Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) తమ పల్సర్ (Pulsar) సిరీస్ లో తాజాగా రెండు సరికొత్త మోడళ్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. వీటిలో ఒకటి పల్సర్ ఎన్250 (Pulsar N250) కాగా, మరొకటి పల్సర్ ఎఫ్250 (Pulsar F250). ఈ కథనంలో బజాజ్ పల్సర్ ఎఫ్250 బైక్ కు సంబంధించిన ఐదు ఆకస్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

బజాజ్ ఆటో విడుదల చేసిన రెండు క్వార్టర్ లీటర్ (250 సిసి) పల్సర్ మోడళ్లలో ఎన్250 నేక్డ్ రోడ్‌స్టర్ కాగా, ఎఫ్250 ముందు వైపు ఎక్కువ ఫెయిరింగ్ తో కూడిన స్పోర్టీయర్ బైక్. ఈ రెండు బైక్‌లు కూడా మోడ్రన్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త Bajaj Pulsar 250 బైక్‌లు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటాయి. అయితే, వీటిలో పల్సర్ ఎఫ్250 (Pulsar F250) మరింత స్పోర్టీగా ఉంటుంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

Bajaj Pulsar F250 - డిజైన్:

బజాజ్ పల్సర్ ఎఫ్250 ఇతర పల్సర్ బ్రాండ్ బైక్‌లతో పోలిస్తే, చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో పొడవైన విండ్‌స్క్రీన్, 14 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్, స్ప్లిట్ సీటు, స్ప్లిట్-టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్-బ్యారెల్ ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ మరియు హై రియర్ ప్రొఫైల్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో ఈ మోటార్‌సైకిల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

అంతేకాకుండా, కొత్త పల్సర్ ఎఫ్250 బైక్‌ లో డ్యూయల్-కలర్ ఇంజన్ కౌల్, స్ప్లిట్-లుకింగ్ అల్లాయ్ వీల్స్ (పల్సర్ ఎన్ఎస్ మోడల్స్‌లో ఉపయోగించిన వీల్స్ మాదిరిగా) మరియు ప్రత్యేకమైన బాడీ ప్యానెల్‌లు ఉన్నాయి. ఈ బైక్ పరిమితమైన కలర్ ఆప్షన్లలో మాత్రమే అందించబడుతుంది. ప్రస్తుతానికి, ఇది రేసింగ్ రెడ్ కలర్‌ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

Bajaj Pulsar F250 - ఫీచర్లు:

పల్సర్ ఎఫ్250 బైక్‌లో ఉపయోగించిన ల్యాంప్స్ అన్నీ కూడా పూర్తి ఎల్‌ఈడి రూపంలో ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో బై-ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్లు మరియు ఎల్ఈడి పొజిషన్ లైట్లు అమర్చబడ్డాయి. అదేవిధంగా, వెనుక వైపున స్ప్లిట్ టైప్ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

అదనంగా, ఈ బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. గేర్ పొజిషన్, ఇంధన స్థాయి, మిగిలిన రేంజ్ వంటి పలు రైడింగ్ ఆధారిత సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. రైడర్ భద్రత కోసం బైక్‌లో సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను కూడా అమర్చారు. ఈ బైక్స్ లో యూఎస్‌బి చార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

Bajaj Pulsar F250 - ఇంజన్:

కొత్త Bajaj Pulsar ఎఫ్250 ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 250 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 24.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

ఈ ఇంజన్‌ లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ను ఉపయోగించారు. బైక్ మైలేజ్ ను పెంచడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ పల్సర్ సిరీస్ లో కెల్లా ఇది అత్యంత శక్తివంతమైన ఇంజన్ మరియు ఇది మంచి పనితీరును కలిగి ఉంటుంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

Bajaj Pulsar F250 - మెకానికల్స్:

కొత్త పల్సర్ ఎఫ్250 బైక్ ను డ్యూప్లెక్స్ ఛాసిస్‌ పై నిర్మించారు. ఇందులో మెరుగైన సస్పెన్షన్ కోసం ముందు వైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ను ఉపయోగించారు. ఇవి రెండూ అన్ని రకాల రోడ్లపై మెరుగైన కంఫర్ట్ ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందువైపు 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్ లను ఉపయోగించారు. ఇవి రెండూ కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. రోడ్డుపై మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం కంపెనీ ఇందులో 17 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు 100/80 ప్రొఫైల్ టైరును అలాగే వెనుక వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు 130/70 ప్రొఫైల్ టైరును ఉపయోగించారు.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

Bajaj Pulsar F250 - ధర:

ఇదివరకు చెప్పుకున్నట్లు కొత్త బజాజ్ పల్సర్ ఎఫ్250 మోటార్‌సైకిల్ ప్రస్తుతానికి ఒకే కలర్ ఆప్షన్ లో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ రెడ్ కలర్ వేరియంట్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Bajaj Pulsar F250 గురించి 5 ఆసక్తికర విషయాలు.. కొనేముందు తెలుసుకోండి!

బజాజ్ ఆటో తమ పల్సర్ బ్రాండ్ బైక్ లను దాదాపు 20 ఏళ్ల క్రితం మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయిచింది. దేశీయ మార్కెట్లో కూడా ఈ మోడళ్లు చాలా ఏళ్లుగా మంచి డిమాండ్ ను కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పల్సర్ బైక్ లు అమ్ముడవుతున్నాయి.

Most Read Articles

English summary
Top 5 things to know about bajaj pulsar f250 before you decide to buy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X