భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) ఎట్టకేలకు తన కొత్త ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్ (Triumph Bonneville Gold Line Edition) విడుదల చేసింది. ఇది మొత్తం 5 మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్ లో 'బోన్‌విల్ టి100, బోన్‌విల్ టి120, బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్, బోన్‌విల్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మరియు బోన్‌విల్ బాబర్' (Bonneville T100, Bonneville T120, Bonneville Speedmaster, Street Scrambler మరియు Bonneville Bobber) మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్ ధరల విషయానికి వస్తే..

  • Triumph Bonneville T100 Gold Line Edition - రూ. 10.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • Triumph Street Scrambler Gold Line Edition - రూ. 9.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • Triumph Bonneville Speedmaster Gold Line Edition - రూ. 12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • Triumph Bonneville Bobber Gold Line Edition - రూ. 12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • Triumph Bonneville T120 Gold Line Edition - రూ. 11.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త గోల్డ్ లైన్ ఎడిషన్‌లోని ప్రతి బైక్‌ ప్రధానంగా రెండు-కలర్ స్కీమ్స్ పొందుతాయి. సాధారణ ఆటోమోటివ్ పెయింట్ బ్రష్‌వర్క్ కోసం చాలా సన్నగా ఉన్నందున బంగారు లైనింగ్‌ల కోసం ఉపయోగించే పెయింట్‌లు సెల్యులోజ్‌తో పౌడర్ పెయింట్‌ను సరైన అనుగుణ్యతతో కలపడం ద్వారా తయారు చేయబడతాయి. ఇవి సిద్ధమైన తర్వాత, డిజైనర్ ప్రతి గోల్డ్ లైన్ వేరియంట్‌పై తన సంతకాన్ని ఉంచడం ద్వారా వ్యక్తిగత టచ్‌ని అందజేస్తాడు.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    ట్రయంఫ్ బోన్‌విల్ T100 గోల్డ్ లైన్ ఎడిషన్:

    ట్రయంఫ్ బోన్‌విల్ T100 గోల్డ్ లైన్ ఎడిషన్ ధర రూ. 10.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎడిషన్‌ బైక్ లో సిల్వర్ ఫ్యూయల్ ట్యాంకులు, ఫ్రంట్ మరియు రియర్ మడ్‌గార్డ్‌లు మరియు ఆకుపచ్చ కలర్ ఇంధన ట్యాంక్ ఇన్‌ఫిల్‌తో కూడిన సైడ్ ప్యానెల్‌లు, హ్యాండ్-పెయింటెడ్ గోల్డ్ లైనింగ్ మరియు 'గోల్డ్ లైన్' లోగో మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    అంతే కాకూండా కొత్త వైట్ అండ్ గోల్డ్ కలర్ బోన్‌విల్ టి100 లోగో మరియు చేతితో పెయింట్ చేయబడిన గోల్డ్ కలర్ లైనింగ్‌ను కలిగి ఉన్న సైడ్ ప్యానెల్ స్ట్రిప్ గ్రాఫిక్స్‌లో ఆకుపచ్చ రంగు కూడా కలిసి ఉంటుంది. దీని డిజైన్ ను పూర్తి చేయడానికి, ఇందులోని అనుబంధ ఫ్లై స్క్రీన్ ఇప్పుడు సరిపోలే సిల్వర్ ఐస్‌ కలర్ లో అందుబాటులో ఉంటుంది.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    ట్రైయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ గోల్డ్ లైన్ ఎడిషన్:

    ట్రైయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ గోల్డ్ లైన్ ఎడిషన్ ధర రూ. 9.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్ట్రీట్ స్క్రాంబ్లర్ యొక్క గోల్డ్ లైన్ వేరియంట్ ట్యాంక్‌పై గ్రాఫైట్ స్ట్రిప్‌తో కూడిన మ్యాట్ పసిఫిక్ బ్లూ యాక్సెంట్ ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్‌కు గోల్డెన్‌ పెయింట్‌ చేయబడి ఉంటుంది.

    ఇది కాకుండా, మడ్‌గార్డ్‌కు ప్రీమియం మ్యాట్ జెట్ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వబడింది. అదే సమయంలో, కొత్త గోల్డ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ లోగో సైడ్ ప్యానెల్‌లో ఉంటుంది. మడ్‌గార్డ్‌కు సరిపోయే అనుబంధ మ్యాట్ పసిఫిక్ బ్లూ ఫ్లైస్క్రీన్ స్క్రాంబ్లర్ స్టైల్ యొక్క విజువల్ అప్పీల్‌కి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ గోల్డ్ లైన్ ఎడిషన్:

    ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ గోల్డ్ లైన్ ఎడిషన్ ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సఫైర్ బ్లాక్ ట్విన్ స్ట్రిప్ డిజైన్ మరియు బ్రష్డ్ ఫైల్ క్నీ ప్యాడ్ గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఈ బైక్‌లో హ్యాండ్ పెయింటెడ్ గోల్డ్ లైనింగ్ మరియు గోల్డ్ లైన్ లోగో కనిపిస్తుంది. కొత్త గోల్డ్ అండ్ సిల్వర్ లోగో మరియు చేతితో పెయింట్ చేసిన గోల్డ్ లైనింగ్‌ను కలిగి ఉన్న సైడ్ ప్యానెల్స్‌పై సఫైర్ బ్లాక్ యాక్సెంట్స్ కూడా ఉంటాయి. హెడ్‌ల్యాంప్ కౌల్ మరియు మడ్‌గార్డ్‌కి కూడా సఫైర్ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వబడింది.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    ట్రైయంప్ బోన్‌విల్ బాబర్ గోల్డ్ లైన్ ఎడిషన్:

    ట్రైయంప్ బోన్‌విల్ బాబర్ గోల్డ్ లైన్ ఎడిషన్ ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎడిషన్ యొక్క ప్రధాన డిజైన్ థీమ్ కార్నివాల్ రెడ్, దీనిని ఇంధన ట్యాంక్ మరియు మడ్‌గార్డ్‌పై చూడవచ్చు. ఇంధన ట్యాంక్‌పై ట్విన్ స్ట్రిప్ డిజైన్ మరియు క్నీ ప్యాడ్‌పై బ్రష్ చేసిన ఫైల్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ బైక్‌పై హ్యాండ్ మేడ్ గోల్డ్ లైనింగ్ మరియు గోల్డ్ లైన్ సిగ్నేచర్ లోగో కూడా ఇవ్వబడింది. బైక్ యొక్క సైడ్ ప్యానెల్స్ సఫైర్ బ్లాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    ట్రైయంప్ బోన్‌విల్ టి120 మరియు టి120 బ్లాక్ గోల్డ్ లైన్ ఎడిషన్స్:

    ట్రైయంప్ బోన్‌విల్ టి120 గోల్డ్ లైన్ ఎడిషన్ గ్రీన్ మరియు 'సిల్వర్ ఐస్' కలర్ లో లభిస్తుంది, హ్యాండ్-పెయింటెడ్ గోల్డ్ లైనింగ్ మరియు 'గోల్డ్ లైన్' లోగోతో ట్యాంక్‌పై గ్రీన్ ఇన్‌ఫిల్‌తో వస్తుంది. సైడ్ ప్యానెల్‌లో తెల్లటి గీత మరియు గోల్డ్ కలర్ లో బోన్‌విల్ టి120 లోగో ఉంటుంది. ఈ బైక్ మడ్‌గార్డ్‌పై సిల్వర్ ఐస్ పెయింట్ స్కీమ్ ఉంటుంది.

    భారత్‌లో Bonneville Gold Line Editions విడుదల: ధర & వివరాలు

    ఇక ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ గోల్డ్ లైన్ ఎడిషన్ విషయానికి వస్తే, దీని ట్యాంక్, ఫ్రంట్ మరియు రియర్ మడ్‌గార్డ్‌లు, హెడ్‌ల్యాంప్ కౌల్ మరియు సైడ్ ప్యానెల్స్‌పై కూడా మ్యాట్ సఫైర్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌ ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఇన్‌ఫిల్ మ్యాట్ సిల్వర్ ఐస్ పెయింట్ స్కీమ్ ఇవ్వబడింది మరియు దీనిపై గోల్డ్ లైనింగ్ ను చేతితో పెయింట్ చేయబడి ఉంటుంది. సైడ్ ప్యానెల్‌లో స్ట్రిప్ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇది కొత్త బ్లాక్ అండ్ గోల్డ్ లోగోను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Triumph bonneville goldline edition launched in india
Story first published: Tuesday, December 21, 2021, 14:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X