సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్న నేపథ్యంలో, ద్విచక్ర వాహన కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రధానంగా చూసేది, వాటి రేంజ్ (మన భాషలో మైలేజ్) ఎంత అనే దాని గురించి.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు మరియు ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. మరి వీటిలో సింగిల్ చార్జ్‌పై ఎక్కువ రేంజ్‍‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ టూవీలర్లు ఏవి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

అన్నట్టు చెప్పడం మరిచాను.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయటానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాటిపై అందించే సబ్సిడీలను సవరించింది. ఫలితంగా, ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే దేశంలోకి అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ప్రవేశించాయి. మరి వీటిలో సింగిల్ చార్జ్‌పై ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేసే ఆ టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

బెన్లింగ్ ఔరా:

బెన్లింగ్ ఇండియా అందిస్తున్న ఔరా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఇది ఎకో మోడ్‌లో స్కూటర్‌ను నడిపినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ మోడ్‌లో స్కూటర్ వేగం తక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో 72v/40Ah లిథియం అయాన్ బ్యాటరీ మరియు 2500 బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. దీనిని పూర్తిగా చార్జ్ చేయటానికి 4 గంటల సమయం పడుతుంది.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

దేశీయ విపణిలో బెన్లింగ్ ఔరా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.93,200 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి పియాజియో వెస్పా స్టైల్‌లో కనిపిస్తుంది. ఇంకా ఇందులో రిమోట్ కీలెస్ స్టార్ట్, యూఎస్‌బి చార్జింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, రియర్ వీల్ ఇంటిగ్రేటెడ్ లాకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

ఒకినావా ఐ-ప్రైస్+

ఒకినావా అందిస్తున్న ఐ-ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్‌పై 139 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో తొలగించగలిగిన 3.3 కిలో వాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని స్కూటర్ నుండి తొలగించి, ఎక్కడైనా సులువుగా చార్జ్ చేసుకోవచ్చు.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

భారత మార్కెట్లో ఒకినావా ఐ-ప్రైస్+ ధర రూ.1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్‌లో 2.5kW బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇంకా ఉందులో ఇరువైపులా డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ అల్లాయ్ వీల్, జియో ఫెన్సింగ్, లైవ్ ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైసి హెచ్ఎక్స్:

హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న లాంగ్ రేంజ్ టూవీలర్లలో ఎన్‌వైసి హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. హీరో ఈ ఎలక్ట్రిక్ ఈ స్కూటర్‌ను గత ఏడాది నవంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.64,640 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 0.6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 1.53 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 42 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో అమర్చిన మాడ్యులర్ బ్యాటరీ సిస్టమ్ మరియు దాని స్వాప్ చేయగల సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 210 కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్ రేంజ్‌ను పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

ఒడిస్సీ హాక్ ప్లస్:

ఒడిస్సీ హాక్ ప్లస్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 170 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలోని అతి తక్కువ డీలర్ల ద్వారా మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఒడిస్సీ హాక్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతుంది.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

రివాల్ట్ ఆర్‌వి300:

రివాల్ట్ ఇంటెలికార్ప్ సంస్థ దేశీయ మార్కెట్లో ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 అనే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది. వీటిలో రివాల్ట్ ఆర్‌వి300 మోడల్ పూర్తి చార్జ్‌పై ఎకో మోడ్‌లో గరిష్టంగా 180 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.95,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్‌ను అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్

రివాల్ట్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. కాకపోతే, ఎకో మోడ్‌లో దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా మాత్రమే ఉంటుంది.

Most Read Articles

English summary
Top Five Electric Two-wheelers In India With Highest Range On Single Charge, Details. Read in Telugu.
Story first published: Friday, July 30, 2021, 18:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X