లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

ఆధునిక కార్ల మాదిరిగానే ఇప్పుడు ద్విచక్ర వాహనాలు కూడా అధునాతన ఫీచర్లు మరియు స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఖరీదైన ప్రీమియం మోటార్‌సైకిళ్లకు మాత్రమే పరిమితమైన ఈ తరహా ఫీచర్లు ఇప్పుడు సాధారణ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి తమ దిగువ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లలో అనేక గొప్ప ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో కూడా ఎల్ఈడి లైటింగ్ నుండి బ్లూటూత్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. మరి మనదేశంలో లక్ష రూపాయాల బడ్జెట్‌లో లభించే కొన్ని ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

1. హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ (Hero Glamour Xtec)

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ విభాగంలో అగ్రగామిగా ఉంది. భారతదేశంలో బడ్జెట్ మరియు ఎంట్రీ లెవల్ బైక్‌ లపై ఈ కంపెనీ ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. తాజాగా, ఈ బ్రాండ్ నుండి వచ్చిన కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్‌ మార్కెట్లో కస్టమర్లను ఆకర్షిస్తోంది. సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చిన హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ దాని విభాగంలో అత్యంత ఫీచర్ లోడెడ్ బైక్‌గా నిలిచింది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ లో Google Maps మద్దతుతో కూడిన టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటుగా బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంటుంది. అదనంగా, ఇందులో పూర్తి డిజిటల్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌లైట్, యూఎస్‌బి ఛార్జింగ్ స్లాట్ మరియు ఆటో స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇందులో 125 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 11 బిహెచ్‌పి పవర్ ను మరియు 10.6 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

2. టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125)

చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ తమ కొత్త టీవీఎస్ రైడర్ 125 స్పోర్ట్స్ కమ్యూటర్‌ను ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ యువ కస్టమర్‌లను ఆకట్టుకుంటోంది మరియు హోండా ఎస్‌పి 125 బైక్ కి ప్రత్యామ్నాయంగా మంచి ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో మల్టీ-కలర్ ఎల్‌సిడి డిస్ప్లే, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టెయిల్ ల్యాంప్, సైలెంట్-స్టార్ట్ సిస్టమ్, స్టాప్/స్టార్ట్ సిస్టమ్, రైడ్ మోడ్ అలాగే యూఎస్‌బి ఛార్జింగ్ స్లాట్ వంటి అనేక గొప్ప ఫీచర్లను ఇది కలిగి ఉంది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త TVS Raider 125 బైక్‌లో 124.8 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 3వి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించింది మరియు ఇందులో కిక్ స్టార్ట్ ఆప్షన్ లేదు. కేవలం సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌తోనే లభిస్తుంది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

3. హోండా ఎస్‌పి 125 (Honda SP 125)

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ గతంలో విక్రయించిన హోండా షైన్ ఎస్‌పి 125కి అప్‌డేట్‌గా కంపెనీ ఈ కొత్త హోండా ఎస్‌పి 125 బైక్ ని మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ దాని నాణ్యత మరియు విశ్వసనీయత కారణంగా భారతీయ కస్టమర్లలో మంచి పేరును దక్కించుకుంది. ఇక ఇందులో లభించే ఫీచర్లను పరిశీలిస్తే, ఎల్ఈడి హెడ్‌లైట్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఏసిజి సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

4. హీరో గ్లామర్ (Hero Glamour)

హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ కి దిగువన హీరో మోటోకార్ప్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ హీరో గ్లామర్ హీరో గ్లామర్ దాని విభాగంలో అందుబాటులో ఉన్న పురాతన మోటార్‌సైకిళ్లలో ఒకటి మరియు హీరో గ్లామర్ ఈ విభాగంలో దశాబ్దాలుగా భారతదేశంలో సరసమైన టూ వీలర్ గా ఎక్కువ మార్కెట్‌ వాటాను సంపాదించగలిగింది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

కంపెనీ తమ కొత్త హీరో గ్లామర్ మోడల్ కి కొన్ని అప్‌డేట్‌లను కూడా జోడించింది. కొత్త హీరో గ్లామర్‌లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో కంపెనీ తమ లేటెస్ట్ i3ఎస్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్ ను జోడించింది. ఈ టెక్నాలజీ వలన బైక్ మైలేజ్ పెరుగుతుంది. ఇది ఇంజన్ ఐడిల్ గా ఉండటాన్ని గుర్తించి, ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తుంది మరియు తిరిగి క్లచ్ నొక్కగానే బైక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

లక్ష రూపాయల బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఫీచర్ లోడెడ్ మోటార్‌సైకిళ్లు..

5. బజాజ్ పల్సర్ 150 నియాన్ (Bajaj Pulsar 150 Neon)

బజాజ్ ఆటో నుండి అత్యంత పాపులర్ అయిన బ్రాండ్ పల్సర్. ఈ సిరీస్ లో కంపెనీ విక్రయిస్తున్న బజాజ్ పల్సర్ 150 నియాన్ ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌తో లభిస్తుంది. అయితే, ఇందులో ఎల్ఈడి లైటింగ్‌ మరియు స్మార్ట్ డిజిటల్ స్క్రీన్ వంటి ఫీచర్లు లేవు. ప్రస్తుతం, మార్కెట్లో దీని ధర రూ. 99,418 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుంది.

Most Read Articles

English summary
Top 5 features loaded motorcycle under rs 1 lakh hero glamour tvs raider honda sp and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X