Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేయడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి టాటా గ్రూపుకి చెందిన టాటా పవర్ (Tata Power) తో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు టీవీఎస్ ప్రకటించింది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

ఈ మేరకు ఇరు కంపెనీలు ఓ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా, టీవీఎస్ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక మద్ధతను టాటా పవర్ అందించనుంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

అంతేకాకుండా, ఈ రెండు కంపెనీలు దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమగ్రంగా విస్తరించడంతో పాటుగా టీవీఎస్ మోటార్ కంపెనీ నిర్ధేశించిన వివిధ ప్రదేశాలలో సోలార్ పవర్ టెక్నాలజీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

ఈ చొరవ ద్వారా, టీవీఎస్ దేశంలోని ప్రజలు ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడాన్ని వేగవంతం చేయడానికి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క విస్తృత నెట్‌వర్క్‌ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా టీవీఎస్ మరియు టాటా పవర్ కంపెనీలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రెగ్యులర్ ఏసి ఛార్జింగ్ మరియు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేస్తాయి.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

ప్రస్తుతం టీవీఎస్ నుండి ఐక్యూబ్ (TVS iQube) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లభిస్తున్న సంగతి తెలిసినదే. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ చార్జింగ్ స్టేషన్లు టీవీఎస్ ఐక్యూబ్ వినియోగదారులందరికీ టీవీఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్ మరియు టాటా పవర్ ఈజీ ఛార్జ్ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. టీవీఎస్ కస్టమర్లు టాటా పవర్ ద్వారా అందించబడే ఈ ఛార్జింగ్ నెట్‌వర్క్ ను ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

రానున్న రోజుల్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించబోతున్న 25 ప్రాంతాల్లో కూడా ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ప్రస్తుతం, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చి, కోయంబత్తూర్, హైదరాబాద్, సూరత్, వైజాగ్, జైపూర్ మరియు అహ్మదాబాద్‌ నగరాల్లో అందుబాటులో ఉంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

ఈ సందర్భంగా, టీవీఎస్ మోటార్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ, దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మరియు త్రీవీలర్ కస్టమర్‌లకు నమ్మకమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించే లక్ష్యంలో ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పారు. టాటా పవర్ ఆధారిత టీవీఎస్ ఛార్జింగ్ స్టేషన్లు సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక వనరుల ద్వారా శక్తిని పొందుతాయి. టాటా పవర్‌తో టీవీఎస్ అనుబంధం దేశానికి హరిత భవిష్యత్తును అందించడానికి మరొక ముఖ్యమైన అడుగు అని కంపెనీ తెలిపింది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

ప్రస్తుతం, టాటా పవర్ కు దేశవ్యాప్తంగా 120 కి పైగా నగరాల్లో 5,000 లకి పైగా హోమ్ ఛార్జర్‌లు మరియు 700 లకి పైగా పబ్లిక్ ఈవీ ఛార్జర్ల నెట్‌వర్క్ ఉంది. టీవీఎస్ తో కుదిరిన కొత్త భాగస్వామ్యంతో, దేశంలో ఈవీ ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా టాటా పవర్ తమ శక్తి మరియు నైపుణ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

టీవీఎస్ మోటార్ కంపెనీ వచ్చే రెండు-మూడు సంవత్సరాలలో కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మరియు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ వాహనాలను 5kW నుండి 25kW సామర్థ్యంతో విడుదల చేయనుంది. వచ్చే రెండేళ్లలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో గణనీయమైన పాత్ర పోషించబోతున్నట్లు కంపెనీ పేర్కొంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న సంప్రదాయ వాహనాలతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం రూ. 1,000 కోట్లు పెట్టుబడిని వెచ్చించింది. రాబోయే కొద్ది నెలల్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అప్‌గ్రేడ్ మోడల్‌ ను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ 4.4 kW లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 75 కిమీ రేంజ్ ని అందిస్తుంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, చార్జింగ్ విషయానికి వస్తే, కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టైయిల్ లైట్స్, పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను జత చేయడానికి బ్రాండ్ యొక్క స్మార్ట్ కనెక్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

Tata Power తో చేతులు కలిపిన TVS: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

కొత్త టీవీఎస్ జూపిటర్ స్కూటర్ వస్తోంది..

ఇటీవలే కొత్త టీవీఎస్ రైడర్ 125 కమ్యూటర్ మోటార్‌సైకిల్ ని ప్రారంభించిన కంపెనీ, ఇప్పుడు తమ స్కూటర్ లైనప్ ని అప్‌గ్రేడ్ చేసే పనిలో బిజీగా ఉంది. గత శుక్రవారం కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. సమాచారం ప్రకారం, టీవీఎస్ నుండి కొత్తగా రానున్నది సరికొత్త 2021 జుపిటర్ 125 స్కూటర్ కావచ్చని తెలుస్తోంది. కంపెనీ అక్టోబర్ 7 న మార్కెట్లో ఆవిష్కరించనుంది.

Most Read Articles

English summary
Tvs and tata power to setup ev charging station network in india signs mou
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X