2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

భారతదేశం ద్విచక్ర వాహన అమ్మకాలకు అతి పెద్ద మార్కెట్. భారతీయ మార్కెట్లో కార్లు మరియు ఇతర వాహనాల కంటే కూడా ద్విచక్ర వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఆధునిక ద్విచక్ర వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి.

భారతదేశంలో రోజు వారీ ఉపయోగం కోసం ఎక్కువగా ద్విచక్ర వాహనాలను వినియోగిస్తారు. కావున మార్కెట్లో స్కూటర్లకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. 2021లో కస్టమర్‌లు రూ. 1 లక్ష కంటే తక్కువ ధర కలిగిన స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. కావున దేశీయ మార్కెట్లో ఈ ధర వద్ద లభించి టాప్ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

హోండా యాక్టివా 6జి (Honda Activa 6G):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్సైకిల్స్ (Honda MotorCycles) యొక్క హోండా యాక్టివా 6జి (Honda Activa 6G) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. దేశీయ మార్కెట్లో యాక్టివా 6జి ధర రూ. 70,348 నుండి ప్రారంభమై రూ. 73,600 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

హోండా యాక్టివా 6జి మొత్తం 4 వేరియంట్లు మరియు 8 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7.68 బిహెచ్‌పి పవర్ మరియు 8.79 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

హోండా యాక్టివా 6జి స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో పాటు రెండు చక్రాలపై కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్కూటర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్ల వరకు ఉంటుంది. దీని బరువు 107 కేజీలు. ఇది మంచి పనితీరుకి అందిస్తుంది, కావున మార్కెట్లో మంచి అమ్మకతో ముందుకు సాగుతోంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

టీవీఎస్ జుపిటర్ 125 (TVS Jupiter 125):

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్, మార్కెట్లో జుపిటర్ 125 సిసి ఇంజిన్‌తో కొత్త స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను 110సీసీ ఇంజన్ వేరియంట్‌లలో కూడా విక్రయిస్తున్నారు. ఇందులో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు అందుబటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇందులో ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ క్యాప్, 2 లీటర్ గ్లోవ్ బాక్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ ఆధునిక డిజైన్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 32 లీటర్స్ బూట్ స్పేస్ పొందుతుంది. కావున రెండు ఫుల్ సైజ్ హెల్మెట్‌లను కూడా ఇందులో సులభంగా ఉంచుకోవచ్చు. కంపెనీ ఇంధన ట్యాంక్‌ను వెనుక నుండి తీసివేసి ఫుట్ బోర్డ్ కింద ఇచ్చింది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

కొత్త టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ 125 సిసి ఇంజిన్‌ కలిగి 8.3 బిహెచ్‌పి పవర్ మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని అందించడమే కాకుండా మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ కారణాల వల్ల దేశీయ మార్కెట్లో ఇది మంచి అమాంకాలతో ముందుకు సాగుతోంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125):

దేశీయ మార్కెట్లో ఎక్కువమంది కస్టమర్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడే టూ వీలర్ బ్రాండ్ యమహా. యమహా కంపెనీ ఇటీవల హైబ్రిడ్ ఇంజన్‌తో తన 125సీసీ స్కూటర్ రే జెడ్‌ఆర్ 125 విడుదల చేసింది. ఇది ప్రస్తుతం 7 వేరియంట్లు మరియు 17 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

యమహా రే జెడ్ఆర్ 125 స్కూటర్ ప్రారంభ ధర రూ. 54,732 (ఎక్స్-షోరూమ్). ఇది 125 సిసి బిఎస్ 6 ఇంజిన్ పొందుతుంది. ఇది 8.04 బిహెచ్‌పి పవర్ మరియు 9.7 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త స్కూటర్ రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లతో కూడిన కాంబి బ్రేకింగ్ సిస్టమ్ పొందుతుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125):

సుజుకి మోటార్ సైకిల్స్ యొక్క సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ యొక్క పాపులర్ మోడల్. ఇది రెండు వేరియంట్‌లు మరియు 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. ఈ కొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరలు రూ. 85,907 (ఎక్స్-షోరూమ్) అరకు ఉంటాయి.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

ఈ స్కూటర్ 124 సిసి బిఎస్ 6 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.58 బిహెచ్‌పి పవర్ మరియు 10 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది రెండు చక్రాలలో కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ పొందుతుంది. బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 బరువు 110 కేజీల వరకు ఉంటుంది. అంతే కాకూండా ఈ స్కూటర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.5 లీటర్ల అరకు ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

ఎప్రిలియా స్ట్రోమ్ 125 (Aprilia Storm 125):

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీ ఏప్రిలియా. ఏప్రిలియా కంపెనీ దేశీయ మార్కెట్లో ఏప్రిలియా స్ట్రోమ్ 125 స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విజయవంతమైన బెస్ట్ స్కూటర్లు: వివరాలు

ఎప్రిలియా స్ట్రోమ్ 125 స్కూటర్ భారతదేశంలోని పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన స్కూటర్. దీని డిజైన్ ఎస్ఆర్ సిరీస్‌లోని ఇతర స్కూటర్ల నుండి తీసుకోబడింది. ఎప్రిలియా స్ట్రోమ్ 125 స్కూటర్ 124.45 సిసి బిఎస్6 ఇంజిన్ పొందుతుంది. ఇది 9.78 బిహెచ్‌పి పవర్ మరియు 9.6 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది మంచి పనితీరుని అందించడం వల్ల ఎక్కువ అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

Most Read Articles

English summary
Top scooters of 2021 price below rs 1 lakh honda activa tvs jupiter and more
Story first published: Friday, December 31, 2021, 11:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X