వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

ఇటీవల కాలంలో భారతమార్కెట్లో చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచినట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహనతయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

ధరల పెరుగుదల తర్వాత హోండా మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్ ఇప్పుడు మరింత ఖరీదైనవిగా మారాయి. అయితే కొత్త ధరల పెరుగుదల తర్వాత కూడా వాటికి అదనపు ఫీచర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కంపెనీ హోండా యాక్టివా, ఎస్పీ 125, గ్రాజియా, సిడి డ్రీమ్ 110, లివో, యునికార్న్ సహా పలు మోడళ్ల ధరలను హోండా పెంచింది. కానీ హోండా యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన డియో ధర మాత్రం తగ్గించబడింది.

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

హోండా కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన హోండా యాక్టివా యొక్క 6 జి స్టాండర్డ్ మోడల్ ధర రూ .67,843 కాగా, 6 జి డీలక్స్ ధర రూ .69,589 వరకు ఉంది. అదేవిధంగా 6 జి లిమిటెడ్ స్టాండర్డ్ ధర రూ .69,343 కాగా, 6 జి లిమిటెడ్ డీలక్స్ ధర 71,089 రూపాయల వరకు ఉంది.

MOST READ:కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

ఇదే సమయంలో, యాక్టివా 125 డ్రమ్ ధరను 71,674 రూపాయలు, డ్రమ్ / అల్లాయ్ ధర 75,242 రూపాయలకు పెంచబడింది. ఇందులో టాప్ మోడల్ యాక్టివా 125 డిస్క్ ధర రూ. 78,797. హోండా గ్రాజియా డ్రమ్ వేరియంట్ ధర రూ. 75,859, డిస్క్ వేరియంట్ ధర రూ. 83,185, స్పోర్ట్ ఎడిషన్ ధర రూ. 84,185 గా ఉంది.

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

ఇప్పుడు ప్రముఖ హోండా సిడి డ్రీమ్ 110 స్టాండర్డ్ ధర రూ .64,421, డీలక్స్ ధర రూ .65,421. దీని తరువాత సిబి షైన్ డ్రమ్ వేరియంట్ ధర 71,550 రూపాయలు, డిస్క్ వేరియంట్ ధర 76,346 రూపాయలు. హోండా ఎస్పీ 125 డ్రమ్ మోడల్ ధరను 77,145 రూపాయలకు, డిస్క్ వేరియన్త ధరను 81,441 రూపాయల వరకు, యునికార్న్ ధరను 97,356 రూపాయల వరకు పంచడం జరిగింది.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

హోండా యొక్క ఎక్స్‌బ్లేడ్ వేరియంట్లో స్టాండర్డ్ ధర రూ. 1,09,264 కాగా, డీలక్స్ వేరియంట్ ధర రూ. 1,13,654 వరకు ఉంది. హోండా హార్నెట్ 2.0 ధర రూ. 1,29,608, రెప్సోల్ ఎడిషన్ ధర రూ. 1,31,608 వరకు ఉంది.

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

అయితే హోండా కంపెనీ డియో స్టాండర్డ్ ధరను 63,273 రూపాయలకు, డీలక్స్ ధరను 66,671 రూపాయలకు, రెప్సోల్ ఎడిషన్‌ను 69,171 రూపాయలకు తగ్గించింది. అదే సమయంలో, హోండా లివో డ్రమ్ ధర 69,971 రూపాయలు, డిస్క్ ధర 74,171 రూపాయలకు చేరింది.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

హోండా తన ద్విచక్ర వాహనాల ధరను పెంచుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే, దీని ప్రకారం హోండా తన హైనెస్ సిబి 350 ధరను రూ. 5000 వరకు పెంచే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉండగా ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే హీరో, యమహా వంటి సంస్థలు కూడా తమ వాహనాల ధరల పెరుగుదలను ప్రకటించాయి. ముడి పదార్థాల ధరల పెరుగుదల ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం వల్ల, ధరలపెరుగుదల జరుగుతోందని కంపనీలు తెలిపాయి.

Most Read Articles

English summary
Honda Bike & Scooter Price Changed In April 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X