గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

భారత టూవీలర్ మార్కెట్లో ఒకప్పుడు స్కూటర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. అయితే, మారుతున్న కాలంతో పాటే అధునాత స్కూటర్లు అందుబాటులోకి రావడంతో ఆ ట్రెండ్ కాస్త మారిపోయింది. ఇప్పుడు సాధారణ మోటార్‌సైకిళ్లకు పోటీగా స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం, దేశీయ మార్కెట్లో యువతరం నుంచి పెద్దవారి వరకూ వివిధ రకాల స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ మించి తాజాగా యమహా తమ ఆర్15 బైక్ ఆధారంగా తయారు చేసిన ఏరో 155 అనే పెద్ద మాక్సీ స్కూటర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

ప్రస్తుతం, దేశంలో అనేక రకాల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు కూడా ఏ స్కూటర్ కొనాలా అనే సందేహాన్ని కలిగి ఉన్నారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. అలా, ఈ ఏడాది (2021) గూగుల్ సెర్చ్ ఇంజన్ లో శోధించబడిన టాప్ 5 ఇండియన్ స్కూటర్ల వివరాలను గూగుల్ విడుదల చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం రండి.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

1. హోండా యాక్టివా 6జి (Honda Activa 6G)

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా నుండి లభిస్తున్న యాక్టివా స్కూటర్ అమ్మకాల్లోనే కాదు ఇంటర్నెట్ సెర్చ్ లోనూ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ హోండా యాక్టివా ఆదిపత్యాన్ని చలాయిస్తోంది. భారతదేశంలో గూగుల్ సెర్చ్‌లో సగటను ప్రతినెలా 3.5 లక్షల మంది హోండా యాక్టివా 6జి స్కూటర్ కోసం శోధించినట్లు అంతర్జాల దిగ్గజం పేర్కొంది. భారత స్కూటర్ మార్కెట్లో ఓ సరికొత్త శకానికి నాంది పలికిన తొలి మోడళ్లలో హోండా యాక్టివా కూడా ఒకటి.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

అయితే, ఓవరాల్ టూవీలర్స్ పరంగా (మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లను కలిపి) చూస్తే, ఇందులో టాప్ 10 స్థానాలను మోటార్‌సైకిళ్లే దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మాత్రం హోండా యాక్టివా 12వ స్థానంలో నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, యమహా ఎమ్‌టి-15, కెటిఎమ్ ఆర్‌సి200 మరియు బజాజ్ పల్సర్ 125 వంటి బైక్‌లు ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి. హోండా యాక్టివా ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, అత్యధికంగా శోధించిన స్కూటర్ల జాబితాలో మాత్రం నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

2. టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ స్కూటర్లలో ప్రధానమైనది టీవీఎస్ జూపిటర్. ప్రస్తుతం, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఇది కూడా ఒకటిగా ఉంది. ఇది ఈ విభాగంలో, ప్రధానంగా హోండా యాక్టివా మరియు సుజుకి యాక్సిస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. భారతదేశంలో గుగుల్ సెర్చ్ ఇంజన్ లో సగటున ప్రతినెలా 3 లక్షల మంది ఈ స్కూటర్ కోసం శోధించినట్లు గూగుల్ పేర్కొంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

టీవీఎస్ జూపిటర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ స్కూటర్‌గా మరియు 2021లో అత్యధికంగా డిమాండ్ ఉన్న రెండవ స్కూటర్‌గా నిలిచింది. మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 110 సిసి మరియు 125 సిసి అనే రెండు ఇంజన్ వేరియంట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. తాజాగా, కంపెనీ ఇందులో మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో కూడిన సరికొత్త 125 సిసి వేరియంట్ జూపిటర్ స్కూటర్ కూడా మార్కెట్లో విడుదల చేసింది. విడుదలైంది. దేశీయ విపణిలో టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర రూ. 63,000 నుండి ప్రారంభం అవుతుంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

3. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)

మరొక జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ స్కూటర్ యాక్సెస్ 125 ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ను సగటున ప్రతినెలా 2.4 లక్షల మంది నెటిజెన్లు గూగుల్ లో శోధించారు. సుజుకి యాక్సెస్ 125 ఓ మంచి ప్రీమియం క్వాలిటీ స్కూటర్. ఇది ఈ విభాగంలో హోండా యాక్టివా మరియు టీవీఎస్ జూపిటర్ మోడళ్లకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది వివిధ రకాల వేరియంట్లు మరియు ఫీచర్లతో అందుబాటులో ఉంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ లో కంపెనీ ఇటీవలే ఓ కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ.74,000 (ఎక్స్-షోరూమ్) లకు పైగా ఉంటుంది. కంపెనీ ఇందులో కొత్తగా సైడ్-స్టాండ్ ఇంటర్‌లాక్ సిస్టమ్ ను కూడా పరిచయం చేసింది. ఈ స్కూటర్ లో 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉంటుంది. ఇది గరిష్టంగా 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

4. హోండా డియో (Honda Dio)

హోండా డియో స్కూటర్ కి ఒకప్పుడు మార్కెట్లో మంచి క్రేజ్ ఉండేది. ప్రత్యేకించి యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడిన ఈ స్పోర్టీ స్కూటర్ కి ప్రస్తుతం ఆదరణ తగ్గుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఈ విభాగంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న స్పోర్టీ స్కూటర్లే. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో సగటిన ప్రతినెలా 1.3 లక్షల మంది యూజర్లు ఈ హోండా డియో స్కూటర్ కోసం శోధించారు. ఈ జాబితాలో ఇది నాల్గవ స్థానంలో నిలిచింది.హోండా డియో 3 వేరియంట్‌లు మరియు 8 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

భారత మార్కెట్లో హోండా డియో టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 74,000 లకు పైగా ఉంటుంది. హోండా డియో స్కూటర్ లో 109.51 సిసి బిఎస్ 6 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.65 బిహెచ్‌పి పవర్ ను మరియు 9 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ ఉంటుంది. ఇదొక గొప్ప లైట్ వెయిట్ స్కూటర్, దీని మొత్తం బరువు 105 కేజీలు మాత్రమే ఉంటుంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

5. టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq 125)

హోండా డియో అమ్మకాలు క్షీణించడానికి కారణమైన మోడళ్లలో ఈ టీవీఎస్ ఎన్‌టార్క్ స్పోర్టీ స్కూటర్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. టీవీఎస్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ స్పోర్టీ స్కూటర్ యువతలో మంచి ఆదరణను పొందుతోంది. ఇది భారతదేశపు అత్యంత సామర్థ్యం గల స్కూటర్ మోడల్. ఈ స్కూటర్ లో 124.8 సిసి సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9.25 బిహెచ్‌పి పవర్ ను మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

ఈ ఏడాది గూగుల్ లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కోసం సగటున ప్రతినెలా 1.10 లక్షల మంది నెటిజెన్లు శోధించారు. దీంతో ఇది ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. మార్వెల్ మరియు స్పైడర్ మ్యాన్ అభిమానుల కోసం టీవీఎస్ తమ ఎన్‌టార్క్ 125 మోడల్ లో సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌' (TVS Ntorq 125 SuperSquad Edition) ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ స్పైడర్‌మ్యాన్ మరియు థోర్ క్యారెక్టర్ల నుండి స్పూర్తి పొందిన పెయింట్ స్కీమ్‌లో లభిస్తుంది.

గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించబడిన టాప్ 5 స్కూటర్లు.. ఇందులో టాప్ మోడల్ ఏదంటే..

పైన తెలిపిన స్కూటర్లు మాత్రమే ​​కాకుండా, భారతీయులు ఎక్కువగా వెతుకుతున్న స్కూటర్లలో మరికొన్ని ఇతర మోడళ్లు కూడా ఉన్నాయి. కాకపోతే, ఇవి పెట్రోల్ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా అమ్మకానికి అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు. భారతదేశంలో, ఎక్కువ మంది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఏథర్ 450ఎక్స్ మరియు ఎలా ఎలక్ట్రిక్ ఎ1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 5 most searched scooters in india in google in 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X