ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ట్రైయంప్ మోటార్‌సైకిల్ ఇండియా తమ మిడిల్-వెయిట్ బడ్జెట్ బైక్ 'ట్రైడెంట్ 660' భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 6, 2021వ తేదీన ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు ట్రైయంప్ షోరూమ్‌ల ద్వారా కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ రూ.50,000 అడ్వాన్స్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ కోసం కంపెనీ ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా అందిస్తోంది.

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ఈ బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ ట్రైడెంట్ 660 రోడ్‌స్టర్ మోటర్‌సైకిల్‌ను గతేడాది చివరి భాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. భారత్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇది లభ్యం కానుంది. ఈ మోడల్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్‌లో విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ఇలా దిగుమతి చేసుకున్న విడిభాగాలను మానేసర్ వద్ద ట్రైయంప్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఈ బైక్‌ను సరికొత్త ట్యూబ్లర్ స్టీల్ ఛాస్సిస్‌పై తయారు చేస్తున్నారు. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ ధర సుమారు రూ.6.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, ట్రైయంప్ ట్రైడెంట్ 660 బైక్‌లో 660సిసి లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 పిఎస్ శక్తిని మరియు 64 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటారుసైకిల్ రైడ్-బై-వైర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని ఫలితంగా ఇది వివిధ రకాల రైడింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇందులోని రైడింగ్ మోడ్‌లను కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా స్విచ్ క్లస్టర్-మౌంటెడ్ కంట్రోల్స్‌ను ఉపయోగించి ఆపరేట్ చేయవచ్చు.

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ఈ మోటార్‌సైకిల్ లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుందని సమాచారం. దీని సాయంతో రైడర్ తన మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్ట్ వివిధ రకాల యాక్సెస్‌లను పొందవచ్చు. వీటికి అదనంగా, ట్రైడెంట్ బైక్‌పై గో ప్రో కెమెరాలను ఉపయోగించడం కోసం ఓ డెడికేటెడ్ బ్లూటూత్ మాడ్యూల్‌ను కూడా ఇందులో ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ఇంకా ఇందులో పూర్తి ఎల్ఇడి లైటింగ్, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్, మిష్లిన్ రోడ్ 5 టైర్లు, షోవా అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడెడ్ అడ్జస్టబల్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇది డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో విశాలమైన హ్యాండిల్‌బార్‌లు, గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, మోకాలి ఇండెంట్‌లతో కూడిన వంపులు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, స్టెప్-అప్ సీట్, పెరిగిన టెయిల్ డిజైన్, ఎక్స్‌పోజ్డ్ మెకానికల్ బిట్స్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ మరియు పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

ఏప్రిల్ 6న ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ విడుదల; వివరాలు

ట్రైయంప్ ట్రైడెంట్ 660 సీటు ఎత్తు 805 మిమీ ఎత్తును కలిగి ఉండి, రైడర్‌కు బైక్‌పై మంచి కంట్రోల్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో 14 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది మరియు దీని బరువు 189 కిలోలుగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో కవాసకి జెడ్650 మరియు హోండా సిబి650ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Triumph Trident 660 India Launch On 6th April 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X