బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

ఇటాలియన్ సూపర్‍‌బైక్ బ్రాండ్ బెనెల్లి, ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త బిఎస్6 వెర్షన్ టిఆర్‌కె 502ఎక్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ విభాగంలో కేవలం రూ.5.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే ఈ మోడల్ విడుదలైంది. ఈ బైక్‌లోని కొన్ని ఆసక్తికరమైన ఫీచర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. దీని తోబుట్టువు అయిన డిఆర్‌కె502 రోడ్ స్పెక్ మోడల్ కాగా, ఇది పూర్తి ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. రెయిజ్డ్ ఫ్రంట్ డిజైన్, ఎత్తులో అమర్చిన సైలెన్సర్, పొడవాటి వైజర్, లో రైడర్ సీట్ హైట్, నకల్ గార్డ్స్ మరియు నేక్డ్ బాడీతో ఇదొక ఉత్తమైన ఆఫ్-రోడర్‌గా ఉంటుంది మిడిల్-వెయిట్ విభాగంలో (350సీసీ నుండి 500సీసీ వరకూ) బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తుంది.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

బిఎస్6 ఇంజన్

ఈ బిఎస్6 వెర్షన్ బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ దాని మునుపటి బిఎస్4 ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించింది. ఇందులోని 499 సిసి, పారలల్-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 46.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 46 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

ముఖ్యమైన ఫీచర్లు

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్‌లో రాత్రివేళ్లలో మెరుగైన విజిబిలిటీ కోసం ఇందులో బ్యాక్‌లిట్ స్విచ్ గేర్‌ను ఉపయోగించారు. ఇంకా ఇందులో అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేసిన నకల్ గార్డ్స్, కొత్త హ్యాండిల్ బార్ గ్రిప్స్ మరియు రీడిజైన్ చేయబడిన రియర్ వ్యూ మిర్రర్స్, ఆరెంజ్ ఎల్‌సిడి మరియు వైట్ బ్యాక్‌లిట్ అనలాగ్ టాకోమీటర్ వంటి కీలకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

పెద్ద పెట్రోల్ ట్యాంక్

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్‌పై సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం కంపెనీ ఇందులో పెద్ద 20 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను అమర్చింది. రోడ్డుపై బెటర్ గ్రిప్ కోసం ఇందులో ముందు వైపు 19 ఇంచ్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్ వీల్స్‌ను ఉపయోగించారు.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్

ఈ మోటార్‌సైకిల్ 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఎలాంటి రోడ్లపై అయినా సులువుగా ప్రయాణించేందుకు ఇది ఎంతగానే సహకరిస్తుంది. ఆఫ్-రోడింగ్ మరియు టూరింగ్ ప్రయోజనాల కోసం ఇందులో కొత్త కాస్ట్ అల్యూమినియం రియర్ బాక్స్ బ్రాకెట్‌ కూడా ఉంటుంది.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

ధరలు మరియు కలర్ ఆప్షన్స్

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బిఎస్6 బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ ధర దాని మునుపటి బిఎస్4 ధర కంటే రూ.31,000 తక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను మెటాలిక్ డార్క్ గ్రే, వైట్ మరియు రెడ్ కలర్ స్కీమ్‌లలో విడుదల చేసింది. ఇందులో గ్రే వేరియంట్ ధర రూ.5.19 లక్షలుగా ఉంటే, రెడ్ లేదా వైట్ కలర్ ఆప్షన్ల ధరలు రూ.5.29 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌లో టాప్ బెస్ట్ ఫీచర్స్

బుకింగ్స్

బిఎస్6 వెర్షన్ బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ మోటార్‌సైకిల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత బెనెల్లి డీలర్‌షిప్ కేంద్రాలలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ.10,000 అడ్వాన్స్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ డెలివరీలు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Benelli TRK 502X Top Features, Price, Specs And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X