కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ పల్సర్ (Pulsar) లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బజాజ్ నుండి రానున్న ఈ నెక్స్ట్ జనరేషన్ పల్సర్ మోటార్‌సైకిల్ లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

ప్రస్తుతం, భారత మార్కెట్లో Bajaj Pulsar మోడళ్లు అత్యంత ప్రజాదరణ పొందినవి మరియు యువతను ఎక్కువగా ఆకర్షిస్తాయి. బజాజ్ ఆటో తమ పల్సర్ సిరీస్ లో 125 సిసి మొదలుకొని 220 సిసి వరకు వివిధ రకాల బాడీ స్టైల్ లో వీటిని విక్రయిస్తోంది. కాగా, ప్రస్తుత పండుగ సీజన్ లో కంపెనీ ఈ కొత్త తరం పల్సర్ బైక్ ను మార్కెట్లో విడుదల చేయనుంది.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

తాజా సమాచారం ప్రకారం, కొత్త తరం బజాజ్ పల్సర్ అక్టోబర్ 28, 2021వ తేదీన భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కంపెనీ ఈ కొత్త తరం మోడల్ ను భారత రోడ్లపై పరీక్షిస్తుండగా, ఇప్పటికే పలుమార్లు కెమెరాకి చిక్కింది. తాజాగా, ఈ కొత్త తరం బజాజ్ పల్సర్ కి సంబంధించిన 5 కీలక్ ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. మరి ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

1. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్

బజాజ్ ఆటో నుండి రానున్న కొత్త తరం బజాజ్ పల్సర్‌ లో కంపెనీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ ఫీచర్ ను అందించబోతోంది. ఈ కొత్త ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్ వేరియంట్-నిర్దిష్టంగా ఉండవచ్చు, కొత్త పల్సర్‌ లో కనీసం ఒక ట్రిమ్ ఈ ఫీచర్‌ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

2. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న పల్సర్ బైక్ లలో హాలోజెన్ టర్న్ ఇండికేటర్లు ఉపయోగించబడ్డాయి. కాగా, కొత్తగా రాబోయే కొత్త తరం బజాజ్ పల్సర్ బైక్ రెండు చివర్లలో ఆకర్షణీయంగా కనిపించే ఎల్ఈడి ఇండికేటర్లను ఉపయోగించనున్నారు. ఈ ఇండికేటర్లు ప్రస్తుత పల్సర్‌లో కనిపించే సంప్రదాయ స్టైల్ యూనిట్‌లతో పోలిస్తే, చాలా భిన్నంగా ఉండే అకాశం ఉంది.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

3. డిస్క్ బ్రేక్‌ తో కూడిన అల్లాయ్ వీల్

కొత్త తరం బజాజ్ పల్సర్‌ లో ఇప్పటివరకు కనిపించిన స్పై చిత్రాలలో, ఈ మోటార్‌సైకిల్ పై కంపెనీ కొత్త అల్లాయ్ వీల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాబట్టి కొత్త పల్సర్ రోడ్ బైక్ కానుంది మరియు అల్లాయ్ వీల్స్ మాత్రమే ఉపయోగించబడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతే కాకుండా, ఇది ట్యూబ్‌లెస్ / రేడియన్ టైర్‌ లను పొందనుంది.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

4. ఎయిర్-కూల్డ్ / ఆయిల్-కూల్డ్ ఇంజన్

ఇదివరకు లీకైన చిత్రాలను బట్టి చూస్తే, కొత్త తరం బజాజ్ పల్సర్‌ లో లిక్విడ్-కూల్డ్ బైక్‌ లో రేడియేటర్ లేనట్లుగా కనిపించింది. కాబట్టి, ఈ పరిస్థితుల్లో దాని ఇంజన్ బజాజ్ పల్సర్ 220 మోటార్‌సైకిల్‌ లో ఉపయోగించిన 220 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజన్ కావచ్చని తెలుస్తోంది.

కొత్త తరం Bajaj Pulsar వస్తోంది.. విడుదలకు ముందే ఫీచర్ల వివరాలు లీక్!

5. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు

కొత్త తరం బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో ఉన్న హెడ్‌ల్యాంప్‌లకు ఇరువైపులా కంపెనీ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు అమర్చబడి ఉన్నట్లుగా స్పై చిత్రాలలో వెల్లడైంది. ఇప్పుడు ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ ఫీచర్ బైక్‌ లలో ఒక సాధారణ ఫీచర్ గా మారిపోయింది. ఈ కొత్త ఫీచర్లతో రాబోయే కొత్త తరం పల్సర్ ఖచ్చితంగా కస్టమర్లు ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమాగా ఉంది.

Most Read Articles

English summary
Top 5 features confirmed for new gen bajaj pulsar ahead of launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X