ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ 'టిఈ-1' పేరుతో ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోటోటైప్ స్కెచ్ చిత్రాలను కంపెనీ వెల్లడి చేసింది. ఈ సంస్థ ఇంగ్లాండ్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయ సహకారంతో పవర్‌ట్రెయిన్‌ల రూపకల్పన మరియు ఉత్పత్తి చేస్తోంది.

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్ పెట్రోల్‌తో నడిచే ఇతర ట్రైయంప్ బైక్‌ల మాదిరిగానే శక్తివంతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ట్రైయంప్ టిఈ-1 యొక్క రెండవ దశ అభివృద్ధి పూర్తయిందని, మరికొద్ది రోజుల్లో ఈ బైక్‌కి సంబంధించిన తుది రూపకల్పనను ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది.

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

అధిక పనితీరు కలిగిన ఈ ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్‌ను శక్తివంతం చేయడానికి అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని కూడా సిద్ధం చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ బైక్ యొక్క ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కూడా తయారు చేసినట్లు ట్రైయంప్ వెల్లడించింది.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 150 కి.మీ మైలేజ్ అందించే టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్.. వివరాలు

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్‌‌లో ఉపయోగించబోయే ఎలక్ట్రిక్ మోటారు బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 174 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఉపయోగించబోయే వెహికల్ కంట్రోల్ యూనిట్‌ను కూడా కంపెనీ డిజైన్ చేసింది. ఇది థ్రోటల్ రెస్పాన్స్, రీజనరేటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను కంట్రోల్ చేస్తుంది.

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ట్రైయంప్ విడుదల చేసిన ఈ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ స్కెచ్‌లను గమనిస్తే, ఇది చూడటానికి ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్ మాదిరిగా అనిపిస్తుంది. అంతే కాకుండా, ఈ బైక్‌లో మజిక్యులర్ హ్యాండిల్ బార్, స్పోర్టీ రైడింగ్ పొజిషన్, స్పోర్టీ ఫుట్ రెస్ట్ పొజిషన్ మరియు మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్‌లు కూడా మనం గమనించవచ్చు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ట్రైయంప్ టిఈ-1 టెయిల్ డిజైన్‌ను గమనిస్తే, ఇది షార్ప్‌గా మరియు చిన్నదిగా అనిపిస్తుంది. ఇందులో సాధారణ రియర్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ కాకుండా బెల్ట్ డ్రైవ్‌తో పనిచేసే సెంటర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ఇదిలా ఉంటే, ట్రైయంప్ మోటార్‌సైకిల్ ఇండియా తమ సరికొత్త ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్‌ను వచ్చే నెలలో (ఏప్రిల్ 6వ తేదీన) భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లు ట్రైయంప్ షోరూమ్‌ల ద్వారా కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ రూ.50,000 అడ్వాన్స్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ట్రైయంప్ ట్రైడెంట్ 660 రోడ్‌స్టర్ మోటర్‌సైకిల్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్‌లో విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న విడిభాగాలను మానేసర్ వద్ద ట్రైయంప్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తారు. ఈ బైక్‌ను సరికొత్త ట్యూబ్లర్ స్టీల్ ఛాస్సిస్‌పై తయారు చేస్తున్నారు.

ఇది ట్రైయంప్ ఎలక్ట్రిక్ బైక్ 'టిఈ-1': పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్‌ల కలయిక!

ఇంజన్ విషయానికి వస్తే, ట్రైయంప్ ట్రైడెంట్ 660 బైక్‌లో 660సిసి లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 పిఎస్ శక్తిని మరియు 64 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

Most Read Articles

English summary
Triumph Reveals TE-1 Electric Motorcycle Prototype Sketch, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X