ఆగస్ట్ 2021లో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్: అగ్రస్థానంలో హీరో మోటోకార్ప్, చివరి స్థానంలో ట్రైయంప్
గడచిన ఆగస్టు 2021 నెలలో భారతదేశంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 2020 గణాంకాలతో పోల్చుకుంటే, గత నెలలో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 14.6 శాతం క్షీణంచి, 13.31 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.

ఎప్పటి మాదిరిగానే, భారతదేశపు అగ్రగామి టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ గత నెలలో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాంలో (రెండవ స్థానంలో) హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఉంది. గత సంవత్సరం ఆగస్ట్ నెలతో పోలిస్తే హీరో మోటోకార్ప్ తో పాటుగా, హోండా, టీవీఎస్, బజాజ్ ఆటో మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పలు టాప్ టూవీలర్ బ్రాండ్ల అమ్మకాలు తగ్గుదలను నమోదు చేశాయి.

1. హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)
భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ గత నెలలో 4,31,137 యూనిట్లను విక్రయించి మొదటి స్థానంలో ఉంది. అయితే, ఆగస్ట్ 2020 తో పోలిస్తే, ఈ కంపెనీ అమ్మకాలు 24 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ సమయంలో హీరో మోటోకార్ప్ మార్కెట్ వాటా 4 శాతం క్షీణతను నమోదు చేసి, 32 శాతానికి పడిపోయింది.

2. హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle)
భారతదేంలో ద్వితీయ అగ్రగామి టూవీలర్ కంపెనీ మరియు జపనీస్ టూవీలర్ బ్రాండ్ అయిన హోండా మోటార్‌సైకిల్, గత నెలలో 4,01,480 యూనిట్ల టూవీలర్లను విక్రయించి, ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, హోండా అమ్మకాలు 6 శాతం క్షీణతను నమోదు చేశాయి. అయితే, ఇదే సమయంలో హోండా మార్కెట్ వాటా మాత్రం 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం, దీని మార్కెట్ వాటా 30 శాతంగా ఉంది.

3. టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company)
చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ, గత నెలలో 1,79,999 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో టీవీఎస్ మొత్తం 2,18,338 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 17 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఫలితంగా, టీవీఎస్ మార్కెట్ వాటా 0.48 శాతం క్షీణంచి 13.52 శాతానికి తగ్గింది.

4. బజాజ్ ఆటో (Bajaj Auto)
ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో, గడచిన ఆగస్ట్ 2021 నెలలో మొత్తం 1,57,971 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి నాల్గవ స్థానంలో నిలిచింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) ఇవి 1,78,220 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బజాజ్ ఆటో విక్రయాలు 11 శాతం క్షీణతను నమోదు చేశాయి.

5. సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle)
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, గడచిన ఆగస్టు 2021 నెలలో మొత్తం 61,809 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) కంపెనీ అమ్మకాలు 53,139 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో సుజుకి టూవీలర్ సేల్స్ 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

6. యమహా ఇండియా (Yamaha India)
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా, గత నెలలో మొత్తం 54,042 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) కంపెనీ అమ్మకాలు 60,505 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో యమహా ఇండియా అమ్మకాలు 10 శాతం క్షీణించాయి.

7. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield)
భారతదేశపు ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన ఆగస్ట్ 2021 నెలలో మొత్తం 39,070 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) కంపెనీ అమ్మకాలు 47,571 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 18 శాతం క్షీణించాయి.

8. పియాజియో (Piaggio)
ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ పియాజియో గత నెలలో మొత్తం 5,500 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) ఇవి 4,614 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో పియాజియో అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఈ బ్రాండ్ వెస్పా స్కూటర్లు మరియు ఆప్రిలియా ప్రీమియం స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక ఈ జాబితాలో జపనీస్ ప్రీమియం టూవీలర్ బ్రాండ్ కవాసకి 298 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆగస్ట్ 2020లో విక్రయించిన 102 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గత నెల అమ్మకాలలో 192 శాతం వృద్ధిని సాధించింది. ఈ జాబితాలో చివరి (పదవ) స్థానంలో ఉన్నది బ్రిటీష్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ ట్రైయంప్. గత నెలలో ట్రైయంప్ మొత్తం 127 టూవీలర్లను విక్రయించి 126 శాతం వృద్ధిని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








