విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

ప్రపంచంలోని అతిపెద్ద టూవీలర్ మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటి. మనదేశంలో తయారు చేయబడి మరియు విక్రయించబడే కొన్ని పాపులర్ 'మేడ్ ఇన్ ఇండియా' టూవీలర్లు యూఎస్ఏ మరియు యూకే లతో పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయని మీకు తెలుసా?

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

మనదేశంలో ఇప్పటికే బాగా పాపులర్ అయిన కొన్ని టూవీలర్లకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉంటోంది. వీటిని మనదేశంలోనే తయారు చేసి, ఆయా మార్కెట్లకు ఎగుమతి చేయబడుతాయి. మరి భారతదేశంలో తయారు చేయబడి మరియు విదేశాలలో విక్రయించబడుతున్న టాప్ టూవీలర్ల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

1. బజాజ్ పల్సర్ (Bajaj Pulsar)

భారతదేశపు యువ కొనుగోలుదారులలో అత్యంత ప్రాచుర్యం పొందిన టూవీలర్ బజాజ్ పల్సర్. దాదాపు రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన పల్సర్ బ్రాండ్ బైక్ లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. భారత మార్కెట్లో విక్రయిస్తున్నట్లుగానే, కంపెనీ ఈ పల్సర్ సిరీస్ బైక్ లను పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

మనదేశంలో తయారైన మేడ్ ఇన్ ఇండియా బజాజ్ పల్సర్ బైక్ లను కంపెనీ భారతదేశం నుండి థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అంతేకాదు, ఈ 'మేడ్ ఇన్ ఇండియా' బజాజ్ పల్సర్ బైకులు కొన్ని లాటిన్ అమెరికన్ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. భారతీయ యువతలాగే, ప్రవాస యువత కూడా బజాజ్ పల్సర్‌ని ఎక్కువగా ఆదరిస్తున్నారు.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

2. బజాజ్ బాక్సర్ (Bajaj Boxer)

భారతదేశంలో బజాజ్ బాక్సర్ బైక్ అమ్మకాలు నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది. ఆఫ్రికన్ మార్కెట్లో బజాజ్ బాక్సర్ 125 మరియు బజాజ్ బాక్సర్ 150 బైకులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి మార్కెట్లో బజాజ్ బాక్సర్ మోటార్‌సైకిల్ అత్యంత ప్రజాదరణ పొందిన బైక్.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

3. బజాజ్ డొమినార్ (Bajaj Dominar)

కొన్ని రకాల బైక్ లను మాత్రమే ఆల్ రౌండర్లుగా పరిగణించడం జరుగుతుంది. అలాంటి వాటిలో బజాజ్ డొమినార్ బైక్ కూడా ఒకటి. హైవేపై ఈ బైక్ మూడు అంకెల వేగంతో సులభంగా దూసుకుపోగలదు. పట్టణ రోడ్లపై కూడా బజాజ్ డొమినార్ అద్భుతమైన హ్యాండ్లింగ్ ని అందిస్తుంది. అందుకే, దీనిని ఆల్ రౌండర్‌గా అభివర్ణించవచ్చు.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

అంతర్జాతీయ బైక్ ప్రియుల నుండి మంచి ఆదరణ లభించడంతో బజాజ్ ఆటో తమ డొమినార్ బైక్ ను వివిధ విదేశాలలో విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో డొమినార్ 250 మరియు డొమినార్ 400 మోడళ్లు ఉన్నాయి. డొమినార్ 250 248సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 25 బిహెచ్‌పి పవర్‌ను మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

అలాగే, బజాజ్ డొమినార్ 400 విషయానికి వస్తే, ఈ బైక్ 373సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 39.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో ప్రధానంగా ఇంజన్లలో మార్పు మినహా మిగిలిన మెకానికల్ హార్డ్‌వేర్ మరియు డిజైన్‌లోని చాలా అంశాలు ఒకేలా ఉంటాయి.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

4. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350)

నవంబర్ 2020లో భారత మార్కెట్లో విడుదలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్‌కు దేశీయ కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభించింది. కంపెనీ ఈ బైక్ ను యూకే మరియు యూఎస్ వంటి మార్కెట్లతో పాటుగా థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి ఏషియా మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. ఇది ఈ విభాగంలో హోండా హైనెస్ సిబి350, జావా క్లాసిక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

ఈ మోడల్‌లో కంపెనీ లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ పొందిన మొట్టమొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కూడా ఇదే. ఈ క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్‌లో 350 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది సరికొత్త జె-సిరీస్ ఓహెచ్‌సి ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

5. టీవీఎస్ స్టార్ సిటీ (TVS Star City)

బజాజ్ మాదిరిగానే, టీవీఎస్ కూడా బడ్జెట్ బైక్ ఎగుమతులలో అగ్రగామిగా ఉంది. భారతదేశంలో టీవీఎస్ స్టార్ సిటీ ఎంత ప్రాచుర్యం పొందిన మోటార్‌సైకిల్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో తయారైన టీవీఎస్ స్టార్ సిటీ బైకులు విదేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శ్రీలంకలో మనం పెద్ద సంఖ్యలో టీవీఎస్ స్టార్ సిటీ బైక్‌లను చూడవచ్చు.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

టీవీఎస్ స్టార్ సిటీ బైక్ ఎగుమతులకు శ్రీలంక అతిపెద్ద మార్కెట్ గా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ ను కొలంబియాకు కూడా ఎగుమతి చేస్తుంది. ఈ బైక్ లో బిఎస్6 109సిసి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

6. హీరో స్ప్లెండర్ (Hero Splendor)

భారతదేశపు అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ విక్రయిస్తున్న స్ప్లెండర్ మోటార్‌సైకిల్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో హీరో స్ప్లెండర్ రారాజుగా ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో స్ప్లెండర్‌దే అగ్రస్థానం.

విదేశీ మార్కెట్లలో పాపులర్ అయిన టాప్ బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా బైక్స్..

మనదేశంలో అత్యంత పాపులర్ అయిన ఈ మేడ్ ఇన్ ఇండియా హీరో స్ప్లెండర్ ను కంపెనీ పలు విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది. హీరో స్ప్లెండర్ ను నైజీరియా, బంగ్లాదేశ్ మరియు నేపాల్‌తో సహా పలరు ఇతర దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. శ్రీలంక మార్కెట్లో టీవీఎస్ స్టార్ సిటీ బైక్ మాదిరిగానే హీరో స్ప్లెండర్ బైక్‌లు కూడా అత్యంత ప్రాచుర్యం పొందాయి.

Most Read Articles

English summary
Top 6 made in india bikes sold in international markets details
Story first published: Saturday, October 2, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X