2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

భారతదేశంలో ద్విచక్ర వాహన అమ్మకాలు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీ కొత్త వాహనాలను మార్కెట్లో విడుదల చేసి మరింత మంచి అమ్మకాలతో ముందుకు వెళ్ళడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహన అమ్మకలకు సంబందించిన సెప్టెంబర్ నెల నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం 2021 సెప్టెంబర్ నెలలో Hero MotoCorp (హీరో మోటోకార్ప్) అత్యధిక అమ్మకాలను చేపట్టగలిగింది. అయితే తరువాత Honda Motorcycle (హోండా మోటార్ సైకిల్) కంపెనీ తరువాత స్థానంలో నిలిచింది.

భారతీయ మార్కెట్లో 2021 సెప్టెంబర్ నెలలో అత్యధిక అమ్మకాలు జరిపిన టాప్ 6 కంపెనీల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

Hero MotoCorp (హీరో మోటోకార్ప్):

Hero MotoCorp (హీరో మోటోకార్ప్) దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా పేరుగాంచింది. గత నెలలో Hero MotoCorp కంపెనీ మొత్తం 5,05,462 ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. అయితే ఇదే నెలలో గత సంవత్సరం కంపెనీ 6,97,293 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ నెల అమ్మకాలు మునుపటికంటే కూడా చాలా తక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ యొక్క అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో 27.51 శాతం క్షీణించినట్లు తెలిసింది.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

Honda Motorcycle (హోండా మోటార్ సైకిల్):

Honda Motorcycle కంపెనీ గత 2021 సెప్టెంబర్ నెలలో మొత్తం 4,63,679 యూనిట్ల ద్విచక్ర వాహనాలను మార్కెట్లో విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలిసింది. ఈ అమ్మకాలతో Honda Motorcycle కంపెనీ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇదే నెల 2020 సంవత్సరంలో కంపెనీ 5,00,887 వాహనాలను విక్రయించింది. మొత్తానికి ఈ సంవత్సరం కంపెనీ యొక్క అమ్మకాలు దాదాపు 7.43 శాతం క్షీణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

TVS Motor (టీవీఎస్ మోటార్):

భారతీయ మార్కెట్లో సెప్టెంబర్ నెలలో అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో మూడవ స్థానంలో చేరిన కంపెనీ ఈ TVS Motor (టీవీఎస్ మోటార్). TVS Motor సెప్టెంబర్ 2021 లో మొత్తం 2,44,084 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇదే నెల గత ఏడాది కంపెనీ మొత్తం 2,41,762 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే మొత్తం అమ్మకాల పరంగా TVS Motor 0.96 % వృద్ధిని సాధించగలిగింది. అమ్మకాల పరంగా స్వల్ప వృద్ధిని నమోదు చేసిన కంపెనీ ఈ TVS Motor.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

Bajaj Auto (బజాజ్ ఆటో):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన Bajaj Auto సెప్టెంబర్ 2021 అమ్మకాల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది. కంపెనీ 2021 సెప్టెంబర్ నెలలో మొత్తం 1,73,945 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కంపెనీ 2,19,500 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సంవత్సరం కంపెనీ అమ్మకాలు ఏకంగా 20.75 శాతం క్షీణించాయి.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

Suzuki Motorcycle (సుజుకి మోటార్‌సైకిల్):

Suzuki Motorcycle (సుజుకి మోటార్‌సైకిల్) అమ్మకాల పరంగా 2021 సెప్టెంబర్ నెలలో ఐదవ స్థానంలో చేరింది. కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలు మొత్తం 2021 సెప్టెంబర్ నెలలో 55,608 యూనిట్లు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీ మొత్తం 65,195 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ అమ్మకాలు 14.71 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్):

Royal Enfield ప్రస్తుతం ఎక్కువమంది కొనుగోలుదారులు ఇష్టపడే బైక్. అయితే ప్రస్తుతం అమ్మకాల జాబితాలో ఆరవ స్థానంలో చేరింది. Royal Enfield అమ్మకాలు 2021 సెప్టెంబర్ నెలలో 27,233 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. గత ఏడాది ఇదే సెప్టెంబర్‌ నెలలో కంపెనీ మొత్తం 56,200 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీ అమ్మకాలు మొత్తంలో 51.54 శాతం క్షీణించాయి.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ తయారీ సంస్థ Royal Enfield. Royal Enfield కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా మంది ఆదరణ పొందుతుంది. కంపెనీ ఇటీవల తన కొత్త క్లాసిక్ 350 యొక్క అప్డేటెడ్ బైక్ కూడా విడుదల చేసింది, కావున కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

2021 సెప్టెంబర్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో Hero MotoCorp , లాస్ట్‌లో చేరిన ప్రముఖ బ్రాండ్

భారతీయ మార్కెట్లో వాహన కంపెనీల యొక్క అమ్మకాలు దాదాపు చాలా వరకు క్షీణతను నమోదు చేసాయి. దీనికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి విజృంభణ. అయితే ఇప్పుడు భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది. ఈ పండుగ సీజన్ లో ఎక్కువమంది కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు, కావున ఈ నెలలో తప్పకుండా దాదాపు అన్ని కంపెనీలు మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉందని భావిస్తున్నాము. సెప్టెంబర్ నెలలో తగ్గిన అమ్మకాలు అక్టోబర్ నెలలో పెరిగుతాయి.

Most Read Articles

English summary
Top two wheelers sales company hero bajaj honda suzuki tvs royal enfield details
Story first published: Saturday, October 9, 2021, 16:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X