2021 లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 బైకులు

భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా విజృంభించి కేవలం ప్రజలను మాత్రమే కాకుండా ఆటో మొబైల్ పరిశ్రమలను కూడా భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. కానీ కరోనా ఉదృతి కొంత తగ్గుముఖం పట్టిన తరువాత దేశీయ మార్కెట్లో చాలా కొత్త బైకులు అడుగుపెట్టాయి. ఇందులో కొన్ని కొత్త మోడల్ బైకులు కాగా, మరికొన్ని అప్డేటెడ్ బైక్స్.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులను గురించి తెలుసుకోవడానికి మరియు కొనుగోలు చేయడానికి చాలామంది కస్టమర్లు గూగుల్‌లో సర్చ్ చేశారు. ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించిన టాప్ 10 బైక్ మోడల్‌ల జాబితాను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350):

2021 లో భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది ప్రజలు గూగుల్ సెర్చ్‌లో సర్చ్ చేసిన టాప్ 10 బైకులతో మొదటి స్థానంలో నిలిచిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 'క్లాసిక్ 350'. దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్త బైక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఎక్కువ మంది దీని కోసం సర్చ్ చేశారన్నట్లు నివేదికల ద్వారా తెలిసింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

దేశంలో గూగుల్‌లో ప్రతి నెల 8 లక్షల సార్లు సెర్చ్ చేసిన తొలి బైక్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలిచింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త 2021 బైక్ గురించిని ఫీచర్స్ మరియు ఇతర వివరాల కోసం చాలామంది వ్యక్తులు శోధించారు. ఈ కారణంగానే ఈ బైక్ టాప్ 10 సర్చింగ్ బైకులతో ప్రధమ స్థానంలో నిలిచింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

యమహా ఎమ్‌టి-15 (Yamaha MT-15):

2021 లో గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేయబడిన 2 వ బైక్ యమహా కంపెనీ యొక్క యమహా ఎమ్‌టి-15 బైక్. ఈ బైక్ కేవలం ఈ ఒక్క సంవత్సరంలో ప్రతి నెల ఏకంగా 5.5 లక్షల సార్లు సెర్చ్ చేసారు. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైకులో ఎలాంటి అప్డేట్స్ లేకపోయినప్పటికీ ఎక్కువమంది వాహన ప్రియులు దీనికోసం ఎక్కువగా సెర్చ్ చేసారని నివేదికల ద్వారా తెలిసింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

కెటిఎమ్ ఆర్‌సి 200 (KTM RC 200):

దేశీయ మార్కెట్లో ఎక్కువమంది యువ కస్టమర్లు ఇష్టపడే బైకులలో ఒకటి కెటిఎమ్. కెటిఎమ్ కంపెనీ యొక్క ఆర్‌సి 200 బైక్ 2021 లో అత్యధికంగా సర్చ్ చేసిన బైకుల జాబితాలో టాప్ 10 లో ఒకటిగా నిలిచింది. ఈ బైక్ గూగుల్‌లో ప్రతి నెలా 4.5 లక్షల సార్లు శోధించబడింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

ఈ కొత్త KTM RC 200 బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. అంతే కాకుండా ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటూ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది మంచి స్పోర్టి లుక్ లో ఉంటుంది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో యొక్క బజాజ్ పల్సర్ 125 బైక్ గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేయబడిన ఈ టాప్ 10 జాబితాలో 4 వ స్థానంలో ఉంది. కంపెనీ యొక్క బజాజ్ పల్సర్ సిరీస్ బైక్‌లు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ బజాజ్ పల్సర్ 125 బైక్ ను ప్రజలు గూగుల్‌లో 3.5 లక్షల సార్లు సెర్చ్ చేసినట్లు తెలిసింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

బజాజ్ పల్సర్ 125 బైక్‌కు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలతో మరియు మంచి ఆదరణ పొందుతూ ముందుకు దూసుకెలుతోంది. ఏది ఏమైనా ఈ టాప్ 10 జాబితాలో ఈ బజాజ్ యొక్క బైక్ చేరటం చాలా అభినందనీయం.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

యమహా ఆర్15 (Yamaha R15):

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి మంచి ఆదరణతో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ లో సోధించిన టాప్ 10 బైకులతో జాబితాలో యమహా కంపెనీ యొక్క యమహా ఆర్15 బైక్ కూడా స్థానం పొందింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

యమహా ఆర్15 బైక్ ఈ టాప్ 10 జాబితాలో 5 వ బైక్. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan):

మార్కెట్లో అత్యంత ప్రజారణపొందిన టూవీలర్ బ్రాండ్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' యొక్క ఆఫ్-రోడర్ బైక్ హిమాలయన్ ఈ జాబితాలో 6 వ స్థానంలో చేరింది. ఇది అద్భుతమై సామర్థ్యానికి నిదర్శనం. భారతదేశంలోని ఎంట్రీ లెవల్ ఆఫ్ రోడ్ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఆధిపత్యం చెలాయిస్తోంది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ దీనిని 2021 లో అప్‌డేట్ చేసింది. ఈ అప్డేట్స్ లో భాగంగానే ఈ కొత్త బైకులో ట్రిప్పర్ నావిగేషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్స్ అదివ్వబడ్డాయి. ఆధునిక ఫీచర్స్ కలిగి సరసమైన ధర కలిగిన కారణంగా ఈ బైక్ మార్కెట్లో మంచి ఆదరణ పొంది మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే ఎక్కువ మంది దీనిని సర్చ్ చేశారు.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

కెటిఎమ్ ఆర్‌సి390 (KTM RC390):

కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్ తరువాత కంపెనీ యొక్క కెటిఎమ్ RC 390 ఎక్కువగా సర్చ్ చేయబడింది. ఈ కొత్త వెర్షన్ ఈ సంవత్సరం వెల్లడైంది. KTM బైక్ ప్రియులు ఇప్పటికే చాలా రోజులుగా కొత్త RC 390 కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీ దీనిని 2022 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

సుజుకి హయబుసా (Suzuki Hayabusa):

సుజుకి మోటార్ సైకిల్ యొక్క పవర్ ఫుల్ స్పోర్ట్స్ బైక్ హయబుసా ఈ సంవత్సరం ఇంటర్నెట్ శోధనలో టాప్ 10 జాబితాలో ఆధిపత్యం చెలాయించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ కొత్త తరం మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే, ఈ బైక్ గురించి సర్చ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇవేదికల ప్రకారం కంపెనీ యొక్క ఈ బైక్ ప్రతి నెల దాదాపు 3 లక్షల సార్లు సర్చ్ చేయబడినట్లు తెలిసింది. Suzuki Hayabusa దేశంలో అత్యధిక డిమాండ్ కలిగిన ఖరీదైన బైక్.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus):

ఈ సంవత్సరం అత్యధికంగా శోధించబడిన టాప్ 10 బైక్స్ జాబితాలో హీరో కంపెనీ బైక్ కూడా చేరింది. ఇది నిజంగా గొప్ప విషయం. Hero Splendor Plus అనేది కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ బైక్. ఒకప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ బైక్ యొక్క ఆదరణ ఈ రోజుకి కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ బైక్ దాదాపు 3 లక్షల సార్లు శోధించబడింది.

2021 లో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన టాప్ 10 బైకులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 (Royal Enfield Meteor 350):

ప్రస్తుతం ఈ సంవత్సరం ఎక్కువగా శోధించబడిన టాప్ 10 జాబితాలో ఒక్క రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైకులే 3 ఉన్నాయి. కంపెనీ యొక్క మూడవ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350. ఇది టాప్ 10 జాబితాలో చివరి స్థానంలో చేరింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ థండర్‌బర్డ్ 350 స్థానంలో విడుదల చేయబడింది. ఈ బైక్ ఎక్కువమంది ప్రజలను ఆకర్శించగలుగుతోంది.

Most Read Articles

English summary
Top 10 bike searched in google in 2021 royal enfield classic yamaha mt 15 and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X