భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్, ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త 2021 హయబుసా సూపర్‌బైక్‌ను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ మేరకు ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే భారతదేశంలోని సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్ కేంద్రాలు ఈ కొత్త సూపర్‌బైక్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2021లో కొత్త సుజుకి హయబుసా బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

మునుపటి తరం సుజుకి హయబుసాతో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌లో కాస్మెటిక్ మార్పులతో పాటుగా అధునాత ఫీచర్లు మరియు అనేక ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ పరికరాలు కూడా లభ్యం కానున్నాయి. అయితే, దీని ఐకానిక్ డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ ఇదివరకటిలానే ఉంటుంది.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

కాకపోతే, ఫ్రంట్ డిజైన్‌లో చేసిన చిన్నపాటి మార్పుల కారణంగా, ఇది ముందు వైపు నుండి మునుపటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. కొత్త 2021 సుజుకి హయాబుసాలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫెయిరింగ్ ఇప్పుడు మరింత షార్ప్‌గా ఉంటుంది.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

ఈ సూపర్‌బైక్‌లోని లైట్లన్నింటినీ పూర్తిగా ఎల్ఈడిలతో భర్తీ చేశారు, కొత్త లైటింగ్ సిస్టమ్ కారణంగా ఇది ఇప్పుడు మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ముందు వైపు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, దాని పైభాగంలో ఎల్‌ఈడి డిఆర్ఎల్స్ మరియు దిగువ భాగంలో రెండు ఎయిర్ ఇన్‌టేక్స్ ఉంటాయి. ఈ ఎయిర్ ఇన్‌టేక్స్‌‌ను ఆనుకొని ఉండే రెండు టర్న్ ఇండికేటర్లను కూడా ఇందులో మనం గమనించవచ్చు.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

ఇంజన్ పరంగా చూస్తే, ఇందులో 1340సిసి ఇన్లైన్-ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్‌తో రైడ్-బై-వైర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

ఈ ఇంజన్‌ను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన కారణంగా, ఇది మునుపటి కన్నా తక్కువ పవర్‌ను మరియు మైలేజీని అందిస్తుందని సమాచారం. పాత మోడల్ లీటరుకు 21.5 కిలోమీటర్ల మైలేజీనిస్తే, ఈ కొత్త మోడల్ లీటరుకు 18.06 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సూపర్‌బైక్ కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 290 కిలోమీటర్లు. ఇందులో ఇతర ఫీచర్లను గమనిస్తే, ఈ బైక్‌లో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇందులో రెండు గుండ్రటి అనలాగ్ డయల్స్ మధ్యలో మరో గుండ్రటి డిజిటల్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

ఈ అనలాగ్ డయల్స్‌కి ఇరువైపులా ఫ్యూయెల్ మరియు టెంపరేచర్ గేజ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో మధ్య భాగంలో ఉండే డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే కనెక్టింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇది వేరే యుఐని కలిగి ఉండి, గేర్ స్థానం, లీన్ యాంగిల్స్, రైడ్ మోడ్‌లు, గడియారం మరియు ఉష్ణోగ్రతలతో పాటుగా రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్‌లోని టిఎఫ్‌టి డిస్‌ప్లేలో ట్రాక్షన్ కంట్రోల్, పవర్ మోడ్స్, ల్యాప్ టైమర్ వంటి మరెన్నో వివరాలు ఉంటాయి.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

కొత్త 2021 సుజుకి హయబుసా మోటారుసైకిల్‌లో అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. వీటిలో కార్నరింగ్ ఫోర్సెస్, వీలీ కంట్రోల్ మొదలైన వాటి కోసం 6-యాక్సిస్ ఐఎమ్‌యూ, మూడు పవర్ మోడ్స్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, హిల్-హోల్డ్ కంట్రోల్ మరియు త్రీ లెవెల్ ఇంజన్ బ్రేకింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

మొదటి దశలో భాగంగా, సుజుకి మోటార్‌సైకిల్ ఈ కొత్త 2021 మోడల్ హయబుసా సూపర్‌బైక్‌ని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో విదేశాల నుండి భారత్‌కు దిగుమతి చేసుకుని విక్రయించే అవకాశం ఉంది. ఆ తర్వాతి దశలో దీనిని విడిభాగాలుగా దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబులు చేయవచ్చని సమాచారం. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.17-18 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Suzuki Motorcycle Teases New 2021 Hayabusa Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X