మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

క్యాబ్ సేవల రంగంలో పేరుగాంచిన ఓలా, మరికొన్ని వారాల్లోనే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పెయింట్ ఆర్డర్ చేస్తున్నామని, ప్రజలు తమ నచ్చిన రంగులను సూచించాలని కంపెనీ పేర్కొంది.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ సిఈఓ భవీష్ అగర్వాల్ ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. "ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు ఏ కలర్‌లో చూడాలని అనుకుంటున్నారు? ఇప్పటికే బ్లాక్ కలర్‌లో ఈ స్కూటర్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కొత్తగా ఏం కలర్ కావాలని మీరు కోరుకుంటున్నారని" ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ షెడ్యూల్ గురించి సోషల్ మీడియాలో బయటపడటం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గడచిన సంవత్సరంలోనే ఓలా తాము ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

సరిగ్గా ఏడాది కాలంలోనే ఓలా తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 500 ఎకరాల్లో ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్‌ను తయారు చేసే సామర్థ్యంతో ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 10,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

ఓలా రూపొందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం భారత మార్కెట్‌లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే భారతదేశంలో ఓ హైపర్‌ఛార్జ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, నెథర్లాండ్స్‌కి చెందిన ఎటెర్గో అనే సంస్థను ఓలా గతంలో కొనుగోలు చేసింది. ఎటెర్గో అందిస్తున్న 'యాప్‌స్కూటర్' ఆధారంగానే ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా తయారు చేస్తున్నారు. ఇందులో లాంగ్ రేంజ్ వేరియంట్ గరిష్టంగా 240 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

ఈ స్కూటర్‌లో పోర్టబుల్ బ్యాటరీ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది మరియు దీనిని కేవలం 2.3 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్‌లో మూడు మాడ్యూల్స్ ఉంటాయి మరియు ప్రతి మాడ్యూల్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ మూడింటినీ కలిపి వినియోగదారులు గరిష్ట పరిధిని పొందవచ్చు.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

ఈ స్కూటర్‌లో 50 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇలా వచ్చిన చార్జ్ (50 శాతం చార్జ్)తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై గరిష్టంగా 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

మా స్కూటర్ కోసం రంగులను సూచించండి : ఓలా ఎలక్ట్రిక్!

అంటే, పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్‌తో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని సమాచారం. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఈవీ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Suggest Colour Option For Our Electric Scooter; Ola Chief Asks Netizens. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X