భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

సిక్కు మతస్థుల సాంప్రదాయం ప్రకారం, వారు తలపై ఎల్లప్పుడూ పాగా (టర్బన్ అని పిలుస్తారు) ధరిస్తారు. రోడ్డు సేఫ్టీ విషయానికి వచ్చే సరికి వీరి విషయంలో కొన్ని ప్రాంతాల్లో హెల్మెట్ తప్పనిసరి నిబంధన కూడా సడలించబడి ఉంటుంది. అంటే, టర్బన్ ధరించిన సిక్కులు టూవీలర్‌పై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉండదన్నమాట.

భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

నిజానికి, సిక్కు బైక్ రైడర్లకు హెల్మెట్ ప్రత్యామ్నాయం లేదు. మరి వారి సేఫ్టీ మాటేంటి? తాజా సమాచారం ప్రకారం, కెనడాలోని సిక్కు మోటార్‌సైకిల్ క్లబ్ సహకారంతో స్పార్క్ ఇన్నోవేషన్ అనే కెనడా సంస్థ 'టఫ్ టర్బన్' అనే ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి టర్బన్ ధరించే సిక్కులను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని ప్రవేశపెట్టారు.

భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

ఈ ఉత్పత్తి ప్రధానంగా సిక్కు బైక్ రైడర్లకు రక్షణ టోపీ మాదిరిగా పనిచేస్తుంది. సిక్కులకు తలపాగా వారి మతంలో ఓ అంతర్భాగమని మనందరికీ తెలిసినదే. వారి సంస్కృతిని గౌరవిస్తూనే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిక్కులకు స్వారీ చేసేటప్పుడు మోటారుసైకిల్ హెల్మెట్ ధరించకుండా మినహాయింపు ఇచ్చాయి.

భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

ఈ నేపథ్యంలో, వారికి రోడ్డు ప్రమాదం జరిగితే, అటువంటి పరిస్థితిలో వారు గాయపడే ప్రమాదం ఉంది. సరిగ్గా ఈ సమస్యకు పరిష్కారం అందించడానికి టఫ్ టర్బన్ తెరపైకి వచ్చింది. ఇది చూడటానికి సాంప్రదాయ తలపాగా లాగా కనిపిస్తుంది. కానీ, వాస్తవానికి ఇందులో మూడు రక్షణ పొరలు ఉంటాయి.

భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

ఈ రక్షణ పొరలలో మొదటది నాన్-న్యూటోనియన్ ఇంపాక్ట్-అబ్జార్వింగ్ ఫోమ్, రెండవది 3డి-ప్రింటెడ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన మ్యాట్రిక్స్ మరియు చివరది ఉక్కు కంటే పది రెట్లు బలంగా ఉండే బుల్లెట్‌ప్రూఫ్ డైనెమా ఫాబ్రిక్. ఈ మూడింటి కలయికతో ఇది తలకు బలమైన రక్షణ కవచంలా ఉంటుంది.

ఈ టఫ్ టర్బన్ గురించి దాని డిజైన్ డైరెక్టర్ క్రిస్ పీరెన్ మాట్లాడుతూ, సిక్కు యోధులు యుద్ధ సమయంలో వారి తలపాగా కింద ధరించే చైన్ మెయిల్ ఈ ఉత్పత్తి నుండి స్ఫూర్తి పొంది, ఈ తలపాగాను సృష్టించినట్లు ఆయన చెప్పారు.

భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

ఈ కఠినమైన తలపాగాను సాధారణ తలపాగా మాదిరిగానే సిక్కులు వారి తల చుట్టూ సులభంగా కట్టుకోవచ్చు. ఇది చూడటానికి అచ్చం సాధారణ తలపాగా మాదిరిగానే కనిపిస్తుంది, కానీ అదే సమయంలో ఓపెన్ ఫేస్ హెల్మెట్ లాంటి రక్షణను కూడా అందిస్తుంది. ఇది సాధారణ ఉపయోగం కోసం అనువైనది.

భల్లే.. భల్లే.. సిక్కు రైడర్ల కోసం హెల్మెట్ లాంటి రక్షణనిచ్చే 'టఫ్ టర్బన్'!

టఫ్ టర్బన్ తయారీదారులు ఈ డిజైన్ సీక్రెట్‌ను ఓపెన్‌గానే ఉంచారు. అంటే మీరు వెబ్‌సైట్ నుండి దీని బ్లూప్రింట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు మీ కోసం ఉత్పత్తిని పునఃసృష్టి చేసుకోవచ్చు. కెనడా మాదిరిగా, భారతదేశంలో కూడా సిక్కు రైడర్స్ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడానికి అనుమతి ఉంది.

భారతదేశ జనాభాను పరిశీలిస్తే, ఈ ఉత్పత్తి ఖచ్చితంగా మన దేశానికి చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, హెల్మెట్ ధరించకపోవడం వల్ల భారతదేశంలో ప్రతి గంటకు నలుగురు మరణిస్తున్నారని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.

Most Read Articles

English summary
Tough Turban Safety Gear Introduced For Sikh Community Bike Riders, Details. Read in Telugu.
Story first published: Friday, June 25, 2021, 18:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X