కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ 'హయాబుసా'లో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 5, 2021వ తేదీన కంపెనీ తమ కొత్త మోటార్‌సైకిల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది.

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

కొత్త 2021 సుజుకి హయబుసా గ్లోబల్ ఆవిష్కరణకు ముందే, కంపెనీ ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోలో కంపెనీ ఈ బైక్ యొక్క పనితీరును, వేగాన్ని హైలైట్ చేసింది. ఇందులో కొత్త హయబుసా దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండటాన్ని చూడొచ్చు.

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఈ వీడియోని రేస్ ట్రాక్‌పై చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో బైక్ రేస్ ట్రాక్ వంపుల్లో మరియు అంచుల్లో కూడా ఒకే రకమైన వేగంతో ప్రయాణిస్తుండటాన్ని మనం గమనించవచ్చు. దీన్నిబట్టి చూస్తుంటే, కంపెనీ ఈ బైక్‌లోని స్టెబిలిటీని ప్రమోట్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇందులో మోటారుసైకిల్ బెండ్ చుట్టూ తిరిగేటప్పుడు కంపెనీ "పర్ఫెక్ట్లీ పోయిస్డ్" అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా మనం చూడొచ్చు.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

టీజర్ వీడియోను బట్టి గమనిస్తే, కొత్త 2021 సుజుకి హయాబుసా సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇందులో రెండు గుండ్రటి అనలాగ్ డయల్స్ మధ్యలో మరో గుండ్రటి డిజిటల్ డిస్‌ప్లే యూనిట్ కనిపిస్తుంది. ఈ అనలాగ్ డయల్స్‌కి ఇరువైపులా ఫ్యూయెల్ మరియు టెంపరేచర్ గేజ్‌లు కూడా ఉన్నాయి.

ఇందులో మధ్య భాగంలో ఉండే డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే కనెక్టింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇది వేరే యుఐని కలిగి ఉండి, గేర్ స్థానం, లీన్ యాంగిల్స్, రైడ్ మోడ్‌లు, గడియారం మరియు ఉష్ణోగ్రతలతో పాటుగా రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లోని టిఎఫ్‌టి డిస్‌ప్లేలో ట్రాక్షన్ కంట్రోల్, పవర్ మోడ్స్, ల్యాప్ టైమర్ వంటి మరెన్నో వివరాలు ఉంటాయి. ఈ 2021 సుజుకి హయబుసా మోటారుసైకిల్‌లో అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఇందులో కార్నరింగ్ ఫోర్సెస్, వీలీ కంట్రోల్ మొదలైన వాటి కోసం 6-యాక్సిస్ ఐఎమ్‌యూ కూడా ఉన్నాయి. ఇందులో కొత్తగా అమర్చిన స్విచ్ గేర్ క్యూబ్ సాయంతో ఈ ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ టీజర్ ద్వారా కంపెనీ అనేక వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, కొత్త 2021 సుజుకి హయాబుసాలో ఏయే ఫీచర్లను ఆశించవచ్చనే దానిపై కొన్ని ఊహాగానాలు ఉన్నాయి.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

సుజుకి హయబుసా డిజైన్‌లో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా పెద్ద మార్పులేవీ ఉండబోవని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం, సుజుకి హయబుసా మంచి ఏరోడైనమిక్స్ కలిగిన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంటుంది. ఈ బైక్ నుండి గరిష్ట పనితీరును సేకరించేందుకు కంపెనీ డిజైన్‌ను మార్చడానికి ఇష్టపడదు.

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఈ నేపథ్యంలో, బాడీ గ్రాఫిక్స్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులను మాత్రమే ఇందులో ఆశించవచ్చు. అలాగే, ఇంజన్ పరంగా కూడా ఇందులో పెద్ద మార్పేమీ ఉండబోదని తెలుస్తోంది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఇదివరకటి హయాబుసాలో ఉపయోగించిన అదే 1340సిసి ఇన్లైన్-ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోనూ ఉపయోగించనున్నారు. అయితే, గరిష్ట పనితీరు కోసం ఈ ఇంజన్‌ను తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ప్రస్తుత మోడల్‌లో లభించే ఇంజన్ గరిష్టంగా 9500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 195 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7200 ఆర్‌పిఎమ్ వద్ద 155 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్‌తో లభిస్తుంది.

కొత్త 2021 సుజుకి హయబుసా టీజర్ లాంచ్; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ చేరుకుంటుంది. ఈ కొత్త మోడల్‌లో చేయబోయే అప్‌గ్రేడ్స్‌లో భాగంగా, ఇందులో రివైజ్ చేయబడిన సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఉంటుందని సమాచారం. రెండు చివర్లలోని సస్పెన్షన్ సెటప్‌ను ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Suzuki Motorcycles Is All Set To Unveil The New 2021 Hayabusa; Teaser Video Released. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X