ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా దేశం మొత్తం కరోనా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ కారణంగా దేశంలో దాదాపు అన్ని ఆటో పరిశ్రమలలో ఉత్పత్తి నిలిపివేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా కంపెనీలు తమ కస్టమర్లకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని ఈ లాక్ డౌన్ సమయంలో వాహనాల యొక్క వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.

ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

ఇందులో భాగంగానే సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా కూడా వెహికల్ వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని పొడిగించింది. ప్రస్తుతం కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ సర్వీస్ వ్యవధి 2021 జులై 15 వరకు పొడిగించింది. కావున వాహనదారులు దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

గత నెల ఏప్రిల్ నుండి దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ మహమ్మారి రోజురోజుకి అధికంగా వ్యాపిస్తున్న కారణంగా లాక్ డౌన్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటువంటి సమయంలో ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ బెంజ్ కూడా తమ వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిర్ణయం తీసుకుంది.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

ప్రస్తుతం కంపెనీలు ఈ సదవకాశాన్ని కల్పించడం వల్ల వాహనదారులు తమ వెహికల్ సర్వీస్ మొదలైనవి చేసుకోవడానికి ఈ లాక్ డౌన్ లో బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. సుజుకి కంపెనీకి ముందే దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

భారతదేశంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కావున కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ కరోనా లాక్ డౌన్ సామాన్య ప్రజలను మాత్రమే కాదు ఆటో పరిశ్రమను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. ఈ సమయంలో కంపెనీలలో వాహనాల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితిలో సుజుకి మోటార్ సైకిల్ గురుగ్రామ్ ప్లాంట్ లో షిఫ్టుల సంఖ్యను కూడా తగ్గించింది. ఇది కంపెనీలో ఉన్న దృష్టిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ఉత్పత్తి కూడా ఈ సమయంలో బాగా తగ్గుముఖం పడుతుంది.

ఫ్రీ సర్వీస్ & వారంటీ మరింత పొడిగించిన సుజుకి మోటార్‌సైకిల్‌

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని సర్వీసులు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా నివారణలో నివారణలో కృషి చేస్తున్న ప్రభుత్వానికి అండగా చాలా కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

Most Read Articles

English summary
Suzuki Two-Wheeler Warranty And Service Period Extended Till 15th July. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X