పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్లో తమ వినియోగదారుల కోసం 'టోటల్ కేర్' (Total Care) పేరిట ఓ కోత్త ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. ట్రైయంప్ టోటల్ కేర్ ప్రోగామ్ లో భాగంగా ఈ బ్రాండ్ యొక్క పాత మరియు కొత్త బైక్ లను కలిగిన కస్టమర్లు కంపెనీ అందించే వివిధ రకాల సేవలను మరియు ఉత్పత్తులను పొందవచ్చు.

పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

ట్రైయంప్ టోటల్ కేర్ ప్రోగ్రామ్ లో కంపెనీ ఆన్‌లైన్ సర్వీస్ బుకింగ్‌ల నుండి మొదలుకొని ఎక్స్‌టెండెడ్ వారెంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సేవల వరకు, కంపెనీ వివిధ రకాల సేవా ప్యాకేజీలను అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా, ట్రైయంప్ పాత మోటార్‌సైకిళ్లను కంపెనీ సర్టిఫై చేయనుంది. ఇందులో భాగంగా, పాత బైక్ యొక్క పరిస్థితి మరియు చరిత్రను కంపెనీ తనిఖీ చేసి, ధృవీకరిస్తుంది.

పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

టోటల్ కేర్ ప్రోగ్రామ్ లో ట్రైయంప్ అందించే కొన్ని ముఖ్య సేవలలో ఆన్‌లైన్ సర్వీస్ బుకింగ్ ఆప్షన్ కూడా ఉంది. కస్టమర్లు ఇప్పుడు తమ సర్వీస్ అపాయింట్‌మెంట్ ను 24/7 ఆన్‌లైన్‌లో త్వరగా మరియు సులభంగా బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు ట్రైయంప్ డీలర్‌షిప్‌ను సందర్శించిన ప్రతిసారీ బైక్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఫలితంగా, ఇది ఖరీదైన మెయింటినెన్స్ ఖర్చు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

కస్టమర్ల కోసం కంపెనీ అందిస్తున్న ట్రైయంప్ సర్వీస్ ప్యాకేజీలు, వాహనాల సేవల కోసం ముందుగానే చెల్లించడానికి సరసమైన మార్గాన్ని అందిస్తాయి మరియు పెరుగుతున్న సేవా ఖర్చుల నుండి కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తాయి.

పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

టోటల్ కేర్ అనే ప్యాకేజీలో కంపెనీ అందించే మరిన్ని ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • పిసిఏ మరియు లేబర్ కోసం అదనపు డిస్కౌంట్
  • 2 అదనపు ఉచిత సాధారణ తనిఖీలు
  • బైక్ రీసేల్‌పై పూర్తిగా బదిలీ చేయబడుతుంది
  • పొడిగించిన వారంటీ (ఎక్స్‌టెండెడ్ వారంటీ)
  • అధికారిక ట్రైయంప్ డీలర్‌షిప్‌లలో గ్లోబల్ వారంటీ కవరేజ్
  • అపరిమిత కిలోమీటర్ కవరేజ్
  • బైక్ యొక్క ఉత్తమ రీసేల్ విలువను ఆఫర్ చేయడం
  • ట్రైయంప్ అసిస్ట్ - రోడ్ సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఏ)
  • పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    ట్రైయంప్ రోడ్ సైడ్ అసిస్ట్ అనేది ట్రైయంప్ మరియు యూరోప్ అసిస్టెన్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రేక్డౌన్ అసిస్టెన్స్ ప్యాకేజీ. ట్రైయంప్ కస్టమర్లు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, ఆ పరిస్థితుల్లో వినియోగదారులకు బ్యాకప్ అందించడానికి రూపొందించబడిన పథకమే ఈ ట్రైయంప్ అసిస్ట్ ప్లాన్.

    పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    ట్రైయంప్ అసిస్ట్ భారతదేశంలో ట్రైయంప్ వాహనాలను రైడ్ చేసే కస్టమర్లకు 365 రోజులూ 24 గంటలూ బ్రేక్‌డౌన్ కవర్ రక్షణను అందిస్తుంది. ట్రైయంప్ ఇటీవల రోడ్ సైడ్ అసిస్టెన్స్ పరిధిలోకి వచ్చే వాహనాల శ్రేణిని 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు పెంచారు.

    పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    ట్రైయంప్ ధృవీకరించిన (ట్రైయంప్ అప్రూవ్డ్) వాహనాల విషయానికి వస్తే, వీటిపై కంపెనీ కనీసం 1 సంవత్సరం లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 1 సంవత్సరం రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ధృవీకరించబడిన వాహన నాణ్యత తనిఖీ, ఫైనాన్స్ సదుపాయం, చెల్లుబాటు అయ్యే పియూసి, వాహన చరిత్ర మరియు మైలేజ్ టెస్ట్ వంటి సేవలను అందిస్తుంది.

    పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    ఈ ప్రోగామ్ లో భాగంగా ట్రైయంప్ అందించే 30,000 లకు పైగా ఒరిజినల్ స్పేర్స్ 2 సంవత్సరాల అపరిమిత మైలేజ్ వారంటీతో లభిస్తాయి. ఇదిలా ఉంటే, ట్రైయంప్ ఇండియా దేశీయ విపణిలో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ పెద్ద ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా, ట్రైయంప్ భారత టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటోతో ఓ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.

    పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    ట్రైయంప్ - బజాజ్ జాయింట్ వెంచర్ నుండి కంపెనీ చవకైన బడ్జెట్ ఫ్రెండ్లీ మోటార్‌సైకిల్ ను విడుదల చేయాలని భావిస్తోంది. వాస్తవానికి, ఈ టూవీలర్ ఇప్పటికే మార్కెట్లోకి రావల్సి ఉండగా, కోవిడ్-19 పరిస్థితి కారణంగా ఇది ఆలస్యమైంది. బజాజ్ - ట్రైయంప్ భాగస్వామ్యం నుండి మొదటి మోటార్‌సైకిల్ FY23 చివరి నాటికి షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది.

    పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    బజాజ్ ఆటో సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త మోటార్‌సైకిల్ ను ట్రైయంప్ బ్రాండ్ క్రింద విక్రయించబడుతుందని సమాచారం. ఈ ఎంట్రీ లెవల్ మోడల్ లో బజాజ్ యొక్క 250 సిసి ఇంజన్ ను ఉపయోగించే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, కంపెనీ దీనిని సుమారు రూ. 2 లక్షల రేంజ్ లో విడుదల చేయవచ్చని అంచనా.

    పాత మరియు కొత్త బైక్‌ల కోసం 'టోటల్ కేర్' ప్రోగామ్‌ని ప్రారంభించిన Triumph

    గ్లోబల్ మార్కెట్లో Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

    ఇదిలా ఉంటే, ట్రైయంప్ తమ సరికొత్త మిడిల్-వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ స్పోర్ట్ 600 (Tiger Sport 660) ని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ బైక్ వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని సమాచారం. - ఈ బైక్‌కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Triumph total care program introduced for new and old bikes details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X