విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. సుజుకి బెర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్టింగ్ చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ స్కూటర్ కంపెనీ బర్గ్‌మన్ మ్యాక్సీ స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్.

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది టివిఎస్ ఐ-క్యూబ్ మరియు బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఇటీవల, ఈ స్కూటర్ టెస్టింగ్ సమయంలో హర్యానాలో మరోసారి గుర్తించబడింది. బెర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

స్కూటర్ రూపకల్పనలో ఎటువంటి మార్పు లేదని మనం ఫోటోల ద్వారా గమనించవచ్చు. ఈ ఫోటోలలో బర్గ్‌మన్ స్ట్రీట్ యొక్క పెద్ద హెడ్‌లైట్ మరియు ఫ్రంట్ ఆప్రాన్‌ చూడవచ్చు. అయితే కంపెనీ స్కూటర్ యొక్క లోగోను మాత్రం కవర్ చేసింది.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

నివేదికల ప్రకారం, సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు రియర్ స్ప్రింగ్ లోడెడ్ డ్యూయల్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంది. ఈ స్కూటర్‌కు 5 స్పోక్ అల్లాయ్ వీల్ మరియు రియర్ టైర్ మడ్‌గార్డ్ కూడా లభిస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్ లైట్, యుఎస్‌బి ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ స్కూటర్ పూర్తిగా వైట్ కలర్ లో ఉంటుంది. అయితే దీని సైడ్ ప్రొఫైల్‌ బ్లూ యాక్సెంట్స్ ఉంటాయి. ఈ స్కూటర్ బెర్గ్‌మన్ స్ట్రీట్ వలె పెద్దదిగా కనిపిస్తుంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ బర్గ్‌మన్ స్ట్రీట్ 110 సిసి పనితీరు కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ స్కూటర్‌లో బెల్ట్ డ్రైవ్ ఉపయోగించవచ్చు. బెర్గ్‌మన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 నుంచి 120 కిలోమీటర్ల పరిధిని అందించగలదని ఏఆర్ఏఐ సర్టిఫికేట్ అందించింది.

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

ఈ స్కూటర్ కొనుగోలు ఫేమ్-2 స్కీమ్ కింద సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ కొత్త సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ విభాగంలో బజాజ్ చేతక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ కంటే ఎక్కువ శ్రేణిని అందిస్తుందని ఊహించవచ్చు. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సుజుకి ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ స్కూటర్ పూర్తిగా భారతదేశంలో కూడా తయారవుతుంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

త్వరలో కంపెనీ బర్గ్‌మన్ స్ట్రీట్ యొక్క ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తుందని మరియు ఇది పూర్తిగా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ఉత్పత్తి చేయబడుతుందని ఇప్పుడు చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారతదేశంలో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రారంభించబడ్డాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధ బైక్ బ్రాండ్ల స్కూటర్లు, కొన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు పుట్టుకొచ్చాయి.

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

ప్రస్తుతం భారత మార్కెట్లో హీరో, ఏథర్, ఒకినావా, రివాల్ట్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టీవీఎస్ ఐ-క్యూబ్, బజాజ్ చేతక్ ఏడాదికి పైగా మార్కెట్లో ఉన్నాయి. అయితే, ఈ స్కూటర్ల అమ్మకాల గణాంకాలు అంత మంచి ఫలితాలను సాధించలేకపోతున్నాయి.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

విడుదలకు సిద్దమవుతున్న సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

ఇదే సమయంలో, హీరో ఎలక్ట్రిక్, ఏథర్ మరియు ఒకినావా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గత సంవత్సరం అగ్రస్థానంలో నిలిచాయి. ఇప్పుడు కొత్తగా సుజుకి బైక్ బ్రాండ్ కూడా ఈ రేసులో అడుగుపెట్టింది. అయితే దేశీయ మార్కెట్లో వినియోయిగదారులను ఆకర్షించడంలో ఎంత మాత్రం విజయం సాధిస్తుందనే విషయం రాబోయే కాలంలో తెలుస్తుంది.

Source: Rushlane

Most Read Articles
https://www.rushlane.com/suzuki-burgman-electric-scooter-continues-testing-12385651.html

English summary
Suzuki Burgman Street Electric Spied Again Without Camouflage Launch Soon Details. Read in Telugu.
Story first published: Thursday, February 25, 2021, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X