కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో గడచిన మే 2021 నెలలో దేశవ్యాప్తంగా విధించిన పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల కారణంగా, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. గత నెలలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన టూవీలర్ల జాబితా పరిశీలిస్తే, హీరో స్ప్లెండర్ అత్యధిక అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

హోండా నుండి అత్యధికంగా అమ్ముడయ్యే యాక్టివా స్కూటర్ తొలిసారిగా ఐదవ స్థానానికి పడిపోయింది. హీరో స్ప్లెండర్ తర్వాతి స్థానంలో హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్, టివిఎస్ అపాచీ మోడళ్లు ఉన్నాయి. గత నెలలో మోడల్ వారీగా టూవీలర్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి:

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

హీరో స్ప్లెండర్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది, గత నెలలో 84,043 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2021లో ఈ మోడల్ అమ్మకాలు 1,61,576 యూనిట్లుగా నిలిచాయి. ఈ సమయంలో హీరో స్ప్లెండర్ అమ్మకాలు 47.9 శాతం క్షీణతను నమోదు చేశాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

హీరో మోటోకార్ప్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ గడచిన మే 2021 నెలలో 42,118 యూనిట్లను విక్రయించగా, ఏప్రిల్‌ 2021లో 71,294 యూనిట్లు విక్రయించింది. ఈ మోడల్ అమ్మకాలు కూడా 40 శాతం క్షీణించాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

ఆ తర్వాతి స్థానంలో బజాజ్ పల్సర్ ఉంది. గత నెలలో పల్సర్ అమ్మకాలు 28,636 యూనిట్లుగా నమోదయ్యాయి. అందకు ముందు నెలలో (ఏప్రిల్ 2021లో) ఇవి 35,891 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బజాజ్ పల్సర్ అమ్మకాలు 20.2 శాతం క్షీణతను నమోదు చేశాయి.

Rank Model May 2021 April 2021 Growth (%)
1 Hero Splendor 84,043 1,61,576 -47.9
2 Hero HF Deluxe 42,118 71,294 -40.9
3 Bajaj Pulsar 28,636 35,891 -20.2
4 TVS Apache 19,885 29,458 -32.5
5 Honda Activa 17,006 1,09,678 -84.5
6 Hero Splendor 125 16,392 31,941 -48.7
7 Honda CB Shine 14,666 79,416 -81.5
8 Bajaj Platina 11,164 35,467 -68.5
9 Suzuki Access 9,706 53,285 -81.8
10 Royal Enfield Classic 350 9,239 23,298 60.3
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

టీవీఎస్ అపాచీ గడచిన మే నెలలో 19,885 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో ఉంది. ఏప్రిల్ 2021లో ఈ మోడల్ అమ్మకాలు 29,458 యూనిట్లుగా ఉన్నాయి. ఈ అమ్మకాలతో పోలిస్తే గత నెల అమ్మకాలు 32.5 శాతం తగ్గాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే పాపులర్ స్కూటర్ యాక్టివా, అమ్మకాల పరంగా తొలిసారిగా ఐదవ స్థానానికి పడిపోయింది. గత మే నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు 17,006 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2021 అమ్మకాలతో పోలిస్తే, ఇవి 84.5 శాతం క్షీణతను నమోదు చేశాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

హీరో స్ప్లెండర్ 125 మోడల్ 16,392 యూనిట్ల అమ్మకాలతో ఆరవ స్థానంలో ఉంది. గడచిన ఏప్రిల్ 2021 నెలలో విక్రయించిన 31,941 యూనిట్లతో పోలిస్తే, ఇవి 48.7 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఆ తర్వాతి స్థానంలో హోండా షైన్ 14,666 యూనిట్ల అమ్మకాలతో7వ స్థానంలో ఉంది. ఈ మోడల్ అమ్మకాలు భారీగా 81 శాతం తగ్గాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

బజాజ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ ప్లాటినా అమ్మకాలు గత నెలలో 11,164 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2021లో ఇవి 35,467 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సమయంలో ప్లాటినా అమ్మకాలు 68 శాతం తగ్గాయి. దాని తరువాతి స్థానంలో సుజుకి యాక్సెస్ 9,706 యూనిట్ల అమ్మకాలతో 9వ స్థానంలో ఉంది. ఏప్రిల్ 2021లో ఇవి 53,285 యూనిట్లుగా అమ్ముడై 81 శాతం క్షీణతను నమోదు చేశాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్. గత నెలలో క్లాసిక్ 350 మోడల్ అమ్మకాలు 9239 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2021 నెలలో ఇవి 23,298 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 60 శాతం తగ్గాయి.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్: భారీగా క్షీణించిన టూవీలర్ సేల్స్!

ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ఇటీవల ఫడా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా, ఈ వేసవి కాలంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయి. రాబోయే నెలల్లో ఇది ట్రెండ్ కనిపిస్తుందని ఊహిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, June 21, 2021, 18:28 [IST]
English summary
Top Selling Two Wheelers In India In May 2021, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+