ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2021 సుజుకి హయాబుసా సూపర్‌బైక్ యొక్క మొదటి బ్యాచ్ అమ్మకాలు (101 యూనిట్లు) కేవలం రెండు రోజుల్లోనే అమ్ముడైపోయిన సంగతి తెలిసినదే.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ సెకండ్ బ్యాచ్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన గంట వ్యవధిలోనే మొత్తం రెండవ బ్యాచ్ అమ్మకాలు (100 యూనిట్లు) అమ్ముడైపోయినట్లు కంపెనీ పేర్కొంది. గత ఏప్రిల్ 2021 నెలలో కంపెనీ సుజుకి హయబుసా లేటెస్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

భారత మార్కెట్లో కొత్త 2021 సుజుకి హయబుసా సూపర్‌బైక్ ధర రూ.16.40 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఈ సూపర్‌బైక్‌కు ఇదివరకెన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. ఈ బైక్ మొదటి బ్యాచ్‌లో భాగంగా 101 యూనిట్లను కంపెనీ రెండు రోజుల్లో విక్రయించగా, రెండవ బ్యాచ్‌లో 100 యూనిట్లను కేవలం ఒక్క గంటలోనే విక్రయించింది.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ, సుజుకి మోటార్‌సైకిల్ తమ హయబుసా బైక్‌ను హాట్ కేకుల్లా విక్రయిస్తోంది. అమ్మకాల పరంగా ఈ సూపర్‌బైక్ భారతదేశంలో ఓ పెద్ద మైలురాయిని చేరుకుంది.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

సుజుకి హయబుసా భారతదేశంలో బాగా ప్రసిద్ది చెందిన మరియు గుర్తించబడిన సూపర్ బైక్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. బాలీవుడ్ చిత్రం 'ధూమ్'లో ఈ బైక్ కనిపించిన తర్వాత, దీని మార్కెట్లో మరింత ప్రాచుర్యం లభించింది. ఐకానిక్ డిజైన్, సాటిలేని పెర్ఫార్మెన్స్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా బైకర్లు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మూడవ తరం సుజుకి హయాబుసా దాని మునుపటి వెర్షన్ల మాదిరిగానే ఒకేరకమైన 'బుల్‌బౌస్' డిజైన్ సిల్హౌట్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ కొత్త తరం సుజుకి హయాబుసాలోని ప్రతి ప్యానెల్ యొక్క ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచడానికి, కంపెనీ వాటిని రీడిజైన్ చేసింది.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ మూడవ తరం సుజుకి హయబుసాలో కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కొత్త రియర్ వ్యూ మిర్రర్స్, సరికొత్త ఆల్-ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టర్న్ ఇండికేటర్లలో మార్పులు ఉన్నాయి. అంతేకాకుండా, దీని ఇంజన్‌లో కూడా మార్పులు చేశారు.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

కొత్త 2021 సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌లో పవర్‌ఫుల్ 1,340సిసి, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్, డిఓహెచ్‌సి, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 187 బిహెచ్‌పి శక్తిని, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

ఇది స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2021 సుజుకి హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

సుజుకి సంస్థలో పనిచేసే ఇంజనీర్లు కూడా ఈ బైక్ బరువును 2 కిలోలు తగ్గించడానికి తమ ప్రయత్నాలు చేశారు. ఫలితంగా, దీని కెర్బ్ వెయిట్ 264 కిలోలుగా ఉంటుంది. అయితే, మన దేశంలో అన్ని మోటార్‌సైకిళ్లు తప్పనిసరిగా శారీ గార్డ్ మరియు నంబర్ ప్లేట్ హోల్డర్‌ను కలిగి ఉండాలనే నిబంధన నేపథ్యంలో, ఈ కెర్బ్ వెయిట్ తిరిగి 266 కిలోలకు చేరుకుంది.

ఈ క్రేజీ డిమాండ్ ఏంటండి బాబూ.. ఒక్క గంటలోనే 100 బైక్‌లు అమ్ముడైపోయాయ్!

ఈ మార్పులు ఉన్నప్పటికీ, కొత్త 2021 మోడల్ సుజుకి హయబుసా గంటకు గరిష్టంగా 299 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇంకా ఈ బైక్‌లో సిక్స్-యాక్సిస్ ఇనెర్షియల్ మెజరింగ్ యూనిట్ (ఐఎమ్‌యూ), ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లిఫ్ట్ కంట్రోల్, ఇంజన్ బ్రేకింగ్ మేనేజ్‌మెంట్ వంటి మరెన్నో అనేక రకాల ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Suzuki Hayabusa Second Batch 100 Units Sold Out In One Hour, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X