Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- News
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...
- Sports
అక్కడ గెలిస్తేనే టీమిండియా అత్యుత్తమ జట్టు: మైకేల్ వాన్
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మేడ్ ఇన్ ఇండియా 'ప్రాణ' ఈ-బైక్ విడుదల; తయారు చేసింది ఎవరో తెలుసా?
భారత మార్కెట్లో సరికొత్త పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదలైంది. కోయంబత్తూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ శ్రీవారి మోటార్స్ (ఎస్‌విఎమ్) తమ హైస్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ప్రాణ'ని దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఎస్‌విఎమ్ ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో (క్లాస్, గ్రాండ్ మరియు ఎలైట్) లభ్యం కానుంది.

ఈ మూడు వేరియంట్లలో గ్రాండ్ మరియు ఎలైట్ వేరియంట్లను మాత్రమే కంపెనీ విడుదల చేసింది. కాగా, క్లాస్ వేరియంట్ ఇంకా విడుదల కావల్సి ఉంది. మార్చ్ 2021లో ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. గతంలో టెస్లా ఐఎన్సి సంస్థలో పనిచేసిన మోహన్‌రాజ్ రామసామి ఈ ఎస్‌విఎమ్ ఎలక్ట్రిక్ కంపెనీని ప్రారంభించారు.

ఎస్‌విఎమ్ ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే, ఇది హబ్ మౌంటెడ్ ఇంటెలిజెంట్ ఎయిర్-కూల్డ్ బిఎల్డిసి మోటారుతో పనిచేస్తుంది. ఈ మోటార్ వెనుక చక్రంలో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 4.32 కిలోవాట్ లేదా 7.2 కిలోవాట్ 72 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 123 కిలోమీటర్లు. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇందులో ప్రాక్టీస్, డ్రైవ్, స్పోర్ట్స్ మరియు రివర్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కూడా లభిస్తాయి.

ప్రాణ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 165 కిలోలు ఉంటుంది. ఇంతటి భారీ మోటార్‌సైకిల్‌ను సులువుగా వెనక్కు తిప్పేందుకు ఇందులోని రివర్స్ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, రివర్స్ మోడ్‌లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గాను, దీని టాప్ స్పీడ్ కేవలం గంటకు 5 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

కొత్త రైడర్ల కోసం ఇందులో ప్రాక్టీస్ మోడ్ ఉంటుంది. ఈ మోడ్‌లో గరిష్ట వేగాన్ని గంటకు 45 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉండి, బైక్ నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. టాప్ స్పీడ్ (గంటకు 123 కి.మీ) పరంగా చూసుకుంటే, ఇది పెట్రోల్‌తో నడిచే సగటు 150సిసి మోటార్‌సైకిళ్లతో పోటీగా ఉంటుంది.

ఇక రేంజ్ విషయానికి వస్తే, బేస్ వేరియంట్ (క్లాస్) ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ చార్జ్‌పై 126 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని, అలాగే ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ (ఎలైట్) పూర్తి ఛార్జ్‌పై 225 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

ఈ మోటార్‌సైకిల్‌ను స్టీల్ డబుల్ క్రాడిల్ ట్యూబ్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. దీని ముందు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇది ఈవి భాగంలో క్రీడాన్ మరియు త్వరలో రానున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

మార్కెట్లో ఎస్‌విఎమ్ ప్రాణ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధరలు రూ.1.99 లక్షలు (గ్రాండ్ వేరియంట్) మరియు రూ.2.99 లక్షలు (ఎలైట్ వేరియంట్)గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్. అయితే, ఈ బ్రాండ్ ప్రస్తుతం ఈ మోడళ్లపై ఎస్విఎమ్సిఎస్ఆర్ గ్రీన్ క్రెడిట్ పేరుతో కంపెనీ రూ.25,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

ఈ తగ్గింపు పొందటానికి, కస్టమర్లు వివిధ ప్రదేశాలలో పది మొక్కలను నాటి, దానికి సంబంధించిన రుజువు (ప్రూఫ్)ను కంపెనీ పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఈ కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా, కస్టమర్లు ప్రతినెలా రూ.5,200 చొప్పున 3 ఏళ్ల పాటు చెల్లించి దీనిని సొంతం చేసుకోవచ్చు.

ఎస్‌విఎమ్ మోటార్స్ ప్రస్తుతం కోయంబత్తూరులో ఒక ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. త్వరలోనే కోజికోడ్, మదురై, తిరుపూర్, తిరుచ్చి, బెంగళూరు, పాండిచ్చేరి మరియు దిండిగల్‌లో కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా, చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి ఇతర పొరుగు మార్కెట్లకు తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపింది.