విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న 2021 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షో (2021 EICMA) లో చైనా-ఆస్ట్రేలియన్ కంపెనీ అయిన 'విమోటో సోకో' (Vmoto Soco)ఓ అధునాతన ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. చూడటానికి హాలీవుడ్ సినిమాలలో కనిపించే ఫ్యూచరిస్టిక్ బైక్ మాదిరిగా ఉండే 'విమోటో స్టాష్' (Vmoto Stash) ఇ-బైక్ ను కంపెనీ ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు మరియు పూర్తి చార్జ్ పై 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

విమోటో సోకో ఈ ఎగ్జిబిషన్‌లో అనేక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రదర్శించింది. వీటిలో సూపర్ సోకో టిఎస్ (Super Soco TS), సూపర్ సోకో టిసి (Super Soco TC), సూపర్ సోకో టిఎస్ఎక్స్ (Super Soco TSX) మరియు సూపర్ సోకో టిసి మ్యాక్స్ (Super Soco TC Max) మోడళ్లు ఉన్నాయి. వీటిన్నింటిలో కెల్లా విమోటో స్టాష్ (Vmoto Stash) చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని విశిష్టమైన డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

Vmoto Stash అనేది ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ప్రీమియం మోటార్‌సైకిల్ మరియు ఇది యూరప్‌లోని సూపర్ సోకో టిసి మాక్స్ కంటే ప్రీమియంగా ఉంటుంది. ఇది చూడటానికి ఇంచు మించు మనదేశంలో లభిస్తున్న రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది మరియు సౌకర్యవంతమైన రైడింగ్ వైఖరితో రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది, ఈ సూపర్ ఫాస్ట్ కెపాసిటీ కోసం కంపెనీ ఇందులో 6 kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించింది. అలాగే, ఇది అధిక రేంజ్ ను అందించడానికి ఇందులో 72V-100Ah - 7.2 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 250 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే, ఈ రేంజ్ గరిష్టంగా 105 కి.మీ వేగంతో ప్రయాణిస్తే సాధించలేము, గంటకు 45 కి.మీ తక్కువ వేగంతో ప్రయాణించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

సాధారణ హోమ్ చార్జర్ సాయంతో ఈ బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పట్టవచ్చని కంపెనీ తెలిపింది. అదే, ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా అయితే, ఈ బ్యాటరీని చాలా త్వరగా చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే, ఖచ్చితమైన ఫాస్ట్ చార్జింగ్ టైమ్‌లైన్ ను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. విమోటో స్టాష్ పూర్తిగా భిన్నమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ బైక్ ముందు భాగం చాలా రగ్గడ్ గా కనిపిస్తుంది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

ఈ బైక్‌లో హై బిల్డ్ బాడీ ప్యానెల్స్‌ని ఉపయోగించారు. ఫ్యూయెల్ ట్యాంక్ స్థానాన్ని స్టోరేజ్ స్పేస్ కోసం డిజైన్ చేశారు మరియు ఇందులో ఓ పెద్ద ఫుల్ సైజ్ హెల్మెట్ ను భద్రపరచుకోవచ్చు. ఇందులో U-ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు దాని మధ్యలో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, టింటెడ్ బ్లాక్ విండ్‌స్క్రీన్, స్పియర్-ఆకారపు ఇండికేటర్స్, ఫ్లాట్ హ్యాండిల్‌బార్లు, స్ప్లిట్ సీట్, అల్లాయ్ వీల్స్, సొగసైన గ్రాబ్ రైల్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి అంశాలు ఉన్నాయి.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ బైక్ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ముందు మరియు వెనుక చక్రాలపై వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. రైడర్ సమాచారం కోసం ఇందులో దీర్ఘచతురస్రాకారపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉపయోగించబడింది. ఇది బ్లూటూత్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ముందుగా యూరప్ మరియు అమెరికా వంటి మార్కెట్లలో విడుదల కానుంది. యూరప్ లో దీని ధర సుమారు 4,690 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 3.92 లక్షలు) ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతానికి, ఇది ఇండియాకు వస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, విమోటో సోకో బ్రాండ్ మాత్రం చాలా కాలంగా భారతదేశంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

Revolt RV400 బైక్ గురించి క్లుప్తంగా..

ఒకవేళ మనదేశంలో కూడా మీరు ఇలాంటి ఓ గుడ్ లుకింగ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నట్లయితే, మన భారత ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) అందిస్తున్న రివోల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) బైక్ ను ప్రత్యమాన్యంగా ఎంచుకోవచ్చు. విమోటో స్టాష్ ఇ-బైక్ తో పోల్చుకుంటే, రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ ఇటీవలే వైజాగ్ నగరంలో కూడా ఓ డీలర్‌షిప్ ను ప్రారంభించింది.

విమోటో స్టాష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆవిష్కరణ.. చూడటానికి రివోల్ట్ బైక్ మాదిరిగా ఉంది కదూ..

రివోల్ట్ మోటార్స్ విక్రయిస్తున్న ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్ లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. పూర్తి చార్జ్‌పై ఈ బైక్ 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఎకో మోడ్‌లో దీని రేంజ్ 150 కిలోమీటర్లు, నార్మల్ మోడ్‌లో 100 కిలోమీటర్లు మరియు స్పోర్ట్ మోడ్‌లో 80 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్‌ను బట్టి టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటాయి. ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
The futuristic e bike vmoto stash revealed at 2021 eicma details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X