Just In
- 10 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 13 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 16 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ధర ఎక్కువైనా ఏ మాత్రం తగ్గని హయబుసా జోరు.. అప్పుడే మొదలైన సెకండ్ బ్యాచ్ బుకింగ్స్
జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, దేశీయ మార్కెట్లో ఇటీవల కొత్త 2021 హయాబుసాను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ 2021 సుజుకి హయాబుసా ధర 16.40 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఎంతోమంది వాహనప్రియుల మనసు దోచింది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఈ బైక్ విడుదలైన వెంటనే మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడయ్యింది.
సుజుకి హయాబుసా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ బైకులలో ఒకటి. కంపెనీ ఈ కొత్త హయాబుసాను మొదటి బ్యాచ్ లో కేవలం 101 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి అతి తక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడయ్యాయి. అయితే ఇప్పుడు కంపెనీ సెకండ్ బ్యాచ్ యొక్క బుకింగ్స్ ఈ రోజు నుంచి స్వీకరించడం ప్రారంభించింది.
ఈ కొత్త బైక్ కొనాలనుకునే కస్టమర్లు బ్రాండ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. త్వరలో రానున్న సుజుకి హయాబుసా సెకండ్ బ్యాచ్ కూడా పరిమిత సంఖ్యంలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
2021 సుజుకి హయాబుసా బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సూపర్ బైక్ దాని స్టాండర్డ్ డిజైన్ ని అలాగే నిలుపుకుంటుంది. ఈ బైక్ యొక్క మొత్తం సిల్హౌట్ అదే విధంగా ఉంచబడుతుంది.
ఈ 2021 హయబుసాలో ఇప్పుడు ఆల్‌రౌండ్ ఎల్ఇడి లైటింగ్ ఉంది. టర్న్-ఇండికేటర్లను ఇప్పుడు ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.
ఈ 2021 హయబుసాలో ఇప్పుడు ఆల్‌రౌండ్ ఎల్ఇడి లైటింగ్ ఉంది. టర్న్-ఇండికేటర్లను ఇప్పుడు ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.
ఈ మోటారుసైకిల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అప్డేట్ చేయబడిన ఇంజిన్ ఇప్పుడు తేలికైన పిస్టన్లు, కొత్త కనెక్ట్ రాడ్లు మరియు ఇతర రీ-ఇంజనీరింగ్ అంతర్గత భాగాలను కలిగి ఉంది.
ఇందులో ఉన్న ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 187.7 బిహెచ్పి మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త 2021 హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 299 కిమీ/ గం.
కొత్త 2021 సుజుకి హయాబుసా మూడు కలర్ అప్సన్లలో అందుబాటులో ఉంటుంది.
అవి :
- గ్లోస్ స్పార్క్లీ బ్లాక్ / కాండీ బర్న్ట్ గోల్డ్
- మెటాలిక్ మాట్టే స్వోర్డ్ సిల్వర్ / కాండీ డేరింగ్ రెడ్
- పెర్ల్ బ్రిలియంట్ వైట్ / మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ
ఈ కొత్త బైక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 10 లెవెల్స్ అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త టిఎఫ్టి డిస్ప్లే సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.
2021 సుజుకి హయాబుసా, అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ చూడటానికి దాదాపుగా దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. మోటారుసైకిల్‌పై సస్పెన్షన్ డ్యూటీలు ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ కలిగి ఉంటుంది.
హయబుసా బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మీద 120/70 సెక్షన్ మరియు 190/50 సెక్షన్ టైర్లను ముందు మరియు వెనుక భాగంలో కలిగి ఉంటుంది.
ఈ కొత్త మోటారుసైకిల్ 20-లీటర్స్ సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 2021 హయాబుసా ఇప్పుడు మరింత దూకుడుగా కనిపిస్తోంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో చాలా సేఫ్టీగా ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.