కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ తమ సరికొత్త 2021 బోన్‌విల్ రేంజ్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. కొత్త బోన్‌విల్ రేంజ్ మోడళ్లలో టి100, టి120, టి120 బ్లాక్, స్పీడ్ మాస్టర్, స్ట్రీట్ ట్విన్, బాబర్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

కొత్తగా ఆవిష్కరించిన 2021 ట్రైయంప్ బోన్‌విల్ రేంజ్ మోటార్‌సైకిళ్లు అన్నీ కూడా యూరో 5 లేదా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయని కంపెనీ పేర్కొంది. వచ్చే నెల నుండి ఈ కొత్త మోడళ్ల డెలివరీలు కూడా ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

వచ్చే ఏప్రిల్ 2021 నెలలో కొత్త స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా, కొత్తగా వచ్చిన బోన్‌విల్ మోటార్‌సైకిళ్లలో బిఎస్6 ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా బైక్ డిజైన్‌లో కూడా చిన్నపాటి మార్పులు ఉన్నట్లు ట్రైయంప్ తెలిపింది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

ట్రైయంప్ బోన్‌విల్ టి120 మరియు టి120 బ్లాక్ మోడళ్లలో కొత్త 1200సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 79 బిహెచ్‌పి శక్తిని మరియు 105 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టార్క్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

కొత్త అవతార్‌లో వస్తున్న ఈ మోటార్‌సైకిళ్ల ఫ్యూయెల్ ట్యాంక్‌లపై ట్రైయంప్ 3డి లోగోతో పాటుగా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. అంతేకాకుండా, వీటిలో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బోన్‌విల్ బ్రాండింగ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ రైడింగ్ మోడ్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

ఈ బైక్‌లలో అల్యూమినియం స్పోక్ రిమ్స్‌ను ఉపయోగించారు. ఫలితంగా వీటి బరువు 7 కిలోలు తేలికగా ఉంటాయి. వీటి ముందు భాగంలో డ్యూయల్ డిస్కులను మరియు వెనుక భాగంలో సింగిల్ డిస్క్‌ బ్రేక్‌లను ఉపయోగించారు. వీటిని బ్రెంబో బ్రాండ్ నుండి గ్రహించారు.

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

అలాగే, ట్రైయంప్ బోన్‌విల్ టి100 విషయానికి వస్తే, ఇందులో 900సిసి బిఎస్ 6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 64 బిహెచ్‌పి శక్తిని మరియు 80 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి కన్నా 4 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

ట్రైయంప్ స్ట్రీట్ ట్విన్ మోడల్‌లో 900సిసి లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 64 బిహెచ్‌పి శక్తిని, 80 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క స్టైలింగ్ మరియు సైడ్ ప్యానెల్‌లలో చిన్న మార్పులు చేయబడ్డాయి.

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

కొత్త 2021 ట్రైయంప్ స్పీడ్ మాస్టర్‌లో ఇప్పుడు మునుపటి కంటే మెరుగైన షోవా సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించారు. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ బైక్‌లో ముందు వైపు ఉపయోగించిన 47 మిమీ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ మునుపటి కంటే పెద్దదిగా ఉంటుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

స్పీడ్ మాస్టర్ మోటార్‌సైకిల్‌లో 1200సిసి పారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 77 బిహెచ్‌పి శక్తిని మరియు 107 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజన్, సైలెన్సర్, ఫ్యూయల్ ట్యాంక్ మరియు హెడ్ ల్యాంప్ వంటి ప్రాంతాల్లో క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది.

కొత్త 2021 ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ; త్వరలోనే డెలివరీలు

ఇక చివరిగా కొత్త 2021 ట్రైయంప్ బాబర్ స్పీడ్ మాస్టర్ బైక్ విషయానికి వస్తే, ఇందులో కూడా 1200సిసి ఇంజన్‌నే ఉపయోగించారు. ఇందులో పెద్ద 12-లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్, కొత్త షోవా సస్పెన్షన్ సెటప్ మరియు కొత్త 16 ఇంచ్ ఫ్లాట్ ఫ్రంట్ వీల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Triumph Unveils New 2021 Bonneville Range; Deliveries Will Start Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X