గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

గడచిన ఆర్థిక సంవత్సరం (2020-2021)లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ జాబితా విడుదలైంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం కారణంగా, గడచిన ఆర్థిక సంవత్సరం కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైంది. గడచిన ఏప్రిల్ 2020 నెలలో సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఇలా జరగటం ఇది మొదటిసారి.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

గతేడాది మే నెల చివరి భాగంలో లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో తిరిగి ఆటోమొబైల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు, వ్యక్తిగత రవాణా వైపు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లో టూవీలర్ అమ్మకాలు పెరిగాయి.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

అయినప్పటికీ, 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని దాదాపు అన్ని మేజర్ బ్రాండ్ టూవీలర్ల అమ్మకాలు తక్కువగానే ఉన్నాయి. కాకపోతే, హీరో ప్లెజర్, హీరో డెస్టినీ, యమహా రే స్కూటర్లు మాత్రం ఈ సమయంలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరచాయి.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే నెంబర్ వన్ స్కూటర్ హోండా యాక్టివా గడచిన ఆర్థిక సంవత్సరంలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరం (20-21)లో 19,39,640 యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి.అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (19-20)లో ఇవి 25,91,059 యూనిట్లుగా ఉన్నాయి.

MOST READ:అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

ఈ సమయంలో హోండా యాక్టివా అమ్మకాలు 25 శాతం తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ మోడల్ మొత్తం స్కూటర్ విభాగంలో 50.8 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో మిగిలిన 9 మోడళ్ల స్కూటర్ల అమ్మకాలు మొత్తం కలిపినా, హోండా యాక్టివా అమ్మకాలతో సమానం కాలేవు.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

ఈ జాబితాలో టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ద్వితీయ స్థానంలో ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 5,40,466 యూనిట్ల టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి 5,95,467 యూనిట్లుగా ఉన్నాయి.

Rank Models FY2021 FY2020 Growth (%)
1 Honda Activa 19,39,640 25,91,059 -25
2 TVS Jupiter 5,40,466 5,95,467 -9
3 Honda Dio 3,14,417 4,39,799 -29
4 TVS Ntorq 2,51,491 2,65,016 -5
5 Hero Pleasure 2,03,594 1,55,329 31
6 Hero Destini 125 1,44,332 1,13,944 27
7 Yamaha Ray 1,30,648 1,07,485 22
8 Yamaha Fascino 1,08,496 1,66,491 -35
9 Hero Maestro 95,533 94,533 1
10 TVS Pep+ 89,147 90,309 -1

Source: Autopunditz

MOST READ:కరోనా టైమ్‌లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు 9 శాతం తగ్గాయి. ఏప్రిల్ 2020 మినహా మిగతా అన్ని నెలల్లో జూపిటర్ స్కూటర్లు యథావిధిగా అమ్ముడయ్యాయి.హోండా యాక్టివాకు మరియు టీవీఎస్ జూపిటర్‌కు మధ్య 14 లక్షల యూనిట్ల అమ్మకాల వ్యత్యాసం ఉంది. దీన్నిబట్టి చూస్తే, హోండా ప్రతి నెలా భారతదేశంలో ఎంత అధిక సంఖ్యలో యాక్టివా స్కూటర్లను విక్రయిస్తుందో అర్థమవుతోంది.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

హోండా యాక్టివా తర్వాత ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మరొక స్కూటర్‌గా హోండా డియో నిలుస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 3,14,417 యూనిట్ల డియో స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఇదే సమయంలో ఇవి 4,39,799 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో హోండా డియో అమ్మకాలు 29 శాతం క్షీణించాయి.

MOST READ:శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

టీవీఎస్ జూపిటర్ తర్వాత ఈ బ్రాండ్ నుండి ఎక్కువ అమ్ముడవుతున్న మరో స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్. ఈ సమయంలో టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ అమ్మకాలు 2,65,016 యూనిట్ల నుండి 2,51,491 యూనిట్లకు తగ్గి, 5 శాతం క్షీణతను నమోదు చేశాయి.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ విక్రయిస్తున్న ప్లెజర్ స్కూటర్. ఈ మోడల్ అమ్మకాలు 31 శాతం వృద్ధి చెంది 1,55,329 యూనిట్ల నుండి 2,03,594 యూనిట్లకు పెరిగాయి. అలాగే, హీరో డెస్టినీ అమ్మకాలు కూడా 27 వృద్ధి చెంది, 1,13,944 యూనిట్ల నుండి 1,44,332 యూనిట్లకు పెరిగాయి.

గత ఆర్థిక సంవత్సరంలో నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచిన హోండా యాక్టివా

గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధిని నమోదు చేసిన మరొక స్కూటర్ యమహా రే. ఈ సమయంలో యమహా రే అమ్మకాలు 1,07,485 యూనిట్ల నుండి 1,30,648 యూనిట్లకు పెరిగి 22 శాతం వృద్ధిని కనబరిచాయి. ఈ జాబితాలో 8, 9 మరియు 10వ స్థానాల్లో వరుసగా యమహా ఫాసినో, హీరో మ్యాస్ట్రో, టీవీఎస్ పెప్ ప్లస్ మోడళ్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 10 Best Selling Scooters In FY2021, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X