Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటి హీరో మోటోకార్ప్ (Hero MotoCorp). హీరో మోటోకార్ప్ భారతదేశంలోని టూ-వీలర్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో నాయకత్వం వహిస్తుంది. ఇందులో అత్యధిక అమ్మకాలను చేపట్టగలిగిన కమ్యూటర్ బైక్ హోండా షైన్ 125 (Honda Shine 125). హోండా షైన్ 125 బైక్ దేశీయ మార్కెట్లో 2006 లో ప్రారభించినప్పటి నుంచి కూడా దాదాపు ఒక మిలియన్ యూనిట్లకు పైగా అమ్మకాలను చేపట్టగలిగింది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైక్ ఎక్కువ మంది వాహనదారుల మనసు దోచింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ విభాగంలో ఎక్కువ బైకులు పుట్టుకొచ్చాయి. కావున మీకు హోండా షైన్ 125 (Honda Shine 125) వద్దనుకుంటే, తప్పకుండా ఈ కింద చెప్పిన బైక్స్ కొనుగోలు చేయవచ్చు. ఆ బైక్స్ గురించి మరింత సమాచారం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

హీరో సూపర్ స్ప్లెండర్ (Hero Super Splendor):

హీరో స్ప్లెండర్ 125 సిసి బైక్ దేశీయ మార్కెట్లో మంచి విక్రయాలను పొందగలిగిన బైకుల జాబితాలో ఒకటి. ఇది భారతదేశంలో అత్యంత చౌకైన 125 సిసి మోటార్‌సైకిల్. ఇది వాహా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. హీరో స్ప్లెండర్ బైక్ కంపెనీ యొక్క i3S స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను కలిగి ఉంది, కావున ఇది ఇంధన వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

హీరో స్ప్లెండర్ 125 సిసి బైక్ 125 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 11 బిహెచ్‌పి పవర్‌ మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంటుంది. హీరో స్ప్లెండర్ 125 ధర రూ. 73,900 నుంచి రూ. 77,600 (ఎక్స్-షోరూమ్‌, ఢిల్లీ) వరకు ఉంటుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125):

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) ఇటీవల కాలంలోనే భారతీయ మార్కెట్లో కొత్త 125సీసీ కమ్యూటర్ బైక్ టీవీఎస్ రైడర్‌ను విడుదల చేసింది. టీవీఎస్ రైడర్ 125 ధర రూ. 77,500 నుండి ప్రారంభమై రూ. 85,469 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

టీవీఎస్ రైడర్ 125 బైక్ 10 లీటర్ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

TVS Raider బైక్ 125cc ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

హీరో గ్లామర్ 125 (Hero Glamour 125):

హీరో గ్లామర్ 125 (Hero Glamour 125) బైక్ దేశీయ మార్కెట్లో గత సంవత్సరం ప్రారంభించబడింది. ఇది అనేక అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, i3S ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ మరియు ఆటో సెల్ టెక్నాలజీ ఉన్నాయి. హీరో గ్లామర్ యొక్క X-టెక్ వేరియంట్ LED DRLలు మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ కూడా పొందుతుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

హీరో గ్లామర్ 125 బైక్ 125 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 11 బిహెచ్‌పి పవర్‌ మరియు 11 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త హీరో గ్లామర్ ధర రూ.77,700 నుంచి రూ. 85,100 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125):

బజాజ్ పల్సర్ 125 ఈ విభాగంలో అత్యధిక అమ్మకాలు చేపట్టిన అత్యంత శక్తివంతమైన బైక్. ఇది పైలట్ ల్యాంప్స్, LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్ లైట్ మరియు స్ప్లిట్ సీట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. బజాజ్ పల్సర్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 78,490 నుండి మొదలై రూ. 81,472 వరకు ఉంటుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

బజాజ్ పల్సర్ 125 బైక్ 124.4 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 12 బిహెచ్‌పి పవర్‌ మరియు 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పల్సర్ 125 దాని సెగ్మెంట్‌లో అత్యంత స్పోర్టీగా కనిపించే బైక్. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో సింగిల్ మరియు డబుల్ డిస్క్ బ్రేక్‌ల ఎంపికను కూడా పొందుతుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

హోండా SP125 (Honda SP125):

హోండా SP 125 బైక్ హోండా కంపెనీ యొక్క అత్యంత ఆదరణ పొందిన బైక్అ. అంతే కాకూండా ఇది హోండా షైన్ యొక్క స్పోర్టియర్ వెర్షన్. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఈ బైక్ LED హెడ్‌ల్యాంప్‌లు మరియు స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ECO ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు మైలేజ్ ఇండికేటర్ మొదలైన ఫీచర్లతో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది.

Honda Shine 125 బైక్ వద్దా.. అయితే ఈ బైక్స్ కొనండి

హోండా SP 125 షైన్ బైక్ యొక్క 124 సిసి 11 బిహెచ్‌పి పవర్ మరియు 11 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. భారతదేశంలో హోండా SP 125 బైక్ ధర రూ. 78,947 నుండి మొదలై రూ. 83,242 వరకు ఉంది.

Most Read Articles

English summary
Top 5 125cc bikes other than honda shine 125 details
Story first published: Monday, November 29, 2021, 10:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X