సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా తమ సరికొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 సూపర్‌స్పోర్ట్ బైక్ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

యమహా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న పాపులర్ వైజెడ్ఎఫ్-ఆర్6 స్థానంలో ఈ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయబోయే అత్యంత ఆసక్తిగల బైక్‌లలో ఇది కూడా ఒకటి. మరి ఈ యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 సూపర్‌స్పోర్ట్ బైక్‌లోని ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

డిజైన్

కొత్త 2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 సూపర్‌స్పోర్ట్‌ను వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి మోడల్ నుండి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ బైక్ ముందు భాగంలో ట్విన్ ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు ఉంటాయి. పెద్ద ఫెయిరింగ్స్ మరియు వాటిపై ఎయిర్ ఇన్‌టేక్స్‌తో ఇది చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

ఈ బైక్ తయారీలో స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది యమహా సూపర్‌స్పోర్ట్ లైనప్‌లోనే సన్నని బాడీవర్క్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ బైక్ మెరుగైన ఏరోడైనమిక్‌ను కలిగి ఉండి, అధిక వేగాల వద్ద కూడా స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇందులోని విండ్‌స్క్రీన్ వైజెడ్ఎఫ్-ఆర్6 మోడల్ కంటే వెడల్పుగా మరియు పొడవుగా ఉంటుంది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

ఇంజన్

కొత్త 2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మోటార్‌సైకిల్‌లో ఎమ్‌టి-07 మోడల్ నుండి గ్రహించిన 689సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 72.3 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

ఇందులో స్లిప్ అసిస్టెడ్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. ఈ బైక్ ఇంజన్‌లో సిపి 2 క్రాస్‌ప్లేన్ ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ క్రాస్‌ప్లేన్ ఇంజన్‌లో 270-డిగ్రీల క్రాంక్ మరియు నాన్-ఫైరింగ్ ఆర్డర్ ఉంటుంది, ఇది లీనియర్ పవర్ డెలివరీని మరియు ప్రత్యేక ఎగ్జాస్ట్ నోట్‌ను అందిస్తుంది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

సస్పెన్షన్

యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మోటార్‌సైకిల్ ముందు భాగంలో 41 మిమీ కెవైబి అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో లింక్ టైప్ మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. కంపెనీ దీని మెయింటినెన్స్‌ను మెరుగుపరచడానికి దాని చాస్సిస్ యొక్క జియోమెట్రీని కూడా మార్చింది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

ఈ సూపర్‌స్పోర్ట్ బైక్‌లో వీల్‌బేస్ ఎమ్‌టి-07 కన్నా 5 మిమీ తక్కువగా ఉంటుంది. ఇందులో అగ్రెసివ్ స్టీరింగ్ అమర్చబడి ఉంది, ఇది దాని మొత్తం పనితీరును పెంచుతుంది. ఈ బైక్‌లో స్వింగార్మ్ దగ్గర అల్యూమినియం సెంటర్ బ్రేస్ ఉంటుంది.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

బ్రేకింగ్ సిస్టమ్

బ్రేకింగ్ విషయానికి వస్తే, కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ ముందు భాగంలో 298 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేకులు, నాలుగు పాట్ కాలిపర్స్ మరియు వెనుక భాగంలో 245 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇవి 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై అమర్చబడి ఉంటాయి.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

ఫీచర్లు

ఈ కొత్త బైక్‌లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో సెంట్రల్ ఎయిర్ ఇనే‌టేక్ సిస్టమ్, ఇరువైపులా ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు Y-ఆకారంలో ఉన్న ఎల్ఈడి డిఆర్ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, విండ్‌స్క్రీన్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్, 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, రియర్ సెట్ ఫుట్‌పెగ్ మొదలైనవి ఉన్నాయి.

సరికొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్ హైలైట్స్

ఇంకా ఇందులో డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే కూడా ఉంటుంది. కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 సూపర్‌స్పోర్ట్ బైక్‌లో డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్, కొత్త స్విచ్ గేర్‌తో కూడిన హ్యాండిల్‌బార్, ట్రాక్షన్ కంట్రోల్ లేదా క్రూయిజ్ కంట్రోల్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లు, బ్రిడ్జ్‌స్టోన్ బాట్‌లాక్స్ హైపర్‌స్పోర్ట్ టైర్లు మొదలైనవి కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 25, 2021, 11:00 [IST]
English summary
Top Things To Know About New 2022 Yamaha YZF-R7 Motorcycle. Read In Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+