మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

ప్రముఖ భారతీయ హెల్మెట్ తయారీ కంపెనీ స్టడ్స్ 'క్రోమ్ డి5 డెకర్' అనే హెల్మెట్ విడుదల చేసింది. ఇది ఫుల్ ఫేస్ హెల్మెట్. ఈ కంపెనీ బైక్ యాక్ససరీస్ కూడా తయారు చేస్తుంది. ఈ కొత్త హెల్మెట్ యువి రెసిస్టెంట్ పెయింట్, రెగ్యులేటెడ్ డెన్సిటీ, యాంటీ అలెర్జీ ఫోమింగ్, క్విక్ రిలీజ్ చిన్ స్ట్రాప్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

క్రోమ్ డి5 డెకర్ హెల్మెట్‌ యొక్క క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఈ హెల్మెట్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1220. ఈ హెల్మెట్స్ కంపెనీ యొక్క అన్ని డీలర్‌షిప్‌లలో మరియు బైక్ యాక్ససరీస్ సెంటర్లలో లభిస్తాయి.

మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త హెల్మెట్ యొక్క బయటి భాగంలో హై-గ్రేడ్ థర్మోప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల, అత్యంత ప్రమాదకరమైన ప్రమాదాల్లో కూడా వాహనదారున్ని రక్షిస్తుంది. వాహనదారుని ముఖాన్ని రక్షించడానికి హెల్మెట్ లోపల సాఫ్ట్ పాడింగ్ ఉంది. దాని లోపల, సాఫ్ట్ ఫాబ్రిక్ మెటీరియల్ ఉపయోగించబడింది, తద్వారా ఎక్కువసేపు హెల్మెట్ ధరించిన తర్వాత కూడా అలెర్జీ వచ్చే ప్రమాదం లేదు.

MOST READ:కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

డెకర్ హెల్మెట్స్ గ్లోస్ మరియు మాట్టే ఫినిషింగ్ తో సహా 6 కలర్ ఆప్షన్లతో 2 వేర్వేరు పెయింట్ ఫినిష్‌లలో అందుబాటులో ఉంది. ఈ హెల్మెట్లు చిన్న, మధ్యస్థ మరియు పెద్ద సైజుల్లో లభిస్తాయి. స్టడ్స్ హెల్మెట్ ఆసియా ఖండంలో అతిపెద్ద హెల్మెట్ తయారీ కర్మాగారాన్ని హర్యానాలోని ఫరీదాబాద్‌లో గత ఏడాది ప్రారంభించింది. ఇది 5.5 ఎకరాల భూమిలో ఈ ప్లాంటును నిర్మించింది.

మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

ఈ కంపెనీ మోటారుసైకిల్ హెల్మెట్లతో పాటు, సైకిల్ హెల్మెట్లను కూడా తయారు చేస్తున్నారు. ఈ ప్లాంటులో సంవత్సరానికి 12.5 మిలియన్ బైక్ హెల్మెట్లు మరియు 1.5 మిలియన్ సైకిల్ హెల్మెట్లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది.

MOST READ:బాబూ నీ తెలివికి జోహార్లు: మద్యం అక్రమ రవాణాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

ఈ ప్లాంట్ నుండి కంపెనీ హెల్మెట్లను ఎగుమతి చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ఈ ప్లాంట్‌లో హెల్మెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెల్మెట్లను తయారు చేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఇండియన్ హెల్మెట్ మార్కెట్లో 40 శాతం వాటాను కలిగి ఉండాలని కంపెనీ భావిస్తోంది.

మరో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టడ్స్ ; ధర & పూర్తి వివరాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 10 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఏది ఏమైనా హెల్మెట్లు వాహనదారుల రక్షణలో ఎంత పెద్ద పాత్ర వహిస్తాయి అందరికి తెలుసు. కావున వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. ఇటీవల కాలంలో అత్యంత కఠినతరమైన ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తే వారికీ భారీ జరిమానా కూడా విధించబడుతుంది.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

Most Read Articles

English summary
Studds Chrome D5 Decor Helmet Launched. Read in Telugu.
Story first published: Saturday, March 20, 2021, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X