భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

గడచిన డిసెంబర్ 2020 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో హీరో మోటోకార్ప్, హోండా మరియు టివిఎస్ కంపెనీలు ఎప్పటిలానే వరుసగా టాప్-3 స్థానాల్లో నిలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి.

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

డిసెంబర్ 2019తో పోలిస్తే డిసెంబర్ 2020 నెలలో భారత ద్విచక్ర వాహన విభాగంలో మొత్తం అమ్మకాలు 11.28 లక్షల యూనిట్లుగా నమోదై 7.4 శాతం వృద్ధిని కనబరిచాయి. గత నెల టాప్-10 టూవీలర్ బ్రాండ్ జాబితాలో అనేక కంపెనీలు సానుకూల వృద్ధిని కనబరిచాయి.

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

ఈ జాబితాలో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉంది. గత 2020 డిసెంబర్‌లో కంపెనీ 4,25,033 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. డిసెంబర్ 2019లో ఇవే అమ్మకాలు 4,12,009 యూనిట్లగా ఉన్నాయి. అప్పటితో పోల్చుకుంటే అమ్మకాలు 3.2 శాతం వృద్ధి.

MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న హోండా టూ-వీలర్స్. 2019 డిసెంబర్‌లో హోండా టూవీలర్స్ మొత్తం అమ్మకాలు 230,197 యూనిట్లుగా ఉండగా, కంపెనీ 2020 డిసెంబర్‌లో 242,046 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది. వార్షిక అమ్మకాల్లో హోండా 5.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

ఇకపోతే, చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టివిఎస్ మోటార్ కంపెనీ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత 2020 డిసెంబర్‌లో టివిఎస్ మొత్తం 1,76,912 టూవీలర్లను విక్రియంచింది. డిసెంబర్ 2019లో ఇవి 1,57,244 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 12.5 శాతం పెరిగాయి.

MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

బజాజ్ ఆటో ఈ జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. డిసెంబర్ 2020లో కంపెనీ అమ్మకాలు 1,28,642 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, డిసెంబర్ 2019లో ఇవి 1,24,125 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో బ్రాండ్ అమ్మకాలు 3.6 శాతం పెరిగాయి.

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

ఇండియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 65,492 యూనిట్లను విక్రయించి టాప్-5 జాబితాలో చోటు దక్కించుకుంది. డిసెంబర్ 2019లో ఇవి 48,489 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక నివేదికలతో పోల్చితే, చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఈ సమయంలో 35.1 శాతం వృద్ధిని సాధించింది.

Rank Two Wheeler OEM Dec'20 Dec'19 Growth (%)
1 Hero MotoCorp 4,25,033 4,12,009 3.2
2 Honda 2,42,046 2,30,197 5.1
3 TVS 1,76,912 1,57,244 12.5
4 Bajaj Auto 1,28,642 1,24,125 3.6
5 Royal Enfield 65,492 48,489 35.1
6 Suzuki 44,773 44,368 0.9
7 Yamaha 39,224 29,486 33.0
8 Piaggio 5,610 3,672 52.8
9 Kawasaki 102 127 -19.7
10 Triumph 59 50 18.0
11 Mahindra 20 68 -70.6
12 Harley-Davidson 4 203 -98.0

MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

ఈ జాబితాలో ఆరవ మరియు ఏడవ స్థానాలను వరుసగా సుజుకి మరియు యమహా బ్రాండ్లు దక్కించుకున్నాయి. గత డిసెంబర్ 2020లో సుజుకి 44,773 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, యమహా అదే నెలలో 39,224 యూనిట్లను విక్రయించింది. వార్షిక అమ్మకాల పరంగా ఈ రెండు కంపెనీలు వరుసగా 0.9 మరియు 33 శాతం వృద్ధిని సాధించాయి.

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

ఇకపోతే, పియాజియో, కవాసాకి మరియు ట్రయంప్ బ్రాండ్లు ఒకే క్రమంలో టాప్-10 జాబితాని పూర్తి చేసాయి. మార్కెట్లో అప్రియాలియా మరియు వెస్పా టూవీలర్లను విక్రయించే పియాజియో డిసెంబర్ 2020లో 5,610 యూనిట్లను విక్రయించి వార్షిక అమ్మకాలలో 52 శాతం వృద్ధిని సాధించింది.

MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

భారత టూవీలర్ మార్కెట్లో టాప్-10 బ్రాండ్లు ఇవే..

అయితే, ఇదే సమయంలో కవాసకి బ్రాండ్ అమ్మకాలు 2019తో డిసెంబర్‌తో (127 యూనిట్లతో) పోలిస్తే డిసెంబర్ 2020లో కేవలం 102 యూనిట్లను మాత్రమే విక్రయించి వార్షికంగా 19.7 శాతం క్షీణతను నమోదు చేసింది. కాగా, ట్రయంప్ డిసెంబర్ 2020లో 59 యూనిట్లను విక్రయించి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Most Read Articles

English summary
Top 10 Best Selling Two-Wheeler Brands In India In December 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X