నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ద్విచక్ర వాహన విభాగం నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా, మార్కెట్లో విక్రయించే స్కూటర్ల సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా ప్రతి నెలా పెరుగుతోంది. ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందినవి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, సాధారణ పెట్రోల్ టూవీలర్ల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

గడచిన నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విక్రయించబడిన టాప్ 10 స్కూటర్ల వివరాలు విడుదలయ్యాయి. గత నెలలో భారతదేశంలో మొత్తం 2,86,765 స్కూటర్లు విక్రయించబడ్డాయి. ఈ సంఖ్య నవంబర్ 2020 నెలలో విక్రయించిన 4,57,519 స్కూటర్లతో పోలిస్తే దాదాపు 37.32 శాతం తక్కువగా ఉంది. ఈ విభాగంలో హోండా యాక్టివా (Honda Activa) ఎప్పటి లాగే గత నెలలో కూడా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

గత నెలలో మొత్తం 1,24,082 హోండా యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి. కానీ నవంబర్ 2020లో విక్రయించిన 2,25,822 యాక్టివా స్కూటర్లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు దాదాపు లక్ష యూనిట్లకు పైగా తగ్గాయి. ఈ విభాగంలో భారతదేశంలో హోండా యాక్టివా స్కూటర్ల అమ్మకాలు దాదాపు 45.05 శాతం తగ్గాయి. అయినప్పటికీ, ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న మొత్తం పెట్రోల్ స్కూటర్లలో హోండా యాక్టివా దాదాపు 43.27 శాతం వాటాను కలిగి ఉంది.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

ఇక టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) విషయానికి వస్తే, ఇది ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. టీవీఎస్ గత నవంబర్‌ 2021 నెలలో మొత్తం 44,139 జూపిటర్ స్కూటర్లను విక్రయించింది. కాగా, గతేడాది ఇదే సమయంలో టీవీఎస్ మొత్తం 62,626 యూనిట్ల జూపిటర్ స్కూటర్లను విక్రయించింది. అంటే గత నెలలో టీవీఎస్ దాదాపు 18,000 యూనిట్లు తక్కువ జూపిటర్ స్కూటర్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో (మూడవ స్థానంలో) సుజుకి యాక్సెస్ (Suzuki Access) ఉంది.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

సుజుకి యాక్సెస్ గత నెలలో దాదాపు టీవీఎస్ జూపిటర్‌తో సమానంగా 42,481 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2020 నెలలో కూడా కంపెనీ దాదాపు అదే సంఖ్యలో (45,582 యూనిట్లు) యాక్సెస్ స్కూటర్‌లను విక్రయించింది. టీవీఎస్ కి చెందిన మరో స్కూటర్ ఎన్‌టార్క్ (TVS Ntorq) ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఆశ్చర్యకరంగా, కేవలం 19,157 యూనిట్ల విక్రయాలతోనే టీవీఎస్ ఎన్‌టార్క్ 4వ స్థానాన్ని దక్కించుకుంది. నవంబర్ 2020లో కంపెనీ దీని కంటే 33.91 శాతం ఎక్కువగా ఎన్‌టార్క్ స్కూటర్లను విక్రయించింది.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

హోండా టూవీలర్స్ అందిస్తున్న మరో పాపులర్ యూత్ స్కూటర్ హోండా డియో (Honda Dio) గతేడాది ఇదే సమయంలో 4వ స్థానంలో నిలిచింది. అయితే, ఇప్పుడు ఆ స్థానాన్ని టీవీఎస్ ఎన్‌టార్క్ కైవసం చేసుకుంది. డియో స్కూటర్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో సుదీర్ఘ విరామం తర్వాత యమహా స్కూటర్ టాప్-5 లోకి ప్రవేశించింది. యమహాకు చెందిన రే జెడ్ఆర్ (Yamaha RayZR) గత నెలలో 12,344 యూనిట్ల విక్రయాలతో ఐదవ స్థానంలో ఉంది. అయితే, నవంబర్ 2020 నెల విక్రయాలతో పోలిస్తే, రేజెడ్ఆర్ విక్రయాలు 18.99 శాతం తక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో యమహా రేజెడ్ఆర్ అమ్మకాల సంఖ్య 15 వేలు దాటింది.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

ఈ టాప్-10 జాబితాలో కేవలం రెండు స్కూటర్లు మాత్రమే గత ఏడాది నవంబర్‌ నెలతో పోలిస్తే సానుకూల అమ్మకాలను నమోదు చేశాయి. వాటిలో ఒకటి సుజుకి బెర్గ్‌మ్యాన్ (Suzuki Bergman), ఇది గతేడాదితో పోలిస్తే 23.90 శాతం వృద్ధిని సాధించింది. నవంబర్ 2020 నెలలో 9,708 యూనిట్ల బెర్గ్‌మాన్ స్కూటర్లు అమ్ముడు కాగా, నవంబర్ 2021 నెలలో 11,248 బెర్గ్‌మాన్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇకపోతే రెండవది హీరో మోటోకార్ప్ యొక్క ప్లెజర్ (Hero Pleasure) స్కూటర్. గతేడాది ఇదే సమయంలో విక్రయించిన 11,136 యూనిట్లు ప్లెజర్ స్కూటర్లతో పోలిస్తే, గత నెలలో 19,707 యూనిట్లు అమ్ముడై 43.49 శాతం వృద్ధిని నమోదు చేసింది.

నవంబర్ 2021 నెలలో టాప్ 10 స్కూటర్లు: హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ మరెన్నో..

యువ తరానికి ఎంతో ఇష్టమైన హోండా డియో (Honda Dio) స్కూటర్ గత నెలలో విక్రయాల పరంగా 8వ స్థానానికి పడిపోయింది. గత నవంబర్‌ 2021 నెలలో మొత్తం 8,522 డియో స్కూటర్లు విక్రయించబడ్డాయి. అయితే గత ఏడాది నవంబర్‌లో మాత్రం 34,812 డియో స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ సమయంతో పోలిస్తే, హోండా డియో స్కూటర్ అమ్మకాలు భారీగా 75.52 శాతం క్షీణించాయి. ఇక ఈ జాబితాలో ఆ తర్వాతి రెండు స్థానాలలో యమహా ఫాసినో (8,208), హోండా గ్రాజియా (5,448) మోడళ్లు నిలిచాయి.

Most Read Articles

English summary
Top 10 scooters in november 2021 in terms of sales honda activa leads the list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X