మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశంలో స్కూటర్లకు ప్రజాదరణ మాత్రం తగ్గడం లేదు. నగరాల్లో పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా కస్టమర్లు స్కూటర్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతుండటంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ స్కూటర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

1. హోండా యాక్టివా 6జి (Honda Activa 6G)

హోండా యాక్టివా గురించి భారత కస్టమర్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత స్కూటర్ చరిత్రను తిరగరాసిన మోడల్ ఇది. హోండా 1999 లో యాక్టివా స్కూటర్ ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇది భారతదేశంలో అనేక కొత్త స్కూటర్ల ప్రవేశానికి పునాదులు వేసింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో హోండా యాక్టివా అగ్రస్థానంలో ఉంది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

గతకొన్ని దశాబ్ధాలుగా హోండా యాక్టివా స్కూటర్‌కి పోటీగా అనేక మోడళ్లు పుట్టుకొచ్చినప్పటికీ, దాని స్థానాన్ని మాత్రం కదపలేకపోయాయి. ప్రస్తుతం, భారతదేశంలో అమ్ముడవుతున్న హోండా యాక్టివా 6జి మోడల్ ఆరవ తరానికి చెందినది. మునుపటి మోడళ్లతో పోలిస్తే, ఇది డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అనేక రెట్లు మెరుగుపడింది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

మునుపటి వెర్షన్‌ల మాదిరిగా కాకుండా, కొత్త హోండా యాక్టివా 6జి టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు 12 ఇంచ్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంటుంది. అదనపు సౌలభ్యం కోసం హోండా ఇందులో బయటి వైపు నుండి ఫ్యూయెల్ ఫిల్ చేసుకునే వెసలుబాటు కల్పించింది. గత 2009 తర్వాత హోండా యాక్టివా స్కూటర్ ను కంపెనీ ఇంత పెద్ద అప్‌గ్రేడ్ చేయటం ఇదే మొదటిసారి.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

హోండా యాక్టివా 6జి స్కూటర్‌లో బిఎస్ 6 కంప్లైంట్ 110 సిసి ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో హోండా యాక్టివా 6జి ధరలు రూ. 69,645 నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

2. ఓలా ఎస్ 1ప్రో (Ola S1 Pro)

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్‌కి తగినట్లుగానే కొత్త కంపెనీలు తమ సరికొత్త వాహనాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి భారీ హైప్ తో మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటరే ఈ ఓలా ఎస్1 ప్రో. పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 181 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేసే ఓలా ఎస్1 ప్రో ఇప్పుడు బెస్ట్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అర్బన్-ఫ్రెండ్లీ వాహనాలుగా గుర్తిస్తున్నారు. నగరాల్లో చిన్నపాటి దూరాలను చేరుకునేందుకు మరియు తమ రోజూవారీ ప్రయాణాల కోసం పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, అత్యంత సరసమైన ధర మరియు అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఓలా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు కస్టమర్లను బలంగా ఆకర్షిస్తున్నాయి.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

కొత్త ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ కూడా అనేక విషయాల్లో చాలా ప్రాక్టికాలిటీని కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్లలో పెద్ద 50 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇది ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఏ ఇతర స్కూటర్‌తో పోల్చినా రెండింతలు అధికంగా ఉంటుంది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పెద్ద 3.97 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. దీని సాయంతో ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 11.39 బిహెచ్‌పి శక్తిని మరియు 58 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్, 4జి కనెక్టివిటీ, రివర్స్ మోడ్, ఎల్ఈడి హెడ్‌లైట్లు, ఎల్ఈడి టెయిల్‌ ల్యాంప్‌లతో పాటుగా అనేక ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, దేశీయ విపణిలో ఓలా ఎస్1 ప్రో ధరలు రూ. 1,10,149 నుండి ప్రారంభం అవుతాయి (స్టేట్ మరియు సెంట్రల్ ఫేమ్ సబ్సిడీ తర్వాత, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

3. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)

హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయంగా మరియు పోటీగా అందుబాటులో ఉండే స్కూటర్ సుజుకి యాక్సెస్ 125. జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి ఈ స్కూటర్ ను తొలిసారిగా 2007 లో బారత మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. సుజుకి యాక్సెస్ 125 ను ప్రారంభించడం ద్వారా ఈ టూవీలర్ బ్రాండ్ భారత మార్కెట్లో ఓ స్థిరత్వాన్ని సంపాధించుకుంది. ఈ మోడల్ రాకతో ఖంగుతిన్న హోండా ఆ వెంటనే తమ యాక్టివా స్కూటర్ ను అప్‌గ్రేడ్ చేయటం ప్రారంభించింది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

ప్రస్తుతం, దేశీయ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్లలో సుజుకి యాక్సెస్ 125 కూడా ఒకటి. స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. లేటెస్ట్‌గా బిఎస్6 అప్‌డేట్‌తో వచ్చిన కొత్త సుజుకి యాక్సెస్ 125 మునుపటి తరం మోడళ్ల కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండి, బెటర్ మైలేజీని అందిస్తుంది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో శక్తివంతమైన 124 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధరలు రూ. 73,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

4. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS NTorq 125)

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఒక బెస్ట్ యూత్ స్కూటర్ అని చెప్పొచ్చు. ప్రత్యేకించి యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ స్పోర్టీ డిజైన్ తో ఈ స్కూటర్‌ని రూపొందించింది. భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన మరియు స్టైలిష్‌గా కనిపించే స్కూటర్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 పేరు ప్రధానంగా వినిపిస్తుంది. స్టైల్, ప్రాక్టికాలిటీ, పెర్ఫార్మెన్స్, మైలేజ్ మరియు ఇతర ఫీచర్ల విషయంలో ఇది మెరుగ్గా ఉంటుంది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది రైడర్‌కు మరియు స్కూటర్‌కి మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. రైడర్ తన స్మార్ట్‌ఫోన్ సాయంతో స్కూటర్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే, కొన్ని రకాల ఫీచర్లను కంట్రోల్ కూడా చేయవచ్చు. ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లతో పాటుగా మరిన్ని ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

ఈ స్కూటర్ లోని 125 సిసి 3-వాల్వ్ ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.25 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులో మరింత స్పోర్టీయర్ పెర్ఫార్మెన్స్‌తో కూడుకున్న వేరియంట్ కావాలనుకునే వారి కోసం కంపెనీ ఇందులో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేఎస్ ఎక్స్‌పి మోడల్‌ను కూడా అందిస్తోంది. ఇందులోని అదే ఇంజన్ గరిష్టంగా 10.1 బిహెచ్‌పి పవర్‌ను మరియు 10.8 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్ ధరలు రూ. 72,270 నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

5. టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)

టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్. టీవీఎస్ తమ జూపిటర్ స్కూటర్ ను తొలిసారిగా 2013 లో హోండా యాక్టివాకు పోటీగా ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చిన కేవలం ఐదు సంవత్సరాల్లోనే, ఇది భారతదేశంలో 25 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించగలిగింది.

మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటర్స్.. వీటిలో మీ ఫేవరేట్ స్కూటర్ ఏది?

టీవీఎస్ జూపిటర్ ఓ గొప్ప ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ప్యాకేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ లో బయటి వైపు నుండి ఇంధనాన్ని ఫిల్ చేసుకునే సౌలభ్యం, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, 21 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందలోని బిఎస్1 కంప్లైంట్ 109.7 సిసి ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ ధరలు రూ. 65,673 నుంచి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Most Read Articles

English summary
Top 5 best scooters in india right now what your pick
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X