సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గడచిన సంవత్సరం నవంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ "వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి" బిఎస్6 మోడల్‌పై కంపెనీ ఇప్పడు గరిష్టంగా రూ.1.15 లక్షల విలువైన ప్రయోజనాలను ప్రకటించింది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

మార్చ్ నెలలో సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.65,000 విలువైన యాక్ససరీలను మరియు రూ.50,000 విలువైన ఎక్సేంజ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ యాక్ససరీస్‌లో అల్యూమినియం చైన్‌గార్డ్ సెంటర్ స్టాండ్ మొదలైనవి ఉన్నాయి.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

ఎక్సేంజ్ ప్రయోజనాలను వద్దనుకునే వారి కోసం కంపెనీ రూ.40,000 విలువైన ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందిస్తుంది. కంపెనీ పేర్కొన్న ఎక్సేంజ్ బోనస్‌ను పొందాలంటే కస్టమర్లు తమ వద్ద పాత మోటార్‌సైకిల్‌ను కొత్త సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి కోసం ట్రేడ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పాత మోడళ్లు తప్పనిసరిగా 350సీసీ కన్నా అధిక ఇంజన్ సామర్థ్యం కలిగినవి అయి ఉండాలి.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

బిఎస్6 అప్‌డేట్‌తో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి ధర రూ.8.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. గతంలో కంపెనీ విక్రయించిన బిఎస్4 మోడల్‌తో పోలిస్తే, ఈ బిఎస్6 మోడల్ ధర రూ. రూ.1.4 లక్షలు అధికంగా ఉంటుంది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

కొత్త 2020 సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్ ఇప్పుడు ఛాంపియన్ ఎల్లో నెంబర్ 2 మరియు పెరల్ గ్లాసీయర్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఇందులో బిఎస్4 మోడల్‌లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.

MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

ఈ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 645 సిసి డిఓహెచ్‌సి వి-ట్విన్ ఇంజన్ 8800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 69.7 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 62 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. సులువైన స్టార్టింగ్ కోసం ఇందులో సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్ ఫీచర్ ఉంటుంది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎత్తైన మరియు సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, నకల్ గార్డ్స్, ఇంజన్ ప్రొటెక్టర్ ,స్పోక్ వీల్స్, సింగిల్-పీస్ సీట్, సీటు వెనుక భాగంలో లగేజ్ క్యారియర్ మరియు ఎత్తులో అమర్చిన పెద్ద సైలెన్స్ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:2021 ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ 10 డీజిల్ కార్స్; వాటి వివరాలు

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

మెకానిల్స్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 43 మిమీ సర్దుబాటు చేయగల టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, ముందు భాగంలో 310 మిమీ ట్విన్ డిస్క్‌లతో ట్విన్-పిస్టన్ కాలిపర్స్ మరియు వెనుక వైపు 260 మిమీ సింగిల్ డిస్క్ సింగిల్-పిస్టన్ కాలిపర్ సెటప్ ఉంటుంది.

సుజుకి వి-స్ట్రోమ్ 650ఎక్స్‌టి బిఎస్6 మోడల్‌పై రూ.1.15 లక్షల బెనిఫిట్స్!

ఈ మోటార్‌సైకిల్ వివిధ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో గేర్ స్థానం మరియు స్పీడోమీటర్ కోసం పెద్ద అనలాగ్ టాకోమీటర్ మరియు డిజిటల్ రీడౌట్లను కలిగి ఉంటుంది. డిజిటల్ మీటర్‌కు దిగువ విభాగంలో ఓడోమీటర్, ట్విన్-ట్రిప్ మీటర్, గడియారం, ఇంధన స్థాయి, కూలెంట్ టెంపరేచర్ మరియు ట్రాక్షన్-కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:చూస్తే ఒక్కసారైనా రైడ్ చేయాలనిపించే మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్

Most Read Articles

English summary
Huge Discount On Suzuki V-Strom 650XT BS6; Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X