2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కార్లు మరియు బైకులు మాత్రమే కాకుండా స్కూటర్లు కూడా ఉన్నాయి. స్కూటర్లు కూడా మార్కెట్లో విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ కారణంగానే దేశీయ విఫణిలో స్కూటర్లు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి.

అయితే మార్కెట్లో చాలా మంది ప్రజలు తక్కువ ధర కలిగి మరియు మంచి మైలేజ్ అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీలు కూడా ఆ స్థాయిలోనే స్కూటర్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. వీటి ధర రూ. 70,000 కంటే తక్కువగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన తక్కువ ధర కలిగిన స్కూటర్ల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter):

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన TVS, దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క జుపిటర్ అత్యంత డిమాండ్ కలిగిన స్కూటర్ కూడా. ఈ స్కూటర్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 68,401. కాగా ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. 78,595 (ఎక్స్-షోరూమ్).

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

TVS జుపిటర్ 5 వేరియంట్‌లలో మరియు 13 రంగులలో అందుబాటులో ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

TVS జుపిటర్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 109.7 సిసి బిఎస్ 6 ఇంజన్ ఉంటుంది. ఇది 7.37 బిహెచ్‌పి పవర్ మరియు 8.4 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. TVS జుపిటర్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ కలిగి, ముందు మరియు వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఈ స్కూటర్ యొక్క బరువు 107 కేజీల వరకు ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

హీరో ప్లెజర్+ (Hero Pleasure+):

హీరో ప్లెజర్+ అనేది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మంచి అమ్మకాలను పోందిన స్కూటర్. భారతీయ మార్కెట్‌లో కంపెనీ తన హీరో ప్లెజర్+ ని 5 వేరియంట్‌లు మరియు 9 కలర్ ఆప్షన్‌లతో విక్రయిస్తోంది. ఇందులో హీరో ప్లెజర్+ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.73,775 (ఎక్స్-షోరూమ్). హీరో ప్లెజర్+ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

హీరో ప్లెజర్+ స్కూటర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో బిఎస్ 6 110.9 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

హోండా డియో (Honda Dio):

భారతీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న టాప్ 10 స్కూటర్ల జాబితాలో హోండా డియో ఒకటి. ఈ స్కూటర్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. ఈ స్కూటర్ 3 వేరియంట్‌లు మరియు 8 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. భారతీయ మార్కెట్లో హోండా డియో టాప్ వేరియంట్ ధర రూ. 74,217 (ఎక్స్-షోరూమ్).

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

హోండా డియో 109.51 సిసి బిఎస్ 6 ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 7.65 బిహెచ్‌పి పవర్ మరియు 9 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా హోండా డియో రెండు చక్రాలకు కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. హోండా డియో స్కూటర్ 5.3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. దీని బరువు 105 కేజీలు.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

హీరో మాస్ట్రో ఎడ్జ్ (Hero Maestro Edge):

హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ కంపెనీ యొక్క హీరో ప్లెజర్+ తరువాత ఎక్కువ అమ్మాకాలను పొందిన స్కూటర్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ కూడా. కంపెనీ ఈ స్కూటర్ ని 5 వేరియంట్‌లు మరియు 8 కలర్ ఆప్షన్‌లతో విక్రయిస్తోంది. ఇందులో దాని టాప్ వేరియంట్ ధర రూ. 73,730 (ఎక్స్-షోరూమ్).

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

హీరో మాస్ట్రో ఎడ్జ్ చాలా వరకు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ లో 110.9 సీసీ బిఎస్6 ఇంజిన్‌ పొందుతుంది. ఇది 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.75 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 రెండు చక్రాలకు కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఈ స్కూటర్ 5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉండి, మంచి పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా దీని బరువు కేవలం 112 కేజీలు మాత్రమే.

2021 లో విడుదలైన బెస్ట్ స్కూటర్లు: ధర తక్కువ.. గొప్ప మైలేజ్ కూడా..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2021 లో అత్యధిక అమ్మకాలను పొందిన స్కూటర్లలో పైన తెలిపిన స్కూటర్లు ఉన్నాయి. ఇవి ధర తక్కువ మరియు మంచి మైలేజ్ అందిస్తున్న కారణంగా భారతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పొందుతున్నాయి. ఇవి 2022 లో మంచి ఆదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Top affordable scooters of year 2021 under rs 70000 details
Story first published: Wednesday, December 22, 2021, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X