిన ఈ కొత్త రైడింగ్ గ్లోవ్‌ల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మరింత మన్నికను అందిస్తాయి.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో మోటార్‌సైకిళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. కావున ఇది బైకింగ్ గేర్‌లకు భారీ మార్కెట్‌ను సృష్టిస్తుంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రైడర్లు కొనుగోలు చేయడానికి చాలా బ్రాండెడ్ మరియు నాన్-బ్రాండెడ్ ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ, అంతర్జాతీయ నాణ్యత గల రైడింగ్ గేర్‌లకు ప్రత్యామ్నాయం ఏమీ లేదు. అందుకే మేము ఈ గ్లోవ్‌లను పరిచయం చేసాము. కావున ఇది మార్కెట్లో అత్యధిక అమ్మకాలను సాధిస్తుందని కూడా మేము భావిస్తున్నాము.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

ఇదిలా ఉండగా స్టీల్‌బర్డ్ కంపెనీ కొంత కాలం క్రితం దేశీయ మార్కెట్లో అతి తక్కువ ధర వద్ద కొత్త హ్యాండ్స్-ఫ్రీ హెల్మెట్‌ను విడుదల చేసింది. హెల్మెట్ ధర రూ. 2,589. దేశంలో ఇంత తక్కువ ధరకు హ్యాండ్స్ ఫ్రీ హెల్మెట్‌ను విడుదల చేసిన తొలి కంపెనీగా స్టీల్‌బర్డ్ నిలిచింది. ఇంత ధరతో హ్యాండ్స్ ఫ్రీ టెక్నాలజీతో కూడిన హెల్మెట్‌ను మరే కంపెనీ ఇప్పటివరకు విడుదల చేయలేదు.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

స్టీల్‌బర్డ్ చాలా సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో కొత్త హెల్మెట్‌లను విడుదల చేస్తోంది. కంపెనీ విడుదల చేసే హెల్మెట్స్ బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చిన స్టీల్‌బర్డ్ యొక్క SBA1 HF హెల్మెట్‌ మార్కెట్లో ఉన్న ప్రముఖ SBA 1 సిరీస్ హెల్మెట్‌ల ఆధారంగా రూపొందించింది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

కంపెనీ యొక్క ఈ హెల్మెట్‌లో ఉపయోగించిన HF అనే పదం హ్యాండ్స్ ఫ్రీని సూచిస్తుంది. ఈ హెల్మెట్ సహాయంతో సెల్ ఫోన్‌ కాల్స్ స్వీకరించడం వంటి వాటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది హెల్మెట్స్ లో అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ. దీనికి ఎలాంటి బ్యాటరీ అవసరం లేదు. ఈ హెల్మెట్‌తో మీరు మ్యూజిక్ కూడా వినవచ్చు.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

కంపెనీ యొక్క ఈ SBA1HF హెల్మెట్ రెండు వేర్వేరు పరిమాణాలలో విక్రయించబడింది. ఇందులో ఒకటి 580 మిమీ హెల్మెట్ కాగా, మరొకటి 600 మిమీ హెల్మెట్. అంతే కాకూండా ఈ హెల్మెట్ బ్లాక్, వైట్ మరియు రెడ్ వంటి వివిధ కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కొత్త Steelbird రైడింగ్ గ్లోవ్స్.. ఇప్పుడు మరింత కంఫర్ట్.. మరిన్ని ఫీచర్స్

కంపెనీ విక్రయిస్తున్న స్టీల్‌బర్డ్ నాన్-హ్యాండ్-ఫ్రీ హెల్మెట్‌ను కూడా విక్రయిస్తుంది. దీని ధర రూ. 1,339 . ఈ హెల్మెట్, హ్యాండ్స్-ఫ్రీ కానప్పటికీ, మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తుంది. మొత్తానికి కంపెనీ ఆధునిక ఫీచర్స్ కలిగిన హెల్మెట్స్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

Most Read Articles

English summary
Steelbird launches two new riding gloves compatible for touchscreen details
Story first published: Wednesday, December 8, 2021, 17:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X