ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : ధర & వివరాలు

ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తమ సరికొత్త స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ రూ. 16.95 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా) ధరతో అందిస్తారు. కొత్త మోటారుసైకిల్ ఇప్పుడు కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో పాటు అప్‌డేట్ చేయబడి మంచి డిజైన్ మరియు స్టైలింగ్‌తో వస్తుంది.

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

కొత్త 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్‌ను ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించారు. 2021 కొరకు ధృవీకరించబడిన తొమ్మిది లాంచ్‌లలో ఈ మోటారుసైకిల్ మొదటిది. మోటారుసైకిల్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా బ్రాండ్ యొక్క వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయబడ్డాయి. కొత్త స్పీడ్ ట్రిపుల్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ బైక్ లో షార్ప్ బెల్లీ పాన్, రియర్ సీట్ కౌల్, కార్బన్-ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్‌ఇడి టైల్ లైట్స్ తో కూడిన కాంపాక్ట్ రియర్ సెక్షన్ కూడా ఉంది. ప్రస్తుతం ఆఫర్‌లో ఉన్న రెండు పెయింట్ స్కీమ్ అప్సన్స్ ద్వారా డిజైన్ మరింత మెరుగుపడుతుంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు, ‘మైట్రయంఫ్' కనెక్ట్ టెక్నాలజీ, కొత్త స్విచ్ గేర్, కీలెస్ ఇగ్నీషియస్ మరియు ఇంటిగ్రేటెడ్ గోప్రో కంట్రోల్స్ తో 5 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లో ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి రోడ్, రైన్, స్పోర్ట్, ట్రాక్ మరియు రైడర్ మోడ్స్.

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

కొత్త 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ బైక్ సరికొత్త 1160 సిసి త్రీ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 178 బిహెచ్‌పి మరియు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బై డైరెక్షనల్ క్విక్ స్విఫ్టర్ కూడా ఇందులో ఉంటుంది.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

ఈ కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ బైక్ లో ఓహ్లిన్స్ ఫ్రంట్ మరియు రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది ముందు భాగంలో 43 మిమీ ఎన్‌ఐఎక్స్ 30 అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు మరియు వెనుకవైపు టిటిఎక్స్ 36 మోనో-షాక్ సెటప్ రూపంలో వస్తుంది. రెండు సస్పెన్షన్ సెటప్‌లు పూర్తి-అడ్జస్టబుల్ తో వస్తాయి.

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో డ్యూయల్ 320 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒకే 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లాంచ్ : వివరాలు

ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ 830 మిమీ ఎత్తుగల సీటును కలిగి ఉంది. ఇది 15.5-లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది. కొత్త స్పీడ్ ట్రిపుల్ ఆర్ఎస్ ఒక లీటరుకు 17.86 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఒక ఫుల్ ట్యాంక్ తో దాదాపు 277 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ బైక్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ మరియు కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #triumph motorcycles
English summary
2021 Triumph Speed Triple 1200 RS Launched In India. Read in Telugu.
Story first published: Thursday, January 28, 2021, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X