Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

జపాన్‌కి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) ఇటీవల కాలంలో కొత్త 'సుజుకి అవెనిస్ 125' (Suzuki Avenis 125) ను దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త స్కూటర్ యొక్క TVC వీడియో విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) విడుదల చేసిన ఈ వీడియోలో సుజుకి అవెనిస్ 125 యొక్క స్టైలింగ్ మరియు ఆధునిక ఫీచర్స్ వంటి వాటిని చూడవచ్చు. ఈ స్కూటర్ సుజుకి స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. అంతే కాకూండా ఈ వీడియోలో సీట్ అండర్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా చూడవచ్చు. ఇందులో ఒక ఫుల్ సైజు హెల్మెట్ ని సులభంగా ఉంచుకోవచ్చు.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని స్కూటర్లలో ఫ్యూయెల్ క్యాప్ లోపల ఉంటుంది, కానీ ఈ కొత్త స్కూటర్ లో మాత్రం ఇప్పుడు ఫ్యూయెల్ క్యాప్ బయటవైపు ఉంటుంది. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ నింపడానికి మళ్ళీ మళ్ళీ సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

ఈ స్టైలిష్ స్కూటర్‌లోని రియర్ ఇండికేటర్ కూడా దీనిని మరింత దూకుడుగా చూపిస్తుంది. ఇది దాని స్పోర్టీ డిజైన్‌తో బాగా కలిసిపోతుంది. LED టెయిల్ లైట్ కూడా ఇందులో అమర్చబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED హెడ్‌లైట్ కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ సుజుకి రైడ్ కనెక్ట్‌తో టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కలిగి ఉంది, ఇది రైడర్‌కు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. దీని ఫినిషింగ్ లో, అనేక కలర్ ఆప్సన్ కనిపిస్తాయి. ఇది మొత్తానికి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే / మెటాలిక్ లష్ గ్రీన్, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, పెర్ల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) కలర్స్.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ దాని కలర్ ఆప్సన్స్ ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటుంది. కావున ఇందులో మెటాలిక్ మ్యాట్ ఫైబ్రిన్ గ్రే/మెటాలిక్ లష్ గ్రీన్ కలర్ ధర రూ.86,700, పెరల్ బ్లేజ్ ఆరెంజ్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ ధర రూ.86,700 మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ ధర రూ.86,700, పెరల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రిన్ గ్రే కలర్ ధర రూ. 86,700 మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) ధర రూ. 87,000 (ఎక్స్-షోరూమ్).

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

కొత్త సుజుకి అవెనిస్ 125 స్కూటర్ బరువు 106 కేజీల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ ప్రధానంగా యువ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రారంభించబడింది. ఈ కారణంగా ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. సుజుకి అవెనిస్ ఈ విభాగంలో Honda Dio, TVS Ntorq మరియు Yamaha RayZR వంటి స్పోర్టీ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

కొత్త Suzuki Avenis FI (ఫ్యూయెల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 125 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ ల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎమ్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల సుజుకి మోటార్‌సైకిల్స్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. సుజుకి గత కొన్ని నెలలుగా బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ మోడల్‌ను పరీక్షిస్తోంది.

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

కంపెనీ పేటెంట్‌లో దాఖలు చేసిన ఫోటోగ్రాఫ్‌లు ఇది బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ యొక్క పేటెంట్ ఇమేజ్ అని వెల్లడించింది. స్కూటర్ డిజైన్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి సంప్రదాయ ఇంధనంతో నడిచే స్కూటర్‌కి భిన్నంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లు సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్ లేదా హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును స్వింగ్‌ఆర్మ్‌పై అమర్చబడి ఉంటాయి. ఇది స్కూటర్‌కు మంచి అండర్ సీట్ స్థలాన్ని కూడా ఇస్తుంది, ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగించబడుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 29, 2021, 17:33 [IST]
English summary
Suzuki avenis 125 new video features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+