ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

గడచిన ఫిబ్రవరి 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాల సమాచారం వెల్లడైంది. గత నెలలో హీరో స్ప్లెండర్, దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే టూవీలర్ టైటిల్‌ను దక్కించుకున్న హోండా యాక్టివాను ఓవర్‌టేక్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2021లో మొత్తం 10,14,963 యూనిట్లు టూవీలర్లు అమ్ముడయ్యాయి.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

గడచిన సంవత్సరం ఇదే సమయంలో పోలిస్తే మొత్తం టూవీలర్ల అమ్మకాలు 6.44 శాతం వృద్ధిని సాధించాయి. గత నెలలో మోడల్ వారీగా టాప్-10 టూవీలర్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి:

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

ఫిబ్రవరి 2021లో హీరో స్ప్లెండర్ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. గత నెలలో ఇది 2,47,422 యూనిట్ల స్ప్లెండర్ మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2020లో ఈ మోడల్ అమ్మకాలు 2,15,196 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఇది 14.98 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

ఇకపోతే, రెండవ స్థానానికి పడిపోయిన హోండా యాక్టివా గడచిన నెలలో 2,09,389 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో ఇవి 2,22,961 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో యాక్టివా అమ్మకాలు 6 శాతం తగ్గాయి.

Rank Model Feb-21 Feb-20 Growth (%)
1 Hero Splendor 2,47,422 2,15,196 14.98
2 Honda Activa 2,09,389 2,22,961 -6.09
3 Hero HF Deluxe 1,26,309 1,75,997 -28.23
4 Honda CB Shine 1,15,970 50,825 128.18
5 Bajaj Pulsar 81,454 75,669 7.65
6 TVS Jupiter 52,189 31,440 66.00
7 TVS XL Super 51,445 55,802 -7.81
8 Suzuki Access 48,496 50,103 -3.21
9 Bajaj Platina 46,264 33,799 36.88
10 Royal Enfield Classic 350 36,025 41,786 -13.79
ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది హీరో మోటోకార్ప్ అందిస్తున్న హెచ్‌ఎఫ్ డీలక్స్. గత నెలలో 1,26,309 యూనిట్ల హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇవి 1,75,997 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 28 శాతం తగ్గాయి.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

గత నెలలో హోండా సిబి షైన్ అమ్మకాలు అత్యధికంగా 128 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2020లో 50,825 యూనిట్లుగా ఉన్న షైన్ అమ్మకాలు గత నెలలో 1,15,970 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2021లో బజాజ్ పల్సర్ 81,454 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో ఉంది.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ఫిబ్రవరి 2021లో 52,189 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో ఈ మోడల్ అమ్మకాల సంఖ్య 31,440 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ అమ్మకాల పరంగా 66 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

టీవీఎస్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోపెడ్ టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 51,445 యూనిట్లుగా ఉన్నాయి. ఆ తర్వాతి (8వ) స్థానంలో సుజుకి యాక్సెస్ స్కూటర్ ఉంది.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

ఫిబ్రవరి 2020 అమ్మకాల (50,103) సంఖ్యతో పోలిస్తే, ఫిబ్రవరి 2021లో సుజుకి యాక్సెస్ అమ్మకాలు 3 శాతం క్షీణించి 48,496 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇకపోతే, గత నెలలో బజాజ్ ప్లాటినా 46,264 యూనిట్ల అమ్మకాలతో 9వ స్థానంలో ఉంది. ఈ మోడల్ అమ్మకాలు 36 శాతం పెరిగాయి.

ఫిబ్రవరి అమ్మకాల్లో హోండా యాక్టివాను ఓడించిన హీరో స్ప్లెండర్!

ఈ జాబితాలో చివరిగా 10వ స్థానంలో నిలిచింది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్. ఫిబ్రవరి 2021లో మొత్తం 36,025 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే, ఫిబ్రవరి 2020లో క్లాసిక్ 350 మోడల్ విక్రయాలు గరిష్టంగా 41,786 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో క్లాసిక్ 350 అమ్మకాలు 13 శాతం క్షీణించాయి.

Source: Rushlane

More from DriveSpark

Article Published On: Thursday, March 18, 2021, 13:04 [IST]
English summary
Top Selling 2-Wheelers Feb 2021: Hero Splendor Tops The List. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+